స్కూలింగ్ కంప్లీట్ కాగానే పేరెంట్స్ లో ఆందోళన మొదలైపోతుంది. మావాడ్ని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా? అని ప్రణాళికలు వేస్తారు. అందరి దృష్టి ఈ రెండు ప్రొఫెషన్స్ మీదే ఎక్కువ ఉంటుంది. కారణం… డాక్టర్స్, ఇంజినీర్స్ సంపాదన అధికం. ఓ 5-10 ఏళ్ళు జాబ్ చేస్తే లైఫ్ సెటిల్ అవుతుందని భావిస్తారు. అప్పో సొప్పో చేసైనా… JEE, NEET ఎంట్రన్స్ టెస్ట్స్ కోసం కోచింగ్ ఇప్పిస్తారు.
ఓ ఎంఎన్సీ కంపెనీలో మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడని చెప్పుకోవడం పేరెంట్స్ గర్వంగా ఫీల్ అవుతారు. డాక్టర్ అయితే సోషల్ స్టేటస్ ఇంకా పెరుగుతుంది. అలాగే కామర్స్ విభాగంలో CA చేసిన విద్యార్థులు కూడా సెటిల్ అయితే లక్షల సంపాదించవచ్చు. మరి ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ చేసిన వారికేనా కెరీర్, ఒక ఆర్డినరీ డిగ్రీతో లక్షల్లో శాలరీ పొందలేమా? అంటే… సమాధానం ఇక్కడ ఉంది. సాధారణ డిగ్రీతో మంచి సంపాదన సాధ్యమే. ఈ జాబ్స్ లో సెటిల్ అయితే లక్షల శాలరీ పొందవచ్చు.

ప్రోడక్ట్ మేనేజర్
ప్రోడక్ట్ మేనేజర్ రోల్స్ కొరకు దేశీయ, బహుళజాతి సంస్థలు ఫ్యాన్సీ శాలరీలు ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ గోల్స్ ఆధారంగా ప్రోడక్ట్ డిజైన్ చేయడం ఈ జాబ్ రోల్. అందుబాటులో ఉన్న సాంకేతికత, సమాచారం ఉపయోగించుకుని కస్టమర్స్ ని సంతృప్తి పరిచేలా ప్రోడక్ట్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అద్భుతమైన ఫీచర్స్ తో అప్డేటెడ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయాల్సి ఉంది. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ లో సర్టిఫికేషన్ కోర్సు చేయడం ద్వారా… ఏ డిగ్రీ వారైనా ఈ జాబ్ కి అర్హత సాధించవచ్చు.
డేటా అనలిస్ట్
ప్రతి కంపెనీ భవిష్యత్ నిర్ణయాలు డేటా విశ్లేషణ ఆధారంగా ఉంటాయి. ఫాస్ట్, ప్రజెంట్ డేటాలను విశ్లేషించి భవిష్యత్తులో ఎలాంటి ప్రోడక్ట్ రూపొందించాలి, మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఫేస్ చేయాలి, కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ వంటి అంశాలు రూపొందిస్తారు. ఈ బాధ్యత డేటా అనలిస్ట్ నెరవేర్చాల్సి ఉంది. దీని కోసం SQL, EXCEL, TABLEAU నేర్చుకోవాలి.
UI/UX డిజైనర్
యాప్, వెబ్ సైట్ డిజైనర్స్ కి మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది. UI/UX డిజైనర్ కెరీర్ కి భవిష్యత్ లో డోకా లేదు. మంచి క్రియేటివిటీ స్కిల్స్ తో పాటు, డిజైనింగ్ పోర్టుపోలియో తెలిసి ఉంటే జాబ్ కి అర్హత సాధించవచ్చు. ఈ రంగం వైపుగా అడుగులు వేసి సెటిల్ కావచ్చు.
డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్
ప్రముఖ బ్రాండ్స్ కి అవసరమైన ఆన్ లైన్ ప్రకటనలు రూపొందించడం, SEO, సోషల్ మీడియా క్యాంపైన్స్ ప్రముఖంగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్స్ బాధ్యతలు. ప్రోడక్ట్ డెవలప్మెంట్, సేల్స్ బూస్ట్ కి డిజిటల్ మార్కెటింగ్ ప్రధాన సోర్స్ గా మారిన తరుణంలో… వీరికి క్రేజీ డిమాండ్ ఏర్పడింది. డిజిటల్ మార్కెటింగ్ లో సర్టిఫికెట్ కోర్సు చేసి, జాబ్ కొడితే నెలకు లక్షల శాలరీ ఆర్జించవచ్చు.
టెక్నీకల్ రైటర్స్
సంక్లిష్టమైన సాంకేతిక సమాచారాన్ని సులభంగా… అందరికీ అర్ధమయ్యే విధంగా మారుస్తారు. మీకు ఇంగ్లీష్ లో కూడా మంచి నైపుణ్యం ఉంటే… సాఫ్ట్వేర్ కంపెనీల్లో నాన్ ఇంజినీర్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రెజెంట్ టెక్నీకల్ రైటింగ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్.
HR మేనేజర్
కంపెనీలు మానవ వనరులను సమకూర్చే బాధ్యత హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ బాధ్యత. కంపెనీ అవసరాలు, జాబ్ రోల్స్ ఆధారంగా సమర్థతతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇండియాలో HR మేనేజర్స్ ఐదు అంకెల శాలరీలు తీసుకుంటున్నారు. డిగ్రీ అనంతరం HR స్పెషలైజేషన్ తో MBA చేసినవారు అర్హులు.
మేనేజ్మెంట్ కన్సల్టెంట్
కార్పొరేట్ సంస్థలు తమ సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ సలహా తీసుకుంటారు. కంపెనీ నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికలకు మెరుగైన ప్రణాళికలు అందించడమే ఈ కన్సల్టెంట్స్ బాధ్యత. మీకు గొప్ప అనలైజింగ్ స్కిల్స్ ఉంటే… ఏ డిగ్రీతో అయినా ఈ జాబ్ లో చేరవచ్చు.
పైన చెప్పిన జాబ్స్ తో పాటు కమర్షియల్ పైలట్స్, ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ జాబ్స్ తో ఆకర్షణీయమైన జీతాలు పొందుతున్నారు.
