ఇండియాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ అధికం అవుతుంది. విహారానికో, వివాహానికో వెళ్లి ఎంజాయ్ చేయాలని, రోడ్డు ఎక్కుతున్న ప్రయాణికుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ… రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భాలు అనేకం. ప్రమాదం కారణంగా తమ కుటుంబ సభ్యులను, మిత్రులను కోల్పోయి క్షోభను అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఒకరి మరణం ఆ కుటుంబాన్ని… ఆర్థికంగా, మానసికంగా కృంగదీస్తుంది. తీరని శోకం మిగులుస్తుంది. మన దేశంలో ఏడాదికి 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువేమీ కాదు.
రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయి. సరైన ప్రమాణాలు, సాంకేతికత, భద్రతా నియమాలు పాటించకుండా నిర్మించిన రోడ్లు మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. అదే సమయంలో ఇతరుల నిర్లక్ష్యం అమాయకులను హరిస్తుంది. ఇక స్వయంకృతాపరాధం వలన కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాణాలు పాటించని ప్రభుత్వాలను, బాధ్యత లేకుండా డ్రైవింగ్ చేసే వారిని మనం నియంత్రించడం కష్టం. అయితే వ్యక్తిగతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రమాదాల బారిన పడకుండా, సురక్షితంగా ఇంటికి చేరవచ్చు.

విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి
ట్రాఫిక్స్ రూల్స్ ని అతిక్రమించడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. చాలా మందికి రోడ్లపై కనిపించే ట్రాఫిక్ సైన్ బోర్డ్స్, మార్క్స్ అర్థం తెలియదు. తక్కువ వేగంతో వెళ్లాల్సిన చోట అతివేగంగా వెళ్లడం, ఓవర్ టేక్ చేయకూడని చోట అందుకు ప్రయత్నించి ప్రమాదాల గురవుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పై పూర్తి పట్టు ఉండాలి. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం ఇల్లీగల్. అందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గమ్యం చేరుకోవాలనే తొందరలో మృత్యువుకు వెల్కమ్ చెప్పకండి.
ఫాలో 3 సెకండ్ రూల్
మన ఎదుట ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత గ్యాప్ మైంటైన్ చేయండి. ఎదుట వాహనం సడెన్ బ్రేక్ వేసినప్పటికీ మన వాహనాన్ని అదుపు చేయగల సమయం, దూరం మైంటైన్ చేయాలి. దీన్నే 3 సెకండ్ రూల్ అంటారు.
మద్యం సేవించి వాహనం నడపకండి
మెజారిటీ రోడ్డు ప్రమాదాలకు కారణం డ్రంక్ అండ్ డ్రైవ్. మద్యం మత్తులో వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీసిన ఘటనలు అనేకం. అలాగే చాలా మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. మత్తులో ఉన్నప్పుడు నియంత్రణ ఉండదు. మద్యం సేవించిన వారు థ్రిల్ కోసం వేగంగా వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మీకు మద్యం సేవించే అలవాటు ఉంటే, డ్రైవర్ ని ఏర్పాటు చేసుకోండి. లేదా మద్యం సేవించని ఫ్రెండ్ డ్రైవింగ్ చేసేలా చూసుకోండి.
లాంగ్ డ్రైవ్ లో ఇలా చేయండి
గంటల తరబడి డ్రైవింగ్ చేస్తే అలసిపోతారు. అలసట కారణంగా నిద్రమత్తు ఆవహించే అవకాశం ఉంది. అలాగే నీరసంతో కళ్ళు తిరిగి నియంత్ర కోల్పోవచ్చు. అందుకే విరామం లేకుండా డ్రైవింగ్ చేయవద్దు. ప్రతి రెండు గంటలకు బ్రేక్ తీసుకోవాలి. వాటర్ తాగండి. టీ, స్నాక్స్ తీసుకోండి. దీంతో మీ శరీరానికి ఎనర్జీ, కావలసిన విశ్రాంతి సమకూరుతుంది.
ప్రమాదాల బారిన పడకుండా దోహదం చేస్తుంది.
ప్రతికూల వాతావరణంలో డ్రైవ్ చేయకండి
భారీ వర్షాలు, తుఫానులు వంటి ప్రతికూల పరిస్థితుల్లో రోడ్లపైకి వెళ్ళకపోవడం సేఫ్. ప్రయాణం మధ్యలో ఉంటే ఉధృతి తగ్గే వరకు వేచి చూడాలి. దట్టమైన పొగమంచులో, రాత్రివేళల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి.
వాహనాన్ని నడిపే వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉండాలి. తొందరగా వెళ్లిపోవాలనే గందరగోళం, ఒత్తిడికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలు పక్కన పెట్టి, డ్రైవింగ్ పైనే దృష్టి పెట్టాలి.
వ్యక్తిగత రక్షణ & వెహికల్ మైంటెనెన్సు
మీరు కారు నడుపుతుంటే కచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. తోటి ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ పెట్టుకునేలా చూడండి. ఇక బైకర్స్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పటికీ హెల్మెట్ ధరిస్తే… ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
ఇక వెహికల్ బయటకు తీసే ముందు టైర్స్, బ్రేక్స్, లైట్స్ చెక్ చేయండి. సడెన్ బ్రేక్ డౌన్ వంటి సమస్యలు ఏర్పడకుండా ఫ్లూయిడ్ లెవెల్స్ సరి చూసుకోండి. టైం టు టైం వెహికిల్ ని సర్వీస్ చేయించండి. ఫిట్నెస్ మైంటైన్ చేయండి.
ప్రధానంగా పైన చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అధికమించవచ్చు. సురక్షితంగా గమ్యం చేరవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సంతోషకర క్షణాలు ఆస్వాదించవచ్చు.
