ఫ్రీగా క్యాన్సర్… అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఇవే!

అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ మహమ్మారికి పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. ప్రాథమిక దశలో క్యాన్సర్ ని గుర్తిస్తే కొన్ని వైద్య విధానాలతో బయటపడవచ్చు. అయితే చాలా రకాల క్యాన్సర్స్ చివరి దశ వరకు బయటపడవు. స్టేజ్ 4 క్యాన్సర్ ని జయించడం కష్టమే.

ఆధునిక జీవనశైలి క్యాన్సర్ కి ప్రధాన కారణం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం… ప్రతి 10 మంది భారతీయులలో ఒకరికి 75 సంవత్సరాల కంటే ముందే క్యాన్సర్ సోకుతుంది. 2050 నాటికి ఇండియాలో ఏటా 2.8 మిలియన్ క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక 2025లో మన దేశంలో 6.18 లక్షల క్యాన్సర్ రోగులు మరణించారని సమాచారం.  ప్లాస్టిక్ వినియోగం, ప్రాసెస్డ్ ఫుడ్స్, వాతావరణ కాలుష్యం, చెడు అలవాట్లు క్యాన్సర్ కి దారి తీస్తున్నాయి. ప్రధానంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చు.

పొగాకు వినియోగం 

ధూమపానం చేయడం… గుట్కా, ఖైనీ, పొగాకుతో కూడిన కిళ్ళీలు నమలడం వలన పలు రకాల క్యాన్సర్స్ సోకుతున్నాయి. ధూమపానం చేసేవారికి ఊరితిత్తుల క్యాన్సర్ ముప్పు ఎక్కువ ఉంది. 85% లంగ్ క్యాన్సర్ రోగులు పొగ తాగడం వలనే వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగాకు వినియోగంతో నోరు, అన్నవాహిక, గొంతు, కాలేయం, లివర్ క్యాన్సర్ తో పాటు 15 రకాల క్యాన్సర్స్ సోకుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 40% నుంచి 50% కేసులు టొబాకో వినియోగం కారణంగా నమోదు అవుతున్నాయి.

ఫిజికల్ ఇన్ యాక్టివిటీ  

శారీరక శ్రమతో కూడిన వృత్తులకు సమాజం దూరం అవుతుంది. ముఖ్యంగా యువత గంటల తరబడి కంప్యూటర్స్ కి అతుక్కుపోతున్నారు. వ్యాయామం చేయడానికి సమయం కేటాయించడం లేదు. ఈ కారణంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి… ఊబకాయానికి దారితీస్తుంది. అధిక బరువు బ్రెస్ట్ క్యాన్సర్, ఎండ్రోమెట్రియన్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్స్ కి కారణం అవుతుంది. రోజులో కొంత సమయాన్ని ఎక్సరసైజ్ కి కేటాయించండి. బరువు పెరగకుండా జాగ్రత్త పడండి.

అన్ హెల్తీ డైట్ 

మన వంటగదిలో స్వయంగా తయారు చేసుకున్న ఆహారం తినడం ఆరోగ్యకరం. ఆధునిక లైఫ్ స్టైల్ సొంతింటి ఆహారానికి అనువుగా లేదు. పని సమయాలు, బాధ్యతలు కూడా దీనికి కారణం అవుతున్నాయి. జనాలు వేళకాని వేళల్లో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, రెడ్ మీట్, రిఫైన్డ్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. శరీరానికి ముఖ్యంగా కావాల్సిన కూరగాలు, ఫైబర్ తో కూడిన ఆహారం తినడం లేదు. అన్ హెల్తీ ఫుడ్ తో దీర్ఘకాలంలో పెద్ద పేగు క్యాన్సర్ సోకే ఆస్కారం ఉంది.

ఓవర్ డ్రింకింగ్ 

ఏడాదికి 62 వేల క్యాన్సర్ కేసులు కేవలం ఆల్కహాల్ కంజంప్షన్ వల్లే నమోదు అవుతున్నట్లు నివేదిలు చెబుతున్నాయి. అతిగా మద్యం సేవించే వారు కాలేయం, నోరు, అన్నవాహిక క్యాన్సర్స్ కి గురవుతున్నారు. ప్రతి రోజూ మద్యం తీసుకునే అలవాటు ఉన్నవారు డేంజర్ జోన్లో ఉన్నట్లే. మద్యం పూర్తిగా మానేయడం మంచిది. లేదా వారానికో, నెలకో ఒకసారి తీసుకోవడం అలవాటు చేసుకోండి.

ఇలా చేస్తే క్యాన్సర్ దరిచేరదు 

ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మీ రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.

ఎప్పటికప్పుడు BMI చెక్ చేసుకోండి. వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండేందుకు ప్రయత్నం చేయండి.

హెచ్పీవీ, హెపటైటిస్ బి వంటి వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

మిడిల్ ఏజ్ వారు రెగ్యులర్ గా ఫుల్ బాడీ చెకప్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోండి.

Leave a Comment