ఒంటరిగా ఉన్న అమ్మాయిలు ఇంటర్నెట్ లో ఏం చూస్తారో తెలుసా? క్రేజీ డిటైల్స్ 

నేటి యువతకు ఇంటర్నెట్టే ప్రపంచం. గంటల తరబడి మొబైల్స్, ల్యాప్టాప్స్ చూస్తూ గడిపేస్తుంటారు. విశ్వాన్ని అరచేతిలోకి తెచ్చిన ఇంటర్నెట్, కావలసిన సమాచారం క్షణాల్లో అందిస్తుంది. ప్రతి చిన్న విషయానికి మనం ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాం. రెండు నిమిషాలు నెట్ అందుబాటులో లేకపోతే పిచ్చెక్కుతుంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేం. అంతర్జాలం ఆగిపోతే ప్రపంచం స్థంబించిపోతుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఇంటర్నెట్ ని వినియోగిస్తున్నారు. ఇక వయసు, వృత్తి, అవసరాల ఆధారంగా ఇంటర్నెట్ సెర్చ్ ఉంటుంది.

కాగా యువత ఎక్కువగా ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న యంగ్ గర్ల్స్ ఇంటర్నెట్ లో ఏం సెర్చ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. దీనిపై జరిపిన కొన్ని అధ్యయనాలు కీలక విషయాలు వెల్లడించాయి. ఇండియన్ గర్ల్స్ ఇంటర్నెట్ లో డైలీ దేని గురించి వెతుకుతారో చూద్దాం..

 డేటింగ్ అండ్ మ్యాచెస్ 

యంగ్ ఉమెన్ ఇంటర్నెట్ లో విరివిగా డేటింగ్ యాప్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకరితో మరొకరు భావాలు పంచుకుంటున్నారు. తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో దీర్ఘకాలం రిలేషన్ కొనసాగించేందుకు సంసిద్ధం అవుతున్నారు. ఇవి పెళ్లిళ్లకు కూడా దారితీస్తున్నాయి. 25% నుండి 30% అమ్మాయిలు, మహిళలు డేటింగ్స్ యాప్స్ వాడుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఇక పెళ్లికి సిద్ధమైన అమ్మాయిలు ఎక్కువగా మ్యాట్రిమోనీ సైట్స్ కొరకు సెర్చ్ చేస్తున్నారట. షాదీ డాట్ కామ్ వంటి ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్స్ డేటా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అలాగే అమ్మాయిలు సోషల్ మీడియాలో ఛాట్ చేస్తూ అధిక సమయం గడుపుతున్నారు.

సెల్ఫ్ కేర్ అండ్ ఫిట్నెస్ 

అమ్మాయిలు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న కేటగిరీలో సెల్ఫ్ కేర్ అండ్ వెల్నెస్ ఒకటి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్ కి సంబంధించిన సమాచారం కొరకు ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నారు. అమ్మాయిలు అందంగా కనిపించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరి అందంగా కనిపించాలంటే ఆరోగ్యం కూడా ముఖ్యం. అందుకే డైట్, యోగా, ఫిట్నెస్, ఎక్సర్సైజ్ వంటి విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ జనరేషన్ యూత్ ఫిట్నెస్ ఓరియెంటెడ్ గా ఉంటున్నారు. ఫిట్ గా కనిపించడం సోషల్ స్టేటస్ గా భావిస్తున్నారు.

వినోదం 

ఇంటర్నెట్ తో వినోదం పొందేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ అయిన నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వంటి యాప్స్ కి లాగిన్ అవుతున్నారు. తమకు నచ్చిన సినిమాలు, సిరీస్ లు చూసి ఎంజాయ్ చేస్తున్నారట. అలాగే మూవీ న్యూస్, రివ్యూస్, ఫిల్మ్ గాసిప్స్ ని చదువుతున్నారట. సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఇంస్టాగ్రామ్ యూత్ ని అమితంగా ఆకర్షిస్తుండగా… ట్విట్టర్ ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ లతో కాలక్షేపం చేస్తున్నారు. రీల్స్ చూడటానికి, చేయడానికి ఎక్కువగా ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు.

ఫ్యాషన్ & షాపింగ్ 

ఇక ఫ్యాషన్ అంటే చెవి కోసుకునే అమ్మాయిలకు పలు ఆన్లైన్ షాపింగ్ ఫ్లాట్ ఫార్మ్స్ అనంతమైన ప్రొడక్ట్స్, బ్రాండ్స్, మోడల్స్ ఆఫర్ చేస్తున్నాయి. దాంతో ఆన్లైన్ లో షాపింగ్ చేసే అమ్మాయిల సంఖ్య భారీగా ఉంది. ఓ సర్వే ప్రకారం దాదాపు 60% జెన్ జీ గర్ల్స్ ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. రిటైల్ స్టోర్స్ తో పోల్చితే తక్కువ ధరలకు గార్మెంట్స్, యాక్సెసరీస్ లభించడంతో ఆన్లైన్ షాపింగ్ కి ఆకర్షితులు అవుతున్నారు.  అలాగే దగ్గరలో ఉన్న ఫ్యాషన్ స్టోర్స్, డిస్కౌంట్స్ గురించి కూడా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.

కెరీర్ అండ్ డెవలప్మెంట్ 

అమ్మాయిలు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్న అంశాలలో ఎడ్యుకేషన్, కెరీర్, సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏం చదవాలి? సదరు కోర్సులు ఆఫర్ చేస్తున్న స్వదేశీ విదేశీ విద్యాసంస్థలు, వాటి పెర్ఫార్మన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. పర్సనాలిటీ, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంటర్నెట్ పై సమయాన్ని కేటాయిస్తున్నారు.

ఫోర్నోగ్రఫీ 

ఇండియాలో పోర్న్ వీడియోలు చూసే అమ్మాయిల సంఖ్య తక్కువేమీ కాదు. సరాసరి 30% నుంచి 35% భారతీయ స్త్రీలు పోర్న్ వీడియోలు చూస్తున్నారట. యావరేజ్ గా ఒక్కో సెషన్ కి 8.5 మినిట్స్ సమయం పోర్న్ చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

Leave a Comment