ఈ ఆరోగ్య చిట్కాలు తెలిస్తే మీ ఇంటికి మీరే డాక్టర్!

 

మన ఇంట్లో లభించే సుగంధ ద్రవ్యాలు, వస్తువులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పలు రుగ్మతల నుండి బయటపడొచ్చు. ప్రతి చిన్న విషయానికి డాక్టర్ ని సంప్రదించకుండా ఉపశమనం పొందవచ్చు. అలాగే నిరంతరం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సైతం అధిగమించవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్(ASV) టానిక్ 

చాలా మంది జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆపిల్ సైడర్ వెనిగర్ చక్కని పరిష్కారం. వేడి నీటిలో ఒక చెంచాడు ఆపిల్ సైడర్ వెనిగర్ టానిక్ కలుపుకుని తాగితే జీర్ణ సమస్యలకు చెక్ పడుతుంది. ఈ మధ్య కాలంలో పలువురు ఆపిల్ సైడర్ వెనిగర్ టానిక్ ని ఉపయోగిస్తున్నారు. ప్రముఖ స్టోర్స్ తో పాటు ఆన్లైన్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ అందుబాటులో ఉంది.

అల్లం & తేనే సిరప్ 

దశాబ్దాలుగా అల్లం, తేనే మిశ్రమాన్ని పలు రుగ్మతలకు ఉపశమనంగా వాడుతున్నారు. ఆధునిక వైద్యంలో కూడా అల్లం అండ్ తేనే సిరప్ ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నవారికి ఈ సిరప్ ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు పాలు

భారతదేశంలో 4000 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పసుపు మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.  పసుపు కలిపిన పాలు తాగడం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుస్తుంది. పసుపులో సహజంగా ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పని చేస్తుంది. ఇది మంట, వాపు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ 

గ్రీన్ టీ నేటి యువ జీవనశైలిలో భాగమైంది. ఊబకాయం సమస్యను అధిగమించేందుకు గ్రీన్ టీ తాగడం అలవాటుగా మారింది. గ్రీన్ టీతో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాచి చల్లార్చిన గ్రీన్ టీని ఐస్ క్యూబ్స్ గా మార్చాలి. సదరు ఐస్ క్యూబ్స్ ని ముఖం మీద సున్నితంగా రుద్దాలి. ముఖం వాపుకు, ఎర్రబారిన చర్మానికి గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ మెరుగైన విరుగుడు. అలాగే చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలు తగ్గిస్తుంది. హోమ్ రెమెడీ చిట్కాల్లో ఇది ఒకటి.

శెనగపిండి ఫేస్ మాస్క్ 

సౌందర్య సాధనాల్లో శెనగపిండి ఒకటి. శబ్దాలుగా భారతీయులు శెనగపిండిని ఆహార పదార్ధాల తయారీకే కాకుండా, బ్యూటీ సెగ్మెంట్ గా ఉపయోగిస్తున్నారు. శెనగపిండితో స్నానం చేస్తే చర్మం మెరిసిపోతుంది. అలాగే శెనగపిండిలో రోజ్ వాటర్ లేదా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ గా వాడితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది అత్యంత చవకైన సౌందర్య చిట్కా అనడంలో సందేహం లేదు.

పెప్పర్మింట్ అండ్ లవంగం నూనె 

పెప్పర్మింట్ ఆయిల్ తల నొప్పి, కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇక లవంగం నూనె పంటి నొప్పిని తగ్గిస్తుంది. పెప్పర్మింట్ అండ్ లవణం నూనె ఎప్పుడూ ఇంట్లో ఉండేలా చూసుకోవాలి.

అల్లం అండ్ చామంతి టీ 

విరోచనాలతో ఇబ్బందిపడుతుంటే అల్లం టీ తాగండి. అల్లాన్ని ముక్కలుగా కోసి, వేడి నీటిలో 5-10 నిమిషాలు మరిగించి తాగినా ఫలితం ఉంటుంది. రుచి కోసం లెమన్, తేనె కలిపి తీసుకోవచ్చు. అల్లం టీ మోషన్స్ తగ్గిస్తుంది. ఉదయాన్నే తాగితే ఎనర్జీ జనరేట్ అవుతుంది.

చామంతి టీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తుంది. స్ప్లీప్ క్వాలిటీ పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

నోట్: పైన ఆరోగ్య చిట్కాలు దీర్ఘకాలిక సమస్యలు లేని సాధారణ జీవితం గడుపుతున్నవారికి మాత్రమే. గర్భిణీలు, వృద్ధులు, ఇతర కఠిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే ఆరోగ్య చిట్కాలు ఆచరించాలని సూచిస్తున్నాము.

Leave a Comment