ఈ చిన్న అలవాట్లతో వందేళ్లు బ్రతికేయొచ్చు తెలుసా?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆధునిక జీవన శైలి కారణంగా మానవజాతిని పలు వ్యాధులు పీడిస్తున్నాయి. డబ్బు, హోదాతో సంబంధం లేకుండా అన్ని వర్గాలవారు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో జనాల్లో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది. ఆరోగ్యం కోసం తమ సంపాదనలో భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు వేలకు వేలు వెచ్చిస్తున్నారు. మంచి ఆహారం తీసుకుంటున్నారు. పెరిగిన ధరల రీత్యా ఫిట్నెస్, హెల్త్ కోసం ప్రత్యేకంగా తీసుకునే డైట్ కూడా ప్రీమియమ్ గా తయారైంది.

వేలల్లో నెలకు జిమ్ ఫీజులు చెల్లించడం, ఖరీదైన ఆహారం తినడం మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు భారం. ధనిక వర్గాల మాదిరి వారు ఆరోగ్యం కోసం వెచ్చించలేరు. అయితే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మీ ఆయుష్షును పెంచుతాయి. మీరు జిమ్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. రిచ్ డైట్ ప్లాన్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. వీటినే మైక్రో హ్యాబిట్స్(Micro-Habits) అంటారు. ఈ మైక్రో హ్యాబిట్స్ దీర్ఘకాలం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలా ఉపయోగపడతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మైక్రో హ్యాబిట్స్ అంటే ఏమిటీ?

మన రోజువారీ జీవితంలో సులభంగా చేయదగిన, అలవర్చుకోగలిగిన అలవాట్లను, చర్యలను మైక్రో హ్యాబిట్స్ అంటారు. ఈ అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. మీ క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటాయి. వీటి కోసం మీరు డబ్బు, అధిక సమయం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ మైక్రో హ్యాబిట్స్ ని దీర్ఘకాలం క్రమం తప్పకుండా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఖరీదైన జిమ్స్ కి వెళ్లకుండానే, రిచ్ డైట్ ప్లాన్స్ ఫాలో కాకుండానే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అందుకే వైద్య నిపుణులు మైక్రో హ్యాబిట్స్ పై అవగాహన పెంపొందిస్తున్నారు.

మ్యాక్రో హ్యాబిట్స్ ఇవే 

ఉదయం వేళల్లో సూర్యరశ్మి: జనాలు సూర్యుని ముఖాన్ని చూడటమే మానేశారు. ముఖ్యంగా నగరాల్లో సూర్యరశ్మి శరీరానికి తగలడమే అరుదు. ఉదయం కార్లో ఆఫీస్ కి బయలుదేరి నేరుగా కార్యాలయంలో అడుగుపెడతారు. రోజంతా ఏసీలో వర్క్ చేసి, రాత్రి ఇంటికి వస్తారు. మొక్కలకు సూర్యరశ్మి ఎంత అవసరమో మనిషికి కూడా అంతే అవసరం.

ఉదయాన్నే కాసేపు ఎండలో కూర్చోండి. సూర్యరశ్మి మన శరీరానికి విటమిన్ డి అందిస్తుంది. అలాగే బాడీ క్లాక్ ని క్రమబద్ధం చేస్తుంది. జీవ గడియారం సరిగా పని చేస్తే టైంకి నిద్రలేవడం, నిద్రపోవడం జరుగుతుంది. మీ రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. ఉదయం 6 నుండి 9 గంటల లోపు కాసేపు శరీరానికి ఎండ తగిలే ప్రాంతంలో కూర్చోవడం మంచిది. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉంటే తక్కువ సమయం గడిపితే సరిపోతుంది.

ప్రతిరోజూ నడవడం: గంటల తరబడి జిమ్ లో వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా నడవండి. 15 నిమిషాలు నుంచి నడక సమయం క్రమేణా పెంచుకుంటూ పోవాలి. నడకతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమ విధానం. వాకింగ్… రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మానసిక ప్రశాంతత చేకూర్చుతుంది. రోజంతా కూర్చుని పని చేసేవారు… మధ్య మధ్యలో లేచి కాసేపు నడిచి మరలా పని చేసుకోవాలి. మైక్రో హ్యాబిట్స్ లో నడక ఒకటి.

కఠిన కసరత్తులు అవసరం లేదు: అందరి శరీర సామర్థ్యం ఒకేలా ఉండదు. అలాగే జిమ్ లో కఠిన వ్యాయామం చేసే ముందు ఆరోగ్య పరిస్థితి, వయసు వంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇతరులను చూసి మనం కూడా జిమ్ లో కష్టపడాలి అనుకోవడం పొరపాటు. శ్రమతో కూడిన వ్యాయామం చేయకుండానే… మైక్రో హ్యాబిట్స్ తో గొప్ప ఆరోగ్యం పొందవచ్చు. వ్యాయామం చేసే సామర్థ్యం, ఆరోగ్యం, వయసు లేనివారు… నడక, సైక్లింగ్, యోగా వంటి మార్గాలు ఎంచుకోండి. ఈ మైక్రో హ్యాబిట్స్ శరీరాన్ని, మనసును పటుత్వంగా మారుస్తాయి. యోగాతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి.

నిద్ర-ఆహారం కీలకం: వ్యాయామంతో పాటు మనిషికి నిద్ర, సమతుల్య ఆహారం చాలా అవసరం. వయసులో పెద్దవారు కనీసం రోజుకు 7 నుండి 9 గంటలు నిద్రపోవాలి. ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా నిద్రలేవడం అలవర్చుకోవాలి. ఆహారం విషయానికి వస్తే… పండ్లు, కూరగాయలు, పప్పులు, తగినంత ప్రోటీన్లు ఉన్న సమతుల్య ఆహారం తినాలి. నీటిని తగినంత తాగాలి. రోజులో కనీసం 3 లీటర్ల నీటిని త్రాగడం ఆరోగ్యానికి మంచిది. పొగ తాగడం, మద్యం అధికంగా సేవించడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండండి.

దీర్ఘాయుష్షుకు మైక్రో హ్యాబిట్స్ పునాది: ఎక్కువ కాలం జీవించడమే కాదు, ఆ జీవనం ఆరోగ్యకరంగా సాగాలి. అందుకు మైక్రో హ్యాబిట్స్ దోహదం చేస్తాయి. వెంటనే ఫలితాలు కనిపించకపోయినా క్రమం తప్పకుండా పాటిస్తే దీర్ఘకాలంలో అద్భుతాలు చూడవచ్చు. మైక్రో హ్యాబిట్స్ మీ దినచర్యలో భాగం చేసుకోండి. అయితే మైక్రో హ్యాబిట్స్ మాత్రమే మీకు దీర్ఘాయుష్షు ఇవ్వవు. మన శరీర జన్యువులు, పరిసరాలు, వైద్య సంరక్షణ, జీవనశైలి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.

Leave a Comment