అమ్మో స్మార్ట్ ఫోన్..డేంజర్ లో మీ పిల్లల ఫ్యూచర్!

మొబైల్ లేని జీవితం ఊహించలేం. చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లైఫ్ ని కబ్జా చేసింది. వృత్తి, వ్యాపారం వంటి ముఖ్యమైన అవసరాలతో పాటు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు నెరిపేందుకు మొబైల్ కీలకంగా మారింది. మనిషి మెదడుకు పని తగ్గించేసిన స్మార్ట్… మనకు తెలియకుండానే మన సామర్ధ్యాలను తగ్గించేస్తుంది. అరచేతిలో అమరిపోయే మొబైల్ అందించే సౌకర్యాలు అనేకం. మొబైల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో… అంతకు మించిన అనర్థాలు కూడా ఉన్నాయి. మితిమీరిన వినియోగం కొత్తకొత్త అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది.

అలాగే మొబైల్ అనేక నేరాలకు కేంద్ర బిందువుగా మారింది అనడంలో సందేహం లేదు. మొబైల్ యూజర్స్ పలు సోషల్ మీడియా క్రైమ్స్ బారిన పడుతున్నారు. మొబైల్ లో కనిపించే మోసపూరిత సందేశాలకు టెంప్ట్ అవుతున్నారు. దాంతో సైబర్ నేరగాళ్లు సులభంగా అమాయకులను దోచుకుంటున్నారు. మొబైల్ అడిక్షన్, దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవడం పెద్దల తరం కూడా కావడం లేదు.

మరోవైపు తమ పిల్లలు మొబైల్ కి అడిక్ట్ కావడం పేరెంట్స్ ని మానసిక వేదనకు గురి చేస్తుంది. ఓ సర్వే ప్రకారం ఇండియాలో 83% నుంచి 90% టీనేజర్స్ మొబైల్ వాడుతున్నారు. సరాసరిన రోజులో 4 నుంచి 6 గంటలు మొబైల్ చూస్తూ గడిపేస్తున్నారు. విజ్ఞాన శోధనకు, తమ స్టడీస్ కి అవసరమైన సమాచారం కోసం మొబైల్ ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. సోషల్ మీడియా చాట్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా స్టార్డం కోసం మొబైల్ ని వాడేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు మానసిక, శారీరక సమస్యల బారినపడుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అయిన ముగ్గురు టీనేజ్ సిస్టర్స్… పేరెంట్స్ మొబైల్ ఇవ్వకుండా నియంత్రించడంతో 9వ అంతస్తు నుండి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశాన్ని కుదిపేసింది. చెప్పాలంటే పిల్లల్లో మొబైల్ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించిన దిగ్భ్రాంతికర సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

మొబైల్ సైడ్ ఎఫెక్ట్స్ 

స్లీప్ డిస్ట్రబెన్స్:  నిద్రకు ఉపక్రమించే ముందు బెడ్ పై కాసేపు మొబైల్ చూసి పడుకోవడం అలవాటుగా మారింది. నిజానికి ఇది చాలా చెడ్డ అలవాటు. మొబైల్ స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్… బ్రైన్ లో విడుదలయ్యే మెలటోనిన్ ని నియంత్రిస్తుంది. నిద్రకు అవసరమైన ఈ మెలటోనిన్ విడుదల కాకపోవడంతో స్లీప్ డిస్ట్రబ్ అవుతుంది. ఇది దీర్ఘకాలంలో పిల్లల్లో ఇన్సోమియా, అలసటకు కారణం అవుతుంది. తమ చదువు మీద దృష్టి కేంద్రీకరించలేరు.

మానసిక రుగ్మతలు: మొబైల్ వినియోగం డోపమైన్ ని సైతం ప్రభావితం చేస్తుంది. దీని వలన పిల్లల్లో యాంగ్జైటీ, లోసెల్ఫ్-ఎస్టీమ్, చికాకు, ఒత్తిడి వంటి తీవ్ర మానసిక సమస్యలు తలెత్తుత్తాయి. ఈ సమస్యలు పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇంట్లో, స్కూల్ లో గొడవలు పడటం చేస్తారు. క్రమశిక్షణా లోపాలు తలెత్తుత్తాయి.

పూర్ అకడమిక్ పెర్ఫార్మన్స్: మొబైల్ వినియోగం వలన పిల్లలు ఎదుర్కొనే మరో అతిపెద్ద సమస్య… చదువుల్లో వెనకబడతారు. సరిగా హోమ్ వర్క్ చేయలేరు. పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్ తో ఇంటరాక్షన్ లోపిస్తుంది. సామాజిక విలువలు, జాలీ, దయ వంటి లక్షణాలు లేకుండా ఎదుగుతారు. ఈ విధమైన ప్రవర్తన యాంటీ సోషల్ బిహేవియర్ కి కారణం అవుతుంది.

ఆన్లైన్ ప్రమాదాలు: మానసిక పరిపక్వత లేని పిల్లలు సులభంగా ఆన్లైన్ మోసాల బారిన పడతారు. సోషల్ మీడియా వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆన్లైన్లో అపరిమితంగా లభ్యమయ్యే అశ్లీల కంటెంట్ కి అలవాటు పడే ప్రమాదం ఉంది. మత్తు పదార్థాలకు అలవాటు పడిన టీనేజర్స్ ఇంటర్నెట్ లో నేరపూరిత సమాచారం కొరకు సెర్చ్ చేస్తున్నారన్న వార్తలు చూస్తున్నాం. ఈ నేరాల వెనుక మొబైల్ ఫోన్ ప్రభావం ఉందన్న విషయం ఖండించలేం.

పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

నిర్దిష్ట సమయం: చిన్న పిల్లలను పూర్తిగా మొబైల్ కి దూరంగా పెంచడం కష్టమే. ఇప్పటికే చాలా మంది పిల్లలు మొబైల్ వినియోగానికి అలవాటు పడి ఉంటారు. అందుకే మొబైల్ ఉపయోగించే సమయాన్ని క్రమంగా తగ్గించండి. ఉదాహరణకు మీ పిల్లలు రోజుకు నాలుగు గంటలు మొబైల్ వాడుతుంటే దాన్ని క్రమంగా మూడు, రెండు గంటలకు తగ్గించండి.

ఈ ప్రదేశాలకు దూరంగా ఉంచండి: పిల్లల బెడ్ రూమ్ లో మొబైల్ ఉంచకండి. అలాగే డిన్నర్ చేసే టైం లో మొబైల్ దూరం పెట్టండి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఇతర వ్యాపకాల్లో ప్రోత్సహించండి: పిల్లలను ఇతర విషయాల్లో ప్రోత్సహించండి. అవుట్ డోర్ గేమ్స్ ఆదుకునేలా చూడండి. పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేలా చేయండి.

పేరెంటల్ కంట్రోల్: పిల్లల మొబైల్స్ లో ప్రమాదకర కంటెంట్ తో కూడిన వెబ్ సైట్స్ ని లాక్ చేయండి. ఎప్పటికప్పుడు పిల్లలు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్, యాప్స్ ని గమనించండి.
ప్రేరణగా నిలవండి: పిల్లలు పేరెంట్స్ ని ఫాలో అవుతారు. మీరు వారి ముందు గంటల తరబడి మొబైల్ వాడితే దానిని వారు కూడా స్ఫూర్తిగా తీసుకుంటారు. అందుకే మీరు మొదట వీలైనంత తక్కువగా మొబైల్ వాడండి.

Leave a Comment