జీవితాన్ని కూల్చేస్తున్న కోపం! యాంగర్ మేనేజ్మెంట్ తెలుసుకోండి!

ప్రపంచంలోని ప్రతి ప్రాణికి భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని స్పష్టంగా వ్యక్తీకరించే సమర్థత మనిషికి మాత్రమే ఉంది. ఆనందం, ఆశ్చర్యం, నమ్మకం, బాధ, అసహ్యం, ఆశావాదం, కోపం మనిషిలో సాధారణంగా కనిపించే ముఖ్యమైన ఎమోషన్స్. వీటిలో కోపం ఒకటి. తమ అసహనాన్ని కోపం రూపంలో మనుషులు వ్యక్తీకరిస్తారు.

మన ఎమోషన్స్ ఆధారంగానే ప్రవర్తన ఉంటుంది. అలాగే ఎమోషన్స్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తెలియకుండానే కొన్ని రుగ్మతలను దూరం చేస్తుంది. కోపం దీనికి పూర్తిగా భిన్నం. అతిగా కోప్పడే వ్యక్తులు పలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పరిమితికి మించిన కోపం సోషల్, ఫ్యామిలీ రిలేషన్స్ ని సైతం దెబ్బతీస్తుంది. కాబట్టి యాంకర్ మేనేజ్మెంట్ పై అవగాహన పెంచుకోవడం తప్పనిసరి.

కోపానికి ప్రధాన కారణాలు 

ఒత్తిడి-అలసట: దైనందిన జీవితంలో అనేక విషయాలను చక్కబెట్టాల్సి వస్తుంది. వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడాలి. వారిని ఆర్గనైజ్ చేయాలి. వృత్తి, వ్యాపారంలో ఒత్తిడి సర్వసాధారణం. ఈ పరిస్థితులు మనుషుల్లో కోపానికి కారణం అవుతున్నాయి.  ఒత్తిడి, అలసట, విసుగు మనిషి భావోద్వేగాల మీద అదుపు తప్పేలా చేస్తాయి.

నెగిటివ్ రిజల్ట్స్: అనుకున్న ఫలితాలు రాకపోతే అందుకు కారణమైన వ్యక్తులు, వ్యవస్థల మీద కోపం వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో జరిగి, ఆశించిన రిజల్ట్స్ వచ్చినప్పుడు మనుషులు ప్రశాంతంగా ఉంటారు. వ్యక్తిగతంగా మనం ఇన్ టైం లో వర్క్ పూర్తి చేయకపోయినా, మన టీమ్ సభ్యులు విఫలమైనా కోపం వస్తుంది.

బ్యాడ్ రిలేషన్స్: కుటుంబంలో కలహాలు, టీం సభ్యులతో ఏర్పడిన అవగాహనా రాహిత్యం సైతం కోపానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీలో అశాంతి చోటు చేసుకున్న క్రమంలో వ్యక్తులు తమ అసహనాన్ని కోపం రూపంలో ఇతరుల మీద ప్రదర్శిస్తారు. సమాచార లోపం వలన కూడా కోపం వచ్చే సూచనలు ఉన్నాయి.

ఫిజికల్ రీజన్స్:  శరీరానికి సరిపడా నిద్రలేకున్నా కోపం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిద్రలేమి అలసటకు దారి తీస్తుంది. అలాగే ఆకలి, హార్మోన్ల అసమతుల్యత వంటి శారీరక అంశాలు భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయేలా చేస్తాయి.

కోపం వలన సమస్యలు 

అధిక రక్తపోటు: కోపం వలన పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో అధిక రక్తపోటు ప్రధానమైనది. బ్లడ్ ప్రెజర్… గుండె జబ్బులు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక జబ్బులకు దారితీస్తుంది.

జీర్ణ వ్యవస్థపై ప్రభావం: కోపం జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆహారం అరగకపోవడం, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేమి: కోపంతో వచ్చే మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, కండరాల ఒత్తిడి. మెదడుపై ఏర్పడే ఒత్తిడి నిద్రను దూరం చేస్తుంది. అలాగే తరచుగా తలనొప్పితో బాధపడతారు.

ఆందోళన-డిప్రెషన్: తరచుగా అధికంగా కోప్పడేవారు ఆందోళనగా ఉంటారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆందోళన దీర్ఘకాలంలో డిప్రెషన్ కి దారితీయవచ్చు.

థింకింగ్ ఎబిలిటీ: ఆలోచన శక్తి తగ్గుతుంది. అలాగే సృజనాత్మకత మీద కూడా కోపం ప్రభావం ఉంటుంది. సరైన సమయంలో, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోలేరు. కోపంలో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు సమస్యలు తెచ్చిపెడతాయి.

రిలేషన్స్ డ్యామేజ్: కోపంలో మాట్లాడే మాటలు స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధాలు చెడిపోయేలా చేస్తాయి. వారు మనల్ని దూరం పెడతారు. సామాజికంగా, కుటుంబ వ్యవస్థలో ఏకాకి అయ్యే ప్రమాదం ఉంది.

కోపాన్ని నియంత్రించే టెక్నీక్స్

డీప్ బ్రీత్ టెక్నీక్: కోపం వచ్చినప్పుడు 1 నుండి 10 అంకెలు రివర్స్ లో లెక్కించాలి. అదే సమయంలో ఒక దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వలన మెదడు శాంత పడుతుంది.

మౌనం: కోపం కలిగించే విషయం ఎదురైనప్పుడు వెంటనే స్పందించకండి. కాసేపు మౌనంగా ఉండండి. లేదా అక్కడి నుండి వెళ్లిపోండి. అప్పుడు మీ కోపం కంట్రోల్ కావడంతో పాటు, డ్యామేజ్ ని నివారిస్తుంది.

వ్యాయామం & యోగా: ప్రతి రోజూ యోగా, వ్యాయామం చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. మానసిక ప్రశాంతత చేకూర్చి కోపాన్ని అదుపులో ఉంచుతాయి. అలాగే ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోవాలి. మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, మిత్రులను కలవడం చేయండి.

Leave a Comment