జెన్ జీ అమ్మాయిలు… అబ్బాయిల్లో చూసేది ఇవే! సింగిల్స్ కోసమే ఈ స్టోరీ

ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళితే అమ్మాయిలకు పెళ్లి విషయంలో స్వేచ్ఛ ఉండేది కాదు. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పేరెంట్స్ కుదిర్చిన పెళ్లి చేసుకుని భర్తతో పాటు అత్తారింటిలో అడుగుపెట్టేవారు. ఈ జనరేషన్ కిడ్స్ కి ఈ విషయాలు చెబితే… అవునా అని ఆశ్చర్యపోక మానరు. ప్రేమించకుండా, ఎలాంటి పరిచయం లేకుండా పెళ్లా? అని నోరెళ్లబెడతారు. జెన్ జీ గర్ల్స్  ఆలోచనలు మూన్ నే కాదు మార్స్ ని కూడా దాటేశాయి.

ప్రేమైనా… పెళ్ళైనా… అబ్బాయిలను ఎంచుకోవడంలో అమ్మాయిల దృక్పథమే మారిపోయింది. ఎత్తు, పొడుగు, రంగు, జుత్తు వంటి బ్యూటీ ఫీచర్స్ సెకండరీ అంటున్నారు. అబ్బాయిల్లో వారు కోరుకునే క్వాలిటీ లిస్ట్ మారిపోయింది. ప్రముఖ మీడియా సంస్థల సర్వే ఫలితాలు చూస్తే అబ్బాయిలు షాక్ కావాల్సిందే. అదే సమయంలో వారు చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే తప్ప పెళ్లిళ్లు అయ్యే ఛాన్స్ లేదు. జెన్ జీ అమ్మాయిలు తమ పార్టనర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఈ స్టోరీ లో చూద్దాం..

స్వేచ్ఛ-సమానత్వం 

విద్య, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు… అంశం ఏదైనా తమ లైఫ్ తమ ఇష్టం అంటున్నారు జెన్ జీ గర్ల్స్. తాము స్వతంత్రులం, నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకునే వెసులుబాటు కావాలని కోరుకుంటున్నారు. తమ జీవన విధానాన్ని గౌరవించి, ప్రోత్సహించే అబ్బాయిలను ఈ తరం అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఓ సర్వే ప్రకారం 70% ఇండియన్ గర్ల్స్ స్వేచ్ఛ, సమానత్వం కావాలని బల్ల గుద్ది చెప్పారు. భార్య-భార్య ఇద్దరు సమానమే అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. అన్ని విధాలా తమను సపోర్ట్ చేసి ప్రోత్సహించే అబ్బాయిలకే మా ఓటు అంటున్నారు.

వర్క్ షేరింగ్ 

వంటావార్పు, క్లీనింగ్, వాషింగ్, పిల్లల ఆలనాపాలనా వంటి పనులు ఆడవారు మాత్రమే చేయాలనే సంకుచిత భావాలకు స్వస్తి పలకాలని జీన్ జీ గర్ల్స్ నొక్కి వక్కాణిస్తున్నారు. భర్తకు ఏ మాత్రం తగ్గకుండా సంపాదిస్తున్న భార్యలు… ఇంటి పనులు మాత్రం ఒక్కరే ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇంటి పనుల్లో సహాయం చేసే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు ఇష్టం అట. వంటలో చేయి తిరిగిన వారైతే మరిన్ని మార్కులు వేస్తామని అంటున్నారు. మగమహారాజులం ఇంటి పని చేయాల్సిన ఖర్మ మాకేంటి అనుకుంటే పొరపాటే. సింగిల్ గా ఉండిపోవాల్సి వస్తుంది.

మాటామంతి 

ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి టీవీ చూస్తూనో, ఫ్రెండ్స్ తో ఫోన్ మాట్లాడుతూనే కాలక్షేపం చేసే భర్తలను భార్యలు ఇష్టపడరు అట. రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య… యోగక్షేమాలు తెలుసుకునే భర్తలు అంటే ఇష్టం అంటున్నారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మైంటైన్ చేయాలని అంటున్నారు. తమ ఎమోషన్స్ అర్థం చేసుకొని, బాధలో ఓదార్చే అబ్బాయి కావాలంటున్నారు. ఇక అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు కోప్పడకుండా సామరస్యంగా పరిష్కరించే కూల్ నేచర్ ఉన్న అబ్బాయిలైతే బెటర్ అట.

ఆర్థిక భద్రత

అబ్బాయిల్లో అమ్మాయిలు కోరుకునే మరో ముఖ్యమైన క్వాలిటీ ఆర్థిక భద్రత. కట్టుకోబోయేవాడు ఆర్థికంగా స్థిరపడి ఉండాలి. నిరంతర ఆదాయంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని కోరుకుంటున్నారు. అడిగినంతనే తమ కోరికలు తీర్చే పార్టనర్ అయితే బెటర్ అనే ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. తనకు, కుటుంబానికి సొసైటీలో ఒక గౌరవప్రదమైన జీవితం ఇచ్చే అబ్బాయిలే కావాలని జెన్ జీ గర్ల్స్ డిమాండ్.

 ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ 

కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. తమకు అన్నీ సమకూర్చినా… మీటింగ్స్, పార్టీలు అంటూ ఇంటి పట్టున లేకపోతే నచ్చదని వారి అభిప్రాయం. ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్ అని భావించి… భార్య, పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడిపే అబ్బాయిలంటే ఇష్టమని వారి అభిప్రాయం.

సో… మీ సింగిల్ లైఫ్ లో ఓ అమ్మాయి రావాలంటే ఈ లక్షణాలు తప్పనిసరి. పైన చెప్పిన క్వాలిటీస్ మీలో ఉన్నాయోలేదో ఒకసారి చెక్ చేసుకోండి. వాటికి అనుగుణంగా మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి…

Leave a Comment