చలికాలం వచ్చిందంటే వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఈ సమయంలో శరీరానికి తగినంత పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
అలాగే చలికాలంలో చర్మం పాడవుతుంది. పొడిబారడం, పగుళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం తాజా పండ్లు, కూరగాయలు తినాలి. మరి చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలు, పండ్లు ఏమిటో తెలుసుకుందాం.

చలికాలంలో తినాల్సిన కూరగాయలు
1. క్యారెట్
క్యారెట్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-ఎ గా మారి కంటి ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లు శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి. క్యారెట్‌ను పచ్చిగా, సలాడ్‌గా లేదా కూర రూపంలో తీసుకోవచ్చు. మార్కెట్ లో పచ్చిగా కరకరలాడే తాజా క్యారెట్స్ ని ఎంపిక చేసి కొనండి. క్యారెట్ తినడం రోజూవారి అలవాటుగా మార్చుకోండి.
2. పాలకూర
పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్-సి, విటమిన్-కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్త ఆరోగ్యానికి, ఎముకల బలానికి తోడ్పడతాయి. చలికాలంలో పాలకూరను పప్పు, కూర లేదా సూప్ రూపంలో తీసుకోవడం మంచిది. పప్పు ధాన్యాల్లో పాలకూర రుచిగా ఉంటుంది. పిల్లలు సైతం ఇష్టంగా తింటారు. పాలకూరతో తరచుగా కూరలు తయారు చేసి కుటుంబ సభ్యులతో తినిపించండి.
3. బ్రోకలీ
బ్రోకలీలో విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడతాయి. బ్రోకలీని ఆవిరిపై ఉడికించి లేదా కూరగా చేసుకుని తినవచ్చు. జీర్ణక్రియ మెరుగైతే శరీరానికి సత్తువ వస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు శరీరం సిద్ధం అవుతుంది.
4. బీట్రూట్
బీట్రూట్లో ఫోలేట్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు మేలు చేస్తుంది. బీట్రూట్ను సలాడ్‌గా, కూరగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ రుచిగా కూడా ఉంటుంది.
5. ముల్లంగి
ముల్లంగిలో నీటి శాతం, ఫైబర్, విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ముల్లంగిని పచ్చడిగా, కూరగా లేదా పరాఠాల్లో ఉపయోగించుకోవచ్చు. ముల్లంగి మార్కెట్ లో విరివిగా లభిస్తుంది. అయితే దీన్ని తినేవారి సంఖ్య తక్కువగా ఉంటుంది.
చలికాలంలో తినాల్సిన పండ్లు
1. నారింజ
నారింజలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తూ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చలికాలంలో లభించే ఈ పండును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నారింజతో అందం, ఆరోగ్యం చేకూరుతాయి.
2. జామపండు
జామపండులో విటమిన్-సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తికి తోడ్పడటంలో సహాయపడుతుంది. చిరుతిండిగా జామపండును తీసుకోవచ్చు. జామపండు చౌకగా దొరికే పోషకాలతో కూడిన ఆహారం.
3. దానిమ్మ
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, శరీర కణాల రక్షణకు ఉపయోగపడతాయి. ప్రతిరోజూ తగిన మోతాదులో దానిమ్మ గింజలను తీసుకోవచ్చు. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
4. ఆపిల్
ఆపిల్‌లో ఫైబర్, విటమిన్-సి, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఆపిల్‌ను ఆరోగ్యకరమైన చిరుతిండిగా తీసుకోవచ్చు.
5. బొప్పాయి
బొప్పాయిలో విటమిన్-ఎ, విటమిన్-సి, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని పోషకాలు కంటి ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. పండిన బొప్పాయిని అల్పాహారం తర్వాత తీసుకోవచ్చు.
చలికాలంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు
- రోజూ వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.
- కాలానుగుణంగా లభించే తాజా పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- తగినంత నీరు తాగాలి. చలిగా ఉందని నీరు తాగడం తగ్గించకూడదు.
- వేడి సూప్‌లు, పప్పులు, పోషకాలు కలిగిన ఇంటి ఆహారాన్ని తీసుకోవాలి.
- అధికంగా నూనె, చక్కెర, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
చలికాలంలో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. క్యారెట్, పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలతో పాటు నారింజ, జామ, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం అలవాటు చేసుకుంటే చలికాలాన్ని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు. ప్రకృతి అందించే కాలానుగుణ పండ్లు, కూరగాయలే మన ఆరోగ్యానికి సహజమైన పోషక సంపద!
