ఆమె నిన్ను ప్రేమిస్తుందేమో? తెలుసుకోండిలా!

ప్రేమ విశ్వజనీనం. ప్రేమలో ఉన్న వారికి ఈ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుందట. ప్రేమ మానసిక అంశమే కాదు… శారీరక చర్య కూడాను. నచ్చిన అమ్మాయిని చూసిన వెంటనే మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. దాంతో మనసు ఆహ్లాదంగా మారుతుంది. ఇదే ప్రేమకు దారితీస్తుంది. 10 నుంచి 25 ఏళ్ల యువకుల్లో డోపమైన్ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అందుకే ఈ ఏజ్ గ్రూప్ ఈజీగా ప్రేమలో పడిపోతారు.

మనం ప్రేమించే అమ్మాయి క్లాస్ మేట్ కావచ్చు, కాలేజ్ మేట్ కావచ్చు. కొలీగ్ లేదా పక్కింటి అమ్మాయి కావచ్చు. ఒక్కోసారి రోజూ మనతో కాలక్షేపం చేసే ఫ్రెండ్ కూడా కావచ్చు. ప్రేమ అన్ కండీషనల్. ఎప్పుడు… ఎవరిపై పుడుతుందో చెప్పలేం.

ప్రేమించడం సులభమే… దాన్ని వ్యక్తపరచడమే కష్టం. మనసు చేరినంత ఈజీగా మాట చేరదు. ఐ లవ్ యూ అనే మూడు పదాలు చెప్పడం కోసం ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేసే అబ్బాయిలు ఎందరో. చెబితే కాదంటుందనో, రిలేషన్ పాడవుతుందనో… మనసులో మాట చెప్పకుండా దాచేస్తుంటారు. తను కూడా మనల్ని ఇష్టపడుతుందని తెలిస్తే… టాస్క్ ఈజీ అవుతుంది. మరి అమ్మాయి లోగుట్టు  తెలుసుకోవడం ఎలా?

మొదటి ప్రాధాన్యత మీకే 

ప్రతి విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తారు. తమ విజయాలు ముందుగా మీతో పంచుకుంటారు. మీరు అప్రిషియేట్ చేస్తే పొంగిపోతారు. అదే సమయంలో మీ విజయాలను తమ విజయాలుగా భావిస్తారు. ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. మీ కాల్స్, మెసేజ్ కి వెంటనే స్పందిస్తారు. ఇగ్నోర్ చేయరు.

మీకు సంబంధించిన ప్రతి విషయం ప్రత్యేకమే

మీ జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా గుర్తు పెట్టుకుని రెస్పాండ్ అవుతారు. మీ తొలి పరిచయం ఎప్పుడు, ఎలా అయ్యింది. అప్పటి సంభాషణలు, మీపై కలిగిన మొదటి అభిప్రాయం వంటి విషయాలు గుర్తు పెట్టుకుంటారు. ఇక  మీ బర్త్ డే అయితే వారికి చాలా స్పెషల్. కొన్ని రోజుల ముందు నుండే ప్రణాళికలు వేస్తారు. ఇష్టమైన గిఫ్ట్ సిద్ధం చేస్తారు. నీ మనసుకు దగ్గరయ్యే ఏ అవకాశం వదులుకోరు.

బాడీ లాంగ్వేజ్ 

మీతో మాట్లాడేటప్పుడు దగ్గరగా వస్తారు. మీపై చేతులు వేయడానికి, తాకడానికి సంకోచించరు. మీ మాటలైనా, చర్యలనైనా శ్రద్ధగా గమనిస్తారు. మీ కళ్ళలోకే చూస్తుంటారు. మీతో చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు. కొత్త డ్రెస్ వేసుకున్నా.. పండగలకు, వేడుకలకు ప్రత్యేకంగా రెడీ అయినా… మీకు కనిపించాలని, మీరు మెచ్చుకోవాలని ఆశగా ఉంటారు.

నువ్వు నేనుకు బదులు మనం 

ఫ్యామిలీ మేటర్స్ మాట్లాడేటప్పుడు, భవిష్యత్ ప్రణాళికలు చర్చించే సమయంలో నువ్వు, నేనుకి బదులు మనం అంటూ సంబోధిస్తారు. నువ్వు నేను ఒకటే… నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ వేరు కాదు అనే భావన వ్యక్తం చేస్తారు. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ నే అనే కోణంలో ఆమె మాటలు ఉంటాయి.

పొసెసివ్ గా ఉంటారు

మీరు తనకు మాత్రమే సొంతం అనే ఫీలింగ్ గట్టిగా ఉంటుంది. మీరు ఇంకొక అమ్మాయితో మాట్లాడినా, చనువుగా ఉన్నా, పొగిడినా బాధ పడతారు. ఆ తాలూకు బాధ తనలో ఆ రోజంతా గమనించవచ్చు. కొందరైతే నేరుగా కోపం ఎక్స్ప్రెస్ చేస్తారు.

సెక్యూర్ ఫీలింగ్ 

ప్రేమించినవారు మనతో ఉన్నప్పుడు భద్రతగా ఫీల్ అవుతారు. అంటే ఎక్కడికైనా ఒంటరిగా రావడానికి ఇష్టపడతారు. సమస్య వస్తే ముందుగా మీతో చెప్పుకుంటారు. తన గతంతో పాటు లోతైన వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి సైతం వెనుకాడరు.

ఓదార్పు అవుతారు. 

మీ ప్రతి సమస్య తమ సమస్యగా భావిస్తారు. సాధ్యమైనంత వరకు బయటపడేందుకు సహాయం చేస్తారు. మానసిక వేదనలో ఉంటే ఓదార్చుతారు. ఆ సమయంలో మీతో మరింత ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. మీ దిగులుగా ఉంటే చూస్తూ ఊరుకోలేరు. మీరు ఇష్టపడే అమ్మాయిలో పై లక్షణాలు గమిస్తే నిస్సంకోచంగా మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు.

Leave a Comment