మీ పిల్లలు జెమ్స్ అని చెప్పే లక్షణాలు ఇవే! తెలుసుకోండి!

తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచం. వారి భవిష్యత్ కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుండే కేర్ తీసుకుంటారు. వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి? ఏ స్కూల్ లో చదివించాలి? ఎలాంటి బుద్ధులు నేర్పాలి? అని ప్రణాళికలు వేస్తారు. పిల్లల కెరీర్ బాగుండాలని, పెద్దయ్యాక మంచి స్థితికి చేరుకోవాలని ఆశపడతారు. అందుకు పేరెంట్స్ త్యాగాలు కూడా చేస్తారు. తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకున్నప్పటికీ వారి భవిష్యత్ తెలివితేటలు, లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది.

పిల్లలకు శారీరక, మానసికమైన లక్షణాలు చాలా వరకు తల్లిదండ్రుల నుండే సంక్రమిస్తాయి. పేరెంట్స్ తెలివి, క్రమశిక్షణ వంటి లక్షణాలు కలిగి ఉంటే పిల్లలు కూడా అదే క్వాలిటీస్ తో పుట్టే అవకాశం ఉంది. లేదంటే స్పెషల్ కేర్ తీసుకోవడం ద్వారా వారిని ప్రయోజకులను చేయవచ్చు. కాగా పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు వారి తెలివితేటలను ప్రతిబింబిస్తాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.  ఆలోచనా విధానం, సృజన, భావోద్వేగాల నియంత్రణ, అలవాట్లు బాల్యంలోనే వారు సూపర్ కిడ్స్ అని తేల్చేస్తాయి. పిల్లలు తెలివైనవారు అని సూచించే లక్షణాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం..

ఇలా చేస్తే మెదడు చురుకుగా ఉందని అర్థం 

పిల్లల మెదడు చురుకుగా ఉందని తెలిపే కొన్ని లక్షణాలను మానసిక వైద్యులు వెల్లడించారు. తరచుగా ప్రశ్నలు అడిగే పిల్లల మెదడు పనితీరు బాగుందని అంచనాకు రావచ్చు. ఇది ఏమిటీ? ఈ వస్తువు ఎందుకు? ఎలా పని చేస్తుంది? అని ప్రశ్నలు అడగడం పిల్లల తెలివి తేటలకు సూచకం. ఇలాంటి పిల్లల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి గమించవచ్చు. మెదడు పెరుగుదల ఆరోగ్యంగా ఉందని అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ని ప్రశ్నలు అడిగి కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం చూపించే పిల్లలు భవిష్యత్తులో విజయాలు సాధిస్తారట.

సృజనాత్మకత 

ఆరోగ్యవంతమైన, తెలివైన పిల్లల్లో కనిపించే మరో లక్షణం క్రియేటివిటీ. డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, కొత్త కొత్త ఆలోచనలు చేయడం ఈ కోవలోకి వస్తాయి. చూసిన వస్తువులను, మనుషులను, జంతువులను బొమ్మలుగా వేయాలని పిల్లలు కోరుకుంటారు. అలాగే తాము విన్న కథలు, తమకు తోచిన కథలు చెబుతారు. బాల్యంలోనే సృజనాత్మకత ఉన్నవారు పెద్దయ్యాక నూతన ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల ఆసక్తిని గమనించి వారిని ప్రోత్సహించాలి. వారి క్రియేటివ్ థాట్స్ ని మెచ్చుకోవాలి. కేవలం చదువులో వెనకబడినంత మాత్రాన తెలివి తక్కువ వారిగా చూడకూడదు.

పరిష్కరించే తత్త్వం 

సాధారణంగా పిల్లలు ప్రతి సమస్య పరిష్కారానికి పేరెంట్స్ మీద ఆధారపడతారు. బాల్యంలో పెద్దలు చూపించే కేరింగ్ అందుకు కారణం. కొందరు పిల్లలు మాత్రం స్వతంత్ర్యం గా ఆలోచిస్తారు. తమ సమస్యలను తామే స్వయంగా పరిష్కరించుకోవాలని భావిస్తారు. పుస్తకాలు పాడవకుండా చూసుకోవడం, బ్యాగ్ నీట్ గా సర్దుకోవడం, బుక్స్, పెన్స్, పెన్సిల్స్ జాగ్రత్తగా దాచుకోవడం, హోమ్ వర్క్ స్వయంగా చేసుకోవడం ఈ కోవకు వస్తాయి. ఇలా పేరెంట్స్ పై ఆధార పడకుండా తమ వ్యవహారాలను తామే స్వయంగా చక్కదిద్దుకుంటారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లలు భవిష్యత్ లో లీడర్స్ గా ఎదిగే అవకాశం ఉంది. కార్యాలయాల్లో కూడా కొందరికి నాయకత్వం వహించే స్థితికి చేరుతారు.

ఎమోషన్స్ పై అవగాహన

ఎమోషన్స్ ని అంచనా వేయడం, అర్థం చేసుకోవడం సూపర్ కిడ్స్ కి ఉండే మరో క్వాలిటీగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎదుటివారి బాధ, సమస్య, భావోద్వేగాలు అర్థం చేసుకోవడం, అందుకు అనువుగా మెసలడం మంచి లక్షణం. భావోద్వేగాలను అంచనా వేసే సామర్థ్యం ఉన్న పిల్లలు ఇతరులకు సహాయం చేయడం, ఓదార్చడం చేస్తారు. ఈ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వారు సామాజికవేత్తలుగా ఎదగవచ్చు. సమాజంలో ఉన్న చెడును ప్రశ్నించి, మార్పు కోసం ప్రయత్నం చేసే నాయకులు కావచ్చు.

పట్టుదల 

పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన గొప్ప లక్షణం. సమస్యలకు, భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లకు భయపడకుండా ముందుకు సాగాలంటే పట్టుదల ఉండాలి. మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపకుండా పూర్తి చేసే వరకు నిరంతరం శ్రమించాలి. ఈ లక్షణం పిల్లల్లో బాల్యంలోనే గమనించవచ్చు. ఎంత కష్టమైనా హోమ్ వర్క్ పూర్తి చేయడం, కోరుకున్న గ్రేడ్ సాధించే వరకు శ్రమించి చదవడం, చెప్పిన పని ఎంత కష్టమైనా చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో ఉన్న పట్టుదలను తెలియజేస్తాయి.

పిల్లల తెలివితేలను పెంచే ఆహారం 

పిల్లల తెలివితేటలు సాధారణ స్థాయిలో లేవంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు వారి మెనూలో చేర్చండి.

ప్రతిరోజూ గుడ్డు తినిపించండి. ఎగ్స్ లో ఉండే విటమిన్ బీ12 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెమరీ పెంచుతుంది.

ఫ్యాటీ ఫిష్ సైతం మెదడు చురుకుగా పని చేసేందుకు సహకరిస్తుంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్… కాన్సన్ట్రేషన్ ని పెంచుతాయి.

ఆకుకూరల్లో ఉండే ఫోలేట్, విటమిన్ కే బ్రెయిన్ సెల్స్ ని కాపాడతాయి.

నట్స్ అండ్ సీడ్స్ పిల్లలు తినడం వలన హెల్తీ ఫ్యాట్, జింక్, ప్రోటీన్ లభిస్తాయి. మెదడు ఆరోగ్యానికి సహకరిస్తాయి.

నరాల ఆరోగ్యం కోసం విటమిన్ బి అధికంగా లభించే యోగర్ట్, డైరీ ప్రోడక్ట్స్ ఇవ్వండి.

Leave a Comment