ఇల్లు కొంటున్నారా ?  ఇవి తెలియకపోతే కొంప కొల్లేరే !   

ఇల్లు కొంటున్నారా ?  ఈ జాగ్రత్తలు తప్పనిసరి !   

ప్రపంచం ఎంత పెద్దదైనా, మన ప్రపంచం మన ఇల్లే.  అందుకే, ఇల్లు అంటే కేవలం చిరునామా మాత్రమే కాదు, రెండు తరాల జ్ఞాపకాల నిలయం. పైగా కలలను నిజం చేసే మొదటి అడుగు మన సొంత ఇల్లు. మరి అలాంటి సొంత ఇల్లు/ప్లాట్  కలిగి ఉండటం, మధ్యతరగతి వారికి అతిపెద్ద డ్రీమ్. ఇక దశాబ్దాల పాటు నగరంలో జీవిస్తున్న వారికి కూడా సొంత ఇల్లు ఉండదు. అద్దె ఇళ్లల్లో ఉంటూ, వేలకు వేలు రెంట్ చెల్లిస్తూ, యజమానుల ఆంక్షలు భరిస్తూ అసంతృప్తికర జీవనంతో నలిగిపోతూ ఉంటారు. అందుకే ఎలాగైనా తమదైన ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని రూపాయిరూపాయి కూడబెట్టి, ఇల్లు కొనాలని నగరవాసులు కలలు కంటారు.


అందుకే, ఇల్లు అంటే ఒక ఎమోషన్. అయితే ఇల్లు కొనడం అంత సులభం కాదు. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా తొందరపడి ఇల్లు కొంటే జీవితకాలం బాధపడాలి.  మోసాల బారిన పడకుండా, అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిని పొందేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం…

 

 

ఇల్లు కొంటున్నారా ?  By Telugu Needs and Teluguneeds
ఇల్లు కొంటున్నారా ? ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

 

 

ఇల్లు కొంటున్నారా ?  మరి బడ్జెట్ ఎలా నిర్ణయించుకోవాలి ?

సొంత ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు లక్షలు, కోట్లతో కూడిన వ్యవహారం. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం. సాధారణంగా తమ వద్ద ఉన్న సేవింగ్స్ తో పాటు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం ద్వారా ఇంటిని కొనుగోలు చేస్తారు. హౌస్ లోన్ కాలపరిమితి 10 నుంచి 15 ఏళ్లకు పైగా ఉంటుంది. ప్రతి నెలా EMI చెల్లించాలి అంటే భద్రతతో కూడిన జాబ్, నిరంతర ఆదాయం తప్పనిసరి. భవిష్యత్ అవసరాలతో పాటు EMI అమౌంట్ దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. ఖర్చులు తగ్గించుకుని సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం ఉత్తమం. ఇంటి కొనుగోలు వ్యయానికి అదనంగా రిజిస్ట్రేషన్ చార్జెస్, స్టాంప్ డ్యూటీస్, లాయర్ ఫీజులు వంటి ఖర్చులు ఉంటాయనే విషయం మర్చిపోకూడదు. మన ఆర్థిక స్తోమతకు లోబడి ఇంటిని కొనుగోలు చేయడం మంచిది.

ఇల్లు కొనే ముందు  ఈ వసతులు తప్పనిసరిగా చూడాలి !

ప్రధాన వసతులు లేని ఇంట్లో జీవనం నరకప్రాయం. నీరు, విద్యుత్, రహదారులు, పార్కింగ్ సమస్యలు లేని ప్రాంతాన్ని ఎంచుకోవాలి. నగరాల్లో నీటి కొరత ప్రధాన సమస్య. అయితే ఒక నగరంలోని అన్ని ఏరియాల్లో నీటి లభ్యత ఒకేలా ఉండదు. అందుకే నిరంతరం వాటర్ సప్లై కలిగిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. విద్యుత్ బ్యాకప్ , సరైన రోడ్లు ఉన్నాయా లేదా… గమనించాలి. నగరాల్లో మరొక ప్రధాన సమస్య పార్కింగ్. బైక్, కార్ పార్క్ చేసుకోవడానికి నిర్ణీత ప్రదేశం ఉండడం ఆవశ్యకం. మెట్రో, రైల్, బస్ స్టేషన్స్ వంటి రవాణా సౌకర్యాలకు తగినంత దగ్గర ప్రాంతంలో ఇల్లు ఉంటే ఇంకా మంచిది. అలాగే పిల్లల స్కూల్, మన ఆఫీస్ కి కూడా అందుబాటులో ఉండేలా ఇంటిని ఎంచుకోవాలి. అయితే అదే స్థాయిలో బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది.

ఈ పాయింట్ చాలా ముఖ్యం 

భవిష్యత్తులో  ఆ ఏరియా అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కమర్షియల్ గా డెవలప్ అవుతున్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. అప్పుడే, మన ప్రాపర్టీ విలువ భారీగా పెరుగుతుంది.  మనం పెట్టిన డబ్బుకు విలువ కలుగుతుంది.

బిల్డర్ క్రెడిబిలిటీ చెక్ చేయడం మర్చిపోవద్దు !

