బాయ్స్ లో అమ్మాయిలు ఏం చూసి అట్రాక్ అవుతారో తెలుసా?

అమ్మాయిల ప్రేమ కోసం అబ్బాయిలు తపిస్తూ ఉంటారు. అయితే అమ్మాయిల మనసు గెలుచుకోవడం అంత ఈజీ కాదు. ఇక చాలా మంది అమ్మాయిలు గుణం కంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చూడగానే నచ్చేసే ఆకర్షణీయమైన అబ్బాయిలకు అమ్మాయిలు దగ్గరవుతారు. యావరేజ్ అబ్బాయిలు మాత్రం తమ అందానికి మించి తెలివి తేటలు, సెన్సాఫ్ హ్యూమర్, సోషల్ బిహేవియర్ వంటి యూనిక్ క్వాలిటీస్ తో అమ్మాయిల ప్రేమను పొందుతారు.

సాధారణంగా అబ్బాయిల్లో ఉండే కొన్ని ఫీచర్స్, ఫిజికల్ ట్రైట్స్… అమ్మాయిలను ఆకర్షిస్తాయట. ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అయితే మెజారిటీ అమ్మాయిలు అబ్బాయిల్లో తమకు ఎలాంటి ఫిజికల్ క్వాలిటీస్ నచ్చుతాయో పలు సర్వేల్లో తేల్చారు. అమ్మాయిలను ఆకర్షించే అబ్బాయిల బాడీ పార్ట్స్ ఏమిటో చూద్దాం..

కళ్ళు: ఒక వ్యక్తి మనకు ఎదురుపడితే ముందు ముఖం చూస్తాం. ఆ ముఖంలో మొదట రిజిస్టర్ అయ్యేది కళ్ళే. ఇక కళ్ళు అనేక భావాలు మౌనంగా వ్యక్తపరుస్తాయి. అందుకే అమ్మాయిలు ఇష్టపడే వాటిలో కళ్ళకు మొదటి స్థానం దక్కింది. అందమైన కళ్ళున్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారట.

పెదవులు&నవ్వు: ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉండే వ్యక్తులను ఎవరైనా ఇష్టపడతారు. వారితో ఉంటే సమయం తెలియదని, మనసుకు హాయిగా ఉంటుందని భావిస్తారు. అబ్బాయిల నవ్వు కూడా అమ్మాయిలు ఇష్టపడే మరొక కారణం అట. కోపం, చిరాకు ముఖంతో ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు అయిష్టమట. నవ్వుతూ… నవ్విస్తూ ఆనందం పంచే అబ్బాయిలు కావాలని యువతులు కోరుకుంటున్నారు. బ్యాలన్స్డ్ రేషియోతో కూడిన లేత గులాబీ రంగు పెదాలు ఆకర్షణగా ఉంటాయి. అందుకే అందమైన పెదాలు కూడా అమ్మాయిలు ఇష్టపడేందుకు దోహదం చేస్తాయట.

భుజాలు&ఛాతి: వెడల్పాటి భుజాలు, ఛాతి ఉన్న అబ్బాయిలంటే తమకు ఇష్టమని అమ్మాయిలు చెబుతున్నారు. భుజాలు, ఛాతి ఉన్న అబ్బాయిలు ధృడంగా ఉంటారు. వారు తోడుగా ఉంటే రక్షణగా ఉంటుందని అమ్మాయిల అభిప్రాయం అట. అలాగే ఈ ఫీచర్స్ యువకులను అందంగా మార్చుతాయి.

చేతులు: చాలా మంది అమ్మాయిలు ఓ అబ్బాయిని కలిసినప్పుడు అతని చేతులు, ముంజేతులు, వేళ్ళు గమనిస్తారట. మంచి షేప్ తో ధృడమైన చేతులు ఉన్న అబ్బాయిలంటే ఇష్టపడతారట. బలహీనమైన చేతులు, మురికితో నిండిన గోళ్లు, అరచేతులు ఉన్న అబ్బాయిలను ఇష్టపడరు అట. కాబట్టి అబ్బాయిలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

జుట్టు: అమ్మాయిలను అధికంగా ఆకర్షించే బ్యూటీ ఫీచర్స్ లో జుట్టు ఒకటి. ఒత్తైన, మెరిసే… సిల్క్ హెయిర్ కలిగిన అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం అట. జుట్టు ఇచ్చే అందం అబ్బాయిలకు ప్లస్ అవుతుంది. జుట్టులేని అబ్బాయితో పబ్లిక్ లో తిరిగేందుకు కూడా అమ్మాయిలు సిగ్గుపడతారు అనేది నిజం. అందుకే జుట్టు పోతుందంటే అబ్బాయిలు సర్వం కోల్పోతున్నట్లు బాధపడతారు.

జా-లైన్: షార్ప్ అండ్ పర్ఫెక్ట్ షేప్ తో కూడిన జా లైన్ ముఖానికి చక్కని రూపం ఇస్తుంది. అమ్మాయిలను ఆకర్షించే అంశాల్లో దవడ భాగం కూడా చేరింది. జా లైన్ మీరు యంగ్ గా కనిపించేందుకు దోహదం చేస్తుంది. ముఖంలో సమతుల్యత, ఆత్మవిశ్వాసం జా లైన్ ద్వారా సాధ్యం. పర్ఫెక్ట్ జా లైన్ అమ్మాయిలను ఆకర్షిస్తుంది.

వీపు భాగం: V షేప్ వీపు భాగం అమ్మాయిలను ఆకర్షించే మగవాళ్ల ఫిజికల్ ఫీచర్ అట.V షేప్ వీపు ఫిట్నెస్ తోనే సాధ్యం. రెగ్యులర్ గా వ్యాయామం చేసే అబ్బాయిల్లో ఇది చూడొచ్చు. ఊబకాయం, అధికబరువు కలిగిన అబ్బాయిలకు ఇది సాధ్యం కాదు. కాబట్టి అమ్మాయిలను ఆకర్షించాలి అంటే ఫిట్నెస్ తప్పనిసరి.

అయితే బాహ్య సౌందర్యం తాత్కాలికం మాత్రమే. అందానికి ఆకర్షితులై అమ్మాయిలు పోసపోకూడదు. నచ్చిన అబ్బాయి గుణగణాలు మంచివేనా… అని ఆలోచించాలి. పైపై మెరుగులు చూసి మోసపోకూడదు. ఇక అందంగా లేని వ్యక్తులను చిన్న చూపు చూడటం, అవమానించడం సరికాదు. అది నేరం కూడాను. ఒకరిని భాగస్వామిగా ఎంచుకునే క్రమంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి.
 

 

Leave a Comment