జెన్ జీ మీరు ఏం కోల్పోతున్నారో తెలుసా?

‘జెన్ జీ’…. దేశ ప్రధాని నుండి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. ఓ జనరేషన్ గురించి ఈ స్థాయిలో చర్చ జరగడం హిస్టరీలో ఇదే ప్రధమం కావచ్చు. జెన్ జీలో నైపుణ్యాలు, స్వతంత్ర్య భావాలు, పోరాట పటిమ… మునుపటి తరాల వారిని ఆకర్షిస్తున్నాయి. ఏకంగా దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఈ జెన్ జీ చేరారు అనడంలో అతిశయోక్తి లేదు. వారు తలచుకుంటే కేంద్ర మంత్రిని కూడా పదవీచ్యుతుడ్ని చేయగలరని నిరూపించారు.

1997-2012 మధ్య జన్మించిన వారిని జెన్ జీగా ధృవీకరించారు. యంగ్ ఏజ్ నుండి టీనేజర్స్ వరకు ఈ  జెన్ జీ వర్గంలో ఉన్నారు. వీరికి ముందున్న మిలీనియల్స్ కంటే ఈ జనరేషన్ బెటర్ జీవన ప్రమాణాలు అనుభవిస్తుంది అనే వాదన ఉంది. ముఖ్యంగా ఉచ్చ స్థాయికి చేరిన సాంకేతికతను జెన్ జీ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం జెన్ జీ ఆలోచనా విధానం, ప్రవర్తన మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎమోషన్స్, ఈవెంట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జెన్ జీకి అలవాటుగా మారింది.

అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మిలీనియల్స్ తో పోల్చుకుంటే… జెన్ జీ చాలా కోల్పోతున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక సవాళ్లు అనేకం జెన్ జీ ఎదుర్కోవాల్సి ఉంది. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ జీవన శైలికి వీరు దూరం అవుతున్నారు. జెన్ జీ బ్యాచ్ ఏం కోల్పోతున్నారో చూద్దాం…

సొంతింటి కల:  ప్రతి మధ్యతరగతి వ్యక్తి తన కంటూ ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఏళ్ల తరబడి సేవింగ్స్ చేస్తారు. జెన్ జీకి ఓన్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం అందని ద్రాక్షగా మారింది. ఇంటి ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో లోన్స్ ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ భారీగా వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో ఇల్లు/ఫ్లాట్ కొనుగోలు చేయడం కష్టంగా మారింది.

నగరాల్లో  కనీసం 2BHK కొనుగోలు చేయాలన్నా కోట్లలో వెచ్చించాల్సి వస్తుంది. దీంతో జెన్ జీ అద్దె గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్థిక భద్రత పొందలేకపోతున్నారు. శాలరీలో అధిక భాగం రెంట్ రూపంలో చెల్లిస్తున్న జెన్ జీ… లైఫ్ స్టైల్, ఎంజాయ్మెంట్ కి మిగిలిన శాలరీ ఖర్చు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు సేవింగ్స్ రూపంలో ఏమీ మిగలడం లేదు.

సోలో లైఫ్: భారతీయ సాంప్రదాయ జీవన శైలికి జెన్ జీ దూరం అవుతుంది. ముఖ్యంగా వివాహం, పిల్లలు వంటి కుటుంబ వ్యవస్థను కోల్పోతున్నారు. మెజారిటీ జెన్ జీ పెళ్లి చేసుకోవడం లేదు. అమ్మాయిల కొరత వలన కొందరు అబ్బాయిలకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉన్నా తీరడం లేదు. ఇంకొందరు వ్యక్తిగతంగా వివాహం వద్దనుకుంటున్నారు. జెన్ జీ గర్ల్స్ సైతం పెళ్లి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం, వారసత్వం అనే అంశాలు జెన్ జీ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ కోల్పోతున్నారు.

ఉద్యోగ భద్రత: జెన్ జీ ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సమస్య….జాబ్ సెక్యూరిటీ. AI ఎంట్రీ జాబ్ మార్కెట్ ని సమూలంగా మార్చేసింది. ప్రతి రంగంలోకి చొచ్చుకొని ఇచ్చిన AI… ఉద్యోగ భద్రతను దెబ్బతీసింది. మరో వైపు లక్షల సంఖ్యలో చదువులు పూర్తి చేసిన విద్యార్థులు జాబ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సడన్ గా జాబ్ కోల్పోతున్న జెన్ జీ ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.

వ్యక్తిగత సంభాషణలు:  సుదీర్ఘకాలం సాగిన ఆన్లైన్ ఎడ్యుకేషన్, స్క్రీన్ లకే పరిమితమైన సంభాషణలు జెన్ జీపై ప్రతికూల ప్రభావం చూపాయి. హఠాత్తుగా ఆఫీసుల్లో ఎదురయ్యే ముఖాముఖి సంభాషణల సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే తోటి ఉద్యోగుల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు.
స్వయం సమృద్ధి: జెన్ జీ అల్గారిథమ్, డిజిటల్ గ్రాటిఫికేషన్ మీద అధికంగా ఆధారపడుతున్నారు. దీని వలన స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నారు. అలాగే క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి సామర్ధ్యాలను కోల్పోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిర్దిష్ట లక్ష్యం: కొన్ని అధ్యయనాల ప్రకారం… జెన్ జీ యువతలో చాలా మందికి నిర్దిష్ట లక్ష్యం అంటూ లేకుండా పోతుంది. జీవితానికో పరమార్థం, భావన లోపిస్తున్నాయి. ఇది దీర్ఘకాలంలో వారి భవిష్యత్ పై ప్రతికూల ప్రభావం చూపనుంది.

రాజకీయ ప్రాతినిధ్యం: జెన్ జీని పరిపాలించే రాజకీయ నాయకులు వయసులో పెద్దవారు. దీంతో ప్రత్యక్షంగా జెన్ జీకి రాజకీయ ప్రాతినిధ్యం లభించడం లేదు. అలాగే జనరేషన్ గ్యాప్ కారణంగా పాలకుల అభిప్రాయాలు, ఆలోచనా విధానాలతో జెన్ నీ ఏకీభవించలేకుంది. జెన్ జీ రాజకీయంగా క్రియాశీలకం కాలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది.

 

 

 

 

Leave a Comment