నాగరికత కొత్త పుంతలు తొక్కుతుంది. మానవ సంబంధాలు ఊహించని మలుపు తీసుకుంటున్నాయి. పాశ్చాత్య సంస్కృతి భారతీయ యువతను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో… సోషల్ బిహేవియర్, రిలేషన్స్ కి అర్థాలు మారిపోతున్నాయి. పెళ్ళికి నో అంటున్న యువత లివ్ ఇన్ రిలేషన్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. మెట్రో, అర్బన్ సిటీస్ లో ఇప్పటికే ఈ కల్చర్ కొనసాగుతుంది.
తాగాజా ఇండియాలో కొత్త ట్రెండ్ పురుడు పోసుకుంటుంది. అదే ”రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్’. ఓ హోటల్ గదినో, వాహనాన్నో అద్దెకు తీసుకున్నట్లు బాయ్ ఫ్రెండ్ ని కూడా హైర్ చేసుకోవచ్చన్న మాట. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాల్ బాయ్ లేక కాల్ గర్ల్ తరహా కాన్సెప్ట్ కాదు. ఒంటరితనాన్ని దూరం చేసే తాత్కాలిక పద్ధతి.

రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ అంటే ఏమిటీ?
రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ ట్రెండ్… జపాన్ లో మొదలైందని సమాచారం. అక్కడ పలు సంస్థలు, కోరుకున్న యువతులకు బాయ్ ఫ్రెండ్స్ ని సప్లై చేస్తున్నాయి. అయిన వారికి దూరంగా ఉన్నవారు. ఒత్తిడితో కూడిన జాబ్ చేస్తూ, సాయంత్రానికి ఓదార్పును ఇచ్చే మిత్రులు, బంధువులు లేని వారు ఈ కాన్సెప్ట్ కి ఆకర్షితులు అవుతున్నారు.
రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ విధానం జస్ట్ టెంపరరీ. అంటే ఒక రోజులో కొన్ని గంటలు మాత్రమే బాయ్ ఫ్రెండ్ మీతో ఉంటారు. హైర్ చేసుకునే ముందే… ఎందుకు బాయ్ ఫ్రెండ్ కావాలో తెలియజేయాలి. మీరు ఎంచుకునే ప్యాకేజ్ ని బట్టి ధర ఉంటుంది. సాధారణంగా హైర్ చేసుకున్న బాయ్ ఫ్రెండ్ కి గంటల్లో రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లో శారీరక కలయిక నిషిద్ధం. క్లయింట్స్… అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ భద్రత కోసం కఠిన నియమాలు ఉంటాయి.
రూల్స్ ఇవే!
శృంగారం నిషిద్ధం: రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ సేవల్లో క్లయింట్ తో శృంగారం నిషిద్ధం. కొన్ని గంటల పాటు సాగే వారి జర్నీ ఎమోషనల్ సపోర్ట్ వరకే పరిమితం కావాలి. ఆహ్లాదకరమైన సంభాషణ, సోషల్ బిహేవియర్ మైంటైన్ చేయాలి.
పబ్లిక్ మీటింగ్స్: అద్దె మిత్రుడిని బహిరంగ ప్రదేశాల్లోనే కలవాల్సి ఉంటుంది. అంటే షాపింగ్ మాల్స్, కేప్స్, పబ్లిక్ ఈవెంట్స్ లో మాత్రమే మాట్లాడుకోవాలి. హోటల్ రూమ్స్, గెస్ట్ హౌసెస్, నగరాలకు దూరంగా నిర్జన ప్రదేశాల్లో కలిసేందుకు అనుమతి ఉండదు.
పేమెంట్ విధానం: బాయ్ ఫ్రెండ్ కి అమ్మాయిలు గంటల్లో వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇది వారు హైర్ చేసుకునే ప్యాకేజ్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా స్టాండెడ్ కంపానియన్(400-1000/గంటకు), షాపింగ్ బడ్డీ(1000-1500/గంటకు), లగ్జరీ నైట్ అవుట్/మోడల్(2000-3000 గంటకు) ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి.
అద్దె బాయ్ ఫ్రెండ్ ఎందుకు?
షాపింగ్ కంపానియన్: అమ్మాయిల షాపింగ్ గంటల తరబడి సాగుతుంది. అలాగే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో షాపింగ్ బ్యాగ్స్ క్యారీ చేయడానికి, రద్దీగా ఉన్న షాపింగ్ ఏరియాల్లో దారి చూపడానికి, ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో సలహాలు ఇవ్వడానికి బాయ్ ఫ్రెండ్ ని అద్దెకు తీసుకుంటున్నారు.
సోషల్ ఈవెంట్స్: ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఫంక్షన్స్ లో తోడుగా ఉండేందుకు సైతం బాయ్ ఫ్రెండ్స్ ని హైర్ చేసుకుంటున్నారు. అలాగే పబ్, పార్టీలకు అటెండ్ కావడానికి ఈ సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్నారు.
మానసిక ప్రశాంతత: వర్క్ స్ట్రెస్ కి రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ సర్వీస్ బెస్ట్ సొల్యూషన్ గా అమ్మాయిలు భావిస్తున్నారు. ఈ ఇండస్ట్రీలో ఉండే అబ్బాయిలు అట్రాక్టివ్ గా ఉంటారు. సెన్సాఫ్ హ్యూమర్, మెచ్యూర్డ్ కల్చర్, బిహేవియర్ కలిగి ఉంటారు. అలాగే వారు తమ టెంపరరీ గర్ల్ ఫ్రెండ్ ని జడ్జి చేయరు. ఈ కారణాల వలన అమ్మాయిలు సదరు బాయ్ ఫ్రెండ్ తో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఒంటరితనాన్ని, ఒత్తిడిని దూరం చేసుకుంటున్నారు.
ముంబై, ఢిల్లీ, పూణే వంటి నగరాల్లో కొన్ని సంస్థలు రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కస్టమర్స్ నుండి విశేష స్పందన నేపథ్యంలో మరిన్ని నగరాలకు ఈ ట్రెండ్ విస్తరించే అవకాశం ఉంది.