ఇల్లు కొంటున్నారా ?  రియల్ ఎస్టేట్ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనలు, పైపై హంగులు చూసి మోసపోకూడదు. దశాబ్దాలపాటు మనం కొనే ఆ ఇంట్లో నివసించాలి.  అందుకే నాసిరకం మెటీరియల్స్, లోపాలతో కూడిన ఇంటిని కొనుగోలు చేయకుండా జాగ్రత్తపడాలి. రియల్ ఎస్టేట్ సంస్థ లేదా బిల్డర్ ద్వారా ఇంటిని కొనుగోలు చేస్తున్న క్రమంలో… సదరు సంస్థల క్రెడిబిలిటీ చెక్ చేయాలి.  గతంలో వారు నిర్మించిన నిర్మాణాల నాణ్యత, సౌకర్యాలు పరిశీలించాలి. ఆ సంస్థలో ఇళ్ళు కొనుగోలు చేసిన కస్టమర్స్ ని స్వయంగా సంప్రదించి అభిప్రాయం సేకరించడం మంచిది. చాలా కాలంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ఉన్న నమ్మకమైన బిల్డర్ లేదా సంస్థను ఎంచుకోవడం ఉత్తమం.

ఇక న్యాయపరమైన అంశాల అత్యంత కీలకం !   

నూతన ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు విషయంలో ఇది అత్యంత కీలకమైన అంశం. లీగల్ గా అన్ని పేపర్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఇంటిని కొనుగోలు చేయాలి. లేదంటే దారుణంగా మోసపోవాల్సి ఉంటుంది. ఈ కింద పాయింట్స్ కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

1. ఇల్లు కొంటున్నారా ? ముందుగా సదరు ప్రాపర్టీకి చట్టబద్ధంగా యజమాని ఎవరు అనేది ధృవీకరించుకోవాలి.

2. ఆ ఇల్లు ఉన్న స్థానిక రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్రాపర్టీ EC (ఎన్కమ్బ్రేన్స్ సర్టిఫికెట్) అప్లై చేయాలి. ఈ EC
సర్టిఫికెట్ వల్ల, మనం ఏ ఇంటిని అయితే కొనుగోలు చేయాలనుకుంటున్నామో.. ఆ ఇంటి పై ఉన్న
బ్యాంకు రుణాలు, పాత బకాయిలు, కోర్టు విషయాలు ECతో స్పష్టం అవుతుంది.

3. లీగల్ ఇష్యుష్ ఉన్న ప్రాపర్టీ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఇలాంటి హౌస్ లు తక్కువ రేటుకి
వస్తాయి. కాబట్టి, తక్కువకి వస్తున్నాయి అని కొనొద్దు.

4. ఇక నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాల్సి వస్తే… ఆ ఇల్లు  RERA లో నమోదు అయ్యిందో లేదో
పరిశీలించాలి.

5. అలాగే, బిల్డర్ వద్ద నుండి CC (కంప్లీషన్ సర్టిఫికెట్), OC (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) తప్పనిసరిగా
తీసుకోవాలి. OC లేకుండా గృహంలో నివసించడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తోంది. కాబట్టి, ఇల్లు
కొంటున్న సమయంలో  పై సర్టిఫికెట్స్ కచ్చితంగా తీసుకోండి.

 

6. లీగల్ డాక్యుమెంట్లు చెక్ చేయండి.   

    • సేల్ డీడ్
    • టైటిల్ డీడ్ (యాజమాన్య హక్కు స్పష్టంగా ఉందో లేదో చూడాలి)
    • ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికేట్ (EC)
    • ఆమోదిత లేఅవుట్ ప్లాన్. 
  1. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో చూడండి
    • సంబంధిత స్థానిక సంస్థ నుంచి భవనానికి అనుమతి ఉందో లేదో నిర్ధారించుకోండి. 
  2. నిర్మాణ నాణ్యత (Construction Quality) చూడండి
    • గోడల్లో పగుళ్లు ఉన్నాయా?
    • నీటి లీకేజీలు ఉన్నాయా?
    • విద్యుత్, ప్లంబింగ్ పనులు సరిగ్గా ఉన్నాయా? 
  3. హోమ్ లోన్ అర్హత
    • బ్యాంకులు ఆ ప్రాపర్టీకి రుణం ఇస్తున్నాయా?
    • రుణ వడ్డీ, EMI మీ సామర్థ్యానికి సరిపోతుందా?
  4. ఇల్లు కొంటున్నారా ? భవిష్యత్ రీసేల్ విలువ చూసుకోవాలి.  
    • ఆ ప్రాంతంలో డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోండి.
    • రాబోయే రోడ్లు, మెట్రో, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి తెలుసుకోండి.
  5. న్యాయ నిపుణుడితో పత్రాలు పరిశీలించండి
    • ఇల్లు కొంటున్నారా ? అన్ని డాక్యుమెంట్లను అనుభవం ఉన్న ప్రాపర్టీ లాయర్‌తో ఒకసారి పరిశీలించడం మంచిది.

 సొంతింటి కల సాకారం చేసుకోబోయే ముందు పై జాగ్రత్తలు తప్పనిసరి. అప్పుడే మీ అభిరుచి తగిన, అన్ని సౌకర్యాలతో కూడిన చట్టబద్దమైన ఇంటిని సొంతం చేసుకోగలరు. 

 

Leave a Comment