బ్లాక్ కాఫీ చేసే మ్యాజిక్… ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

పొగలు కక్కే కాఫీ లేదా టీతో చాలా మంది ఉదయం మొదలవుతుంది. ఉదయాన్నే తేనీరు తాగడం వలన బద్ధకం వదులుతుందని, శరీరం శక్తిని పుంజుకొని ఉత్తేజంగా మారుతుందని భావిస్తారు. అయితే మెజారిటీ ఇండియన్స్ కాఫీ లేదా టీని పాలు, షుగర్ తో పాటు తీసుకుంటారు. పాలు, షుగర్ కలపకుండా కాఫీ, టీలను తాగడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కాఫీ,టీలలో ఉండే ఔషధ గుణాలు పాల వలన కోల్పోతామట.

శరీరానికి మేలు చేసే కాఫీ, టీ… గింజలు, ఆకుల్లో ఉండే గుణాలను పాలలోని క్యాసిన్ ప్రోటీన్స్ నిర్జీవంగా మారుస్తాయట. కాగా బ్లాక్ కాఫీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణుల సలహా. ప్రతిరోజూ కనీసం ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం అలవాటుగా మార్చుకోవాలని అంటున్నారు. కొన్ని రకాల వ్యాధులు దరిచేరకుండా బ్లాక్ కాఫీ చెక్ పెడుతుందట. బ్లాక్ కాఫీ ప్రయోజనాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం…

బ్లాక్ కాఫీ ప్రయోజనాలు 

డైలీ బ్లాక్ కాఫీ తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. పలు వ్యాధులకు బ్లాక్ కాఫీ చెక్ పెడుతుంది. బ్లాక్ కాఫీ తాగేవారు ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుండి బయటపడొచ్చని వైద్యుల సలహా. కాలేయానికి బ్లాక్ కాఫీ మేలు చేస్తుంది. కాలేయానికి హాని చేసే కణజాలం ఏర్పడకుండా, అలాగే మచ్చలు ఏర్పడకుండా బ్లాక్ కాఫీ నివారిస్తుంది.

బ్లాక్ కాఫీని చక్కెర లేకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వలన అధిక బరువు సమస్యల నుండి బయటపడొచ్చు. కాఫీలో చక్కెర మిక్స్ చేయడం వలన కేలరీలు పెరుగుతాయి. షుగర్ లెస్ బ్లాక్ కాఫీలోని కెఫిన్ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది మెటబాలిజంను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.

ఒత్తైన,  మెరిసే జుట్టు కోరుకునే వారికి కూడా బ్లాక్ కాఫీ చక్కని పరిష్కారం. బ్లాక్ కాఫీ జుట్టు కుదుళ్లు దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలిపోవడానికి కారణమయ్యే DHT హార్మోన్ ని నిరోధిస్తుంది. జుట్టు సిల్కీ, షైన్ గా మారి… అందంగా కనిపిస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

ఎర్లీ మార్నింగ్ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే మెదడు పనితీరు మెరుగవుతుంది. బ్లాక్ కాఫీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే డిమెన్షియా ముప్పును తగ్గిస్తుంది. రోజూ బ్లాక్ కాఫీ తాగేవారు పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడే అవకాశం 60% శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్లాక్ కాఫీ కిడ్నీ ఆరోగ్యానికి కూడా మంచిదే అంటున్నారు. రోజుకు ఒకటి నుండి మూడు బ్లాక్ కాఫీ కప్పులు తాగడం సురక్షితం. మోతాదుకు మించి కూడా తాగకూడదు. అలా చేస్తే బీపీ, పొటాషియం స్థాయిలు పెరిగే ప్రమాదం లేకపోలేదు.

డయాబెటిస్ కి చెక్ పెడుతుంది

బ్లాక్ కాఫీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రోజూ బ్లాక్ కాఫీ తాగేవారు సమర్థవంతంగా డయాబెటిస్ ని ఎదుర్కోవచ్చు.

అధిక బరువుకు కూడా బ్లాక్ కాఫీ పరిష్కారం.  వ్యాయామానికి ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగండి. దాంతో శక్తి పుంజుకుని అధిక సమయం శ్రమిస్తారు. కేలరీలు కరిగి బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీ జీవక్రియను 50% పెంచుతుంది. తద్వారా పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది.

నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి, ఒత్తిడి తగ్గించడంలో బ్లాక్ కాఫీ సహాయపడుతుంది.బ్లాక్ కాఫీ మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. పనిలో ఉత్సాహంగా మార్చుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ కి కూడా బ్లాక్ కాఫీ పరిష్కారం చూపుతుంది. అందుకు అవసరమైన హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది.

బ్లాక్ కాఫీ సైడ్ ఎఫెక్ట్స్

బ్లాక్ కాఫీ సరైన సమయంలో, సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేదంటే బ్లాక్ కాఫీ కొన్ని దుష్ప్రభావాలను చూపుతుంది అవేమిటో చూద్దాం..

జీర్ణక్రియ సమస్యలు: ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మంచిది కాదని నిపుణుల సలహా. బ్లాక్ కాఫీ జీర్ణాశయంలోని యాసిడ్ ని ఉత్తేజపరుస్తుంది. దాంతో గుండెల్లో మంట, ఎసిడిటీ, ఇరిటేషన్ కలగవచ్చు.

నిద్రాభంగం: మెదడులో నిద్రకు కారణమయ్యే హార్మోన్లను కెఫైన్ నిరోధిస్తుంది. అర్థరాత్రి సమయంలో బ్లాక్ కాఫీ తాగడం వలన నిద్రపట్టదు. ఇన్సోమ్నియాకు దారితీస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దూరమవుతారు.

యాంగ్జైటీ: అధిక మోతాదులో కాఫీ తీసుకోవడం వలన స్ట్రెస్ హార్మోన్స్ ఉత్తేజం అవుతాయి. ఇది గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. యాంగ్జైటీకి కారణం అవుతుంది.

కాఫీ అడిక్షన్: కాఫీ అడిక్షన్ గా మారే అవకాశం ఉంది. కాఫీకి అలవాటు పడినవారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆస్వాదించాలి అనుకుంటారు. కాఫీ సడన్ గా మానేయాల్సి వచ్చినా లేక, సమయానికి అందుబాటులో లేకున్నా… తలనొప్పి, అలసట, చికాకు సమస్యలు తలెత్తుతాయి. ఇక కాఫీ సడన్ గా గుండె వేగాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటుకు కారణం అవుతుంది.

కాబట్టి మితంగా బ్లాక్ కాఫీని సరైన సమయాల్లో ఆస్వాదిస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లేదంటే బ్లాక్ కాఫీ శరీరానికి హాని కూడా చేస్తుంది.

 

 

 

Leave a Comment