లైఫ్ లో ఫెయిల్ అయ్యారా? ఈజీగా సక్సెస్ అవ్వండి ఇలా!

సొసైటీలో నీ స్టేటస్ ని సక్సెస్ డిసైడ్ చేస్తుంది. తాము ఎంచుకున్న రంగాల్లో విజయం సాధించిన వారిని జనాలు గౌరవంగా చూస్తారు. ఒక రోల్ మోడల్ గా చెప్పుకుంటారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్ట్… ఇండస్ట్రీ ఏదైనా సక్సెస్ మాత్రమే ఒకరికి ప్రాధాన్యత తెచ్చిపెడుతుంది. లైఫ్ లో ఫెయిల్ అయిన వాళ్లను బంధువులు, మిత్రులే కాదు… కుటుంబ సభ్యులు కూడా చిన్నచూపు చూస్తారు.

కార్, బ్యాంక్ బ్యాలన్స్, లగ్జరీ లైఫ్ సక్సెస్ తోనే సాధ్యం. కనీసం ఒక అమ్మాయి నిన్ను ఇష్టపడాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా… నువ్వు ఏదో ఒక రంగంలో విజయం సాధించాల్సి ఉంది. 30 ఏళ్ళు దాటినా కూడా ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నావంటే, నువ్వు దారుణంగా ఫెయిల్ అయినట్లే. అలా అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. జీవితంలో సక్సెస్ అయిన వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారి గురించి మాత్రమే లోకం గొప్పగా మాట్లాడుకుంటుంది.

సక్సెస్-ఫెయిల్యూర్ ని కేవలం లక్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే పొరపాటే. అది అతి కొద్ది మంది విషయంలో జరిగే మిరకిల్ మాత్రమే. అంతకు మించి ఒకరి విజయాన్ని వారి ప్రవర్తన, లైఫ్ స్టైల్, డెసిషన్స్ డిసైడ్ చేస్తాయి. అసలు ఫెయిల్యూర్ కి కారణాలు ఏమిటీ? సక్సెస్ కావాలంటే ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..

 

ఫెయిల్యూర్-సక్సెస్ ని డిసైడ్ చేసేవి ఇవే! 

గోల్స్: జీవితానికి స్పష్టమైన లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిది. ఏ తీరం చేరుతుందో ఎవరికీ తెలియదు. సక్సెస్ కావాలంటే నీ నైపుణ్యాల ఆధారంగా ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆలస్యం అయినప్పటికీ డైవర్ట్ కాకుండా దాన్ని సాధించేందుకు కృషి చేయండి. మానసిక పరిపక్వత చెందాక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఎదుటి వాళ్ళ సక్సెస్ ని చూసి లక్ష్యాన్ని డిసైడ్ చేయడం, మార్చుకోవడం సరికాదు. మీకు నచ్చిన, అందుకోగలిగిన లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి. ఫ్యామిలీ, సొసైటీ చేసే ఒత్తిడి కారణంగా ఇష్టం లేని ఇండస్ట్రీలోకి అడుగుపెడితే సక్సెస్ కాలేరు.

వాయిదా వేయకండి: చాలా మంది ఫెయిల్యూర్స్ కి ఉండే చెడ్డ అలవాటు వాయిదా వేయడం. రేపు చేద్దాం… ఎల్లుండి చేద్దాం అంటూ ముఖ్యమైన పనులు వాయిదా వేస్తుంటారు. కారణాలు వెత్తుకొని మరీ లక్ష్యానికి అవసరమైన ప్రయత్నాలు పక్కన పెట్టేస్తారు. పనులను డిలే చేయడం మీ లక్ష్యాన్ని మరింత దూరం చేస్తుంది.

మంచి పని ఆరంభించడానికి ముహూర్తం అవసరం లేదు. కాలం విలువైనది. ప్రతి నిమిషం అమూల్యమైనదే. మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలి అంటే… వాయిదా వేసే అలవాటుకు స్వస్తి చెప్పండి.

క్రమశిక్షణ: ఇది చాలా ముఖ్యం. మీరు ఎంతటి సమర్థవంతులైనా… క్రమ శిక్షణ లేకపోతే విజయాలు దక్కవు. క్రమశిక్షణ లేనివారు ఆరంభంలో సక్సెస్ అయినప్పటికీ, ఒక దశలో వేగంగా క్రిందకు పడిపోతారు. చేసే పనిని గౌరవించాలి. మీకంటే తక్కువ తెలివితేటలు, సమర్థత కలిగిన వారు కూడా క్రమశిక్షణతో మెలిగి… ఆలస్యంగా అయినా సక్సెస్ అవుతారు. వ్యసనాలు, నియంత్రణ లేని లైఫ్ స్టైల్ మీ లక్ష్యాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సక్సెస్ కావాలంటే క్రమశిక్షణతో మెలగాలి.

భయం: విజయం ధైర్యవంతులనే వరిస్తుంది. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా… ఎదిరించి నిలవాలి. నా వల్ల కాదు, నాకు అంత సామర్థ్యం లేదు, ఫెయిల్ అయితే సొసైటీ ఎగతాళి చేస్తుంది అనే భయాలు వీడాలి. ఈ ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలిచిన లెజెండ్స్ సైతం ఆరంభంలో అవమానాలు ఎదుర్కొన్నవారే. కాబట్టి ధైర్యాన్ని వీడకుండా లక్ష్యం వైపుగా అడుగులు వేయండి.

నిష్క్రమించడం: మొక్క నాటిన వెంటనే ఫలాలు రావు. సక్సెస్ కోసం సైతం వేచి చూడాలి. కొంత ప్రయాణం అనంతరం నిరాశ చెంది లక్ష్యాన్ని వీడకూడదు. సహనంగా శ్రమిస్తూ ముందుకు సాగాలి. సక్సెస్ కి నిర్దిష్టమైన సమయం లేదు. ఒకరు 5ఏళ్లకు సక్సెస్ అయితే… మరికొందరి విషయంలో 10 ఏళ్ల సమయం తీసుకోవచ్చు.

మీ లైఫ్ స్టైల్ ఇలా మార్చుకోండి… 

  • పాజిటివ్ థింకింగ్ అలవరుచుకోండి. నెగిటివిటీ మిమ్మల్ని ఎదగనీయదు.
  • నిజాయితీగా ఉండాలి. అడ్డదారుల్లో ఎదగాలనే ఆలోచన వీడండి.
  • పెద్దవాళ్ళను గౌరవించండి. వారిచ్చే గొప్ప సలహాలు పాటించండి.
  • ఈర్ష్య వదిలేయండి. సక్సెస్ అయిన వారిని స్ఫూర్తిగా తీసుకోండి.
  • బద్ధకం వీడి లక్ష్యం కోసం పూర్తి సామర్ధ్యాలను వినియోగించండి.

Leave a Comment