భర్త ఆరోగ్యంగా ఉండాలంటే భార్య ఏం చేయాలో తెలుసా? 

ఇంటికి పెద్ద దిక్కు భర్తే.  పిల్లల చదువు-పోషణ, పెద్దల సంరక్షణతో పాటు భార్యను సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత  భర్త మీదే ఉంటుంది. మరోవైపు వృత్తి లేదా వ్యాపారం వంటి వ్యవహారాలు సమర్ధవంతంగా చక్కబెట్టాలి. ప్రొఫెషన్-ఫ్యామిలీని బ్యాలన్స్ చేస్తూ… కుటుంబ సభ్యులకు ఎలాంటి లోటు లేకుండా, సామాజిక గౌరవం సమకూర్చాల్సి ఉంటుంది.

మరి ఇన్ని బాధ్యతలు నెరవేర్చాలి అంటే భర్త ఆరోగ్యంగా ఉండాలి. అనారోగ్యంతో బాధపడేవారు పనులు సక్రమంగా నిర్వర్తించలేరు. కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు… మంచాన పడితే ఆ కుటుంబం చిన్నా భిన్నం అవుతుంది. బాధ్యతల్లో నిమగ్నమైన భర్త తన ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించవచ్చు. ఈ క్రమంలో భర్త హెల్త్ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత భార్యకు ఉంది. భర్త క్షేమం కోసం భార్యలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం..

పోషకాహారం: భర్తకు సుచి, శుభ్రతతో కూడిన బలవర్థకమైన ఆహారం సమకూర్చడం భార్య మొదటి కర్తవ్యం. పని చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి. అది ఆహారం ద్వారానే లభిస్తుంది. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు, పాలు, చేపలు, మాంసం, పప్పులు, పనీర్… వంటివి చేర్చండి. ఇక తిండి విషయంలో అలసత్వంగా ఉండకుండా చూడండి. లంచ్ బాక్స్ పూర్తిగా తినాలని నిబంధనలు పెట్టండి.

ఫిట్నెస్: భర్త రోజూ కొంత సమయం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి. మీరే చొరవ తీసుకొని ఉదయాన్నే జాగింగ్ లేదా వాకింగ్ కి తీసుకెళ్లండి. రానని మారాం చేస్తే… ప్రేమగా ఒప్పించండి. ఆఫీస్ నుండి వచ్చాక కూడా సోఫాకు పరిమితం కాకుండా… కాసేపు అలా సరదాగా బయట తిరిగి వద్దామని వాకింగ్ కి తీసుకుపోండి. వ్యాయామం అనేక వ్యాధులను దూరం చేస్తుంది.

సరిపడా నిద్ర: కనీసం 6 నుండి 8 గంటలు సుఖంగా నిద్రపోవాలని వైద్యనిపుణుల సలహా. శరీరం, మనసుకు అవసరమైన విశ్రాంతి నిద్రతో లభిస్తుంది. సరిపడా నిద్ర పోకపోతే… అలసట తీరదు. మరుసటి రోజంతా నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడితో పాటు గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

బెడ్ పై పడుకుని మొబైల్ చూస్తూ అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా గడిపే అలవాటును దూరం చేయండి. కనీసం 7 గంటలకు పైగా నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోండి. ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం భర్తకు అలవడేలా చర్యలు తీసుకోండి.

హెల్త్ చెకప్: అవసరం ఉన్నా లేకున్నా ఏడాదికోసారి హెల్త్ చెకప్స్ చేయించండి. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి వ్యాధులు ఎలాంటి సూచనలు లేకుండానే ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది. 30-40 ఏళ్ళు దాటిన వారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది. విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించండి.

మానసిక ఆరోగ్యం: రోజంతా పని చేసి అలసిపోయిన ఇంటికి వచ్చిన భర్తకు భార్య ఆలంబన కావాలి. ఆయనకు ఇష్టమైన పానీయం, వంటకం స్వయంగా చేసి అందించాలి. పక్కన కూర్చొని తన రోజు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోవాలి. ఆయన చెబుతున్న విషయాలు శ్రద్ధగా వినాలి. ఒత్తిడిలో ఉన్నారని గ్రహిస్తే… మంచి మాటలతో ధైర్యం చెప్పి, ఉపశమనం కలిగించాలి.

పైన చెప్పిన విషయాలు భర్త ఆరోగ్యంగా ఉండేందుకు కీలక పాత్ర వహిస్తాయి. ఈ ముఖ్యమైన విషయాల మీద భార్యలు దృష్టి పెట్టి నడుచుకుంటే… చింతలు లేని సంతోషకర కుటుంబం సొంతం అవుతుంది.

Leave a Comment