కష్టం ఏదైనా ఇలా చేస్తే మీ లైఫ్ ఫుల్ హ్యాపీ! టిప్స్ ఇవే
మోడరన్ సొసైటీలో హ్యాపీ లైఫ్ మిలియన్ డాలర్ క్వచ్చన్. డబ్బు, హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అసంతృప్తికర జీవనం సాగిస్తున్నారు. వృత్తి, వ్యాపారం, వైవాహికం, ఆరోగ్యం, మానవ సంబంధాలు, ఒప్పందాలు పలు సమస్యలకు కారణం అవుతున్నాయి. మారిన జీవన శైలి కొత్తకొత్త బాధలను పరిచయం చేస్తుంది. మనిషికి సంతోషం దూరమైతే జీవితం శూన్యంలా అనిపిస్తుంది. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
డిప్రెషన్, యాంగ్జైటీ,స్ట్రెస్ అతి ప్రమాదకర మానసిక వ్యాధులు. బలవన్మరణాలకు కారణం ఈ రుగ్మతలే. ఖరీదైన చికిత్స తీసుకున్నా ఈ వ్యాధుల నుండి బయటపడటం కష్టమే. అయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా మానసిక ఒత్తిడిని జయించవచ్చు. కష్టాలను ఎదిరించి హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చు…

ప్రతిరోజు వ్యాయామం చేయండి
శారీరక ధారుఢ్యానికి, పటుత్వానికే కాకుండా మానసిక ప్రశాంతకు వ్యాయామం దోహదం చేస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అందుకు కొంత సమయాన్ని కేటాయించాలి. మెదడులో ఒత్తిడి,ఆందోళన, నిరాశను నిరోధించే రసాయనాలను ఎక్సర్సైజ్ క్రమబద్దీకరిస్తుంది. పనిలో చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. వ్యాయామంతో పాటు కొద్ది సమయం ప్రాణాయామం, యోగా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
తగినంత సమయం నిద్రపోండి
పెద్దవాళ్లు రోజులో కనీసం 7 గంటలు నిద్రపోవాలి. సరిపడా నిద్రలేకపోతే అలసటగా ఉంటుంది. నిద్ర మత్తు వెంటాడుతుంది. దీని అర్థం మీ శరీరానికి తగినంత విశ్రాంతి, నిద్ర లభించలేదని. మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం, మెదడు పనితీరు నిద్ర మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కనీసం 7-8 గంటల సమయం నిద్రకు కేటాయించాలి.
కృతజ్ఞతాభావం కలిగి ఉండండి
“HUMANS ARE SOCIAL ANIMALS” అన్నారు అరిస్టాటిల్. మనిషి జీవనం సమాజంతో ముడిపడి ఉంది. ఒకరిపై ఒకరు ఆధారపడడం తప్పనిసరి. కాబట్టి సమాజం పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అలా అని పెద్ద మొత్తంలో సహాయాలు, త్యాగాలు చేయనవసరం లేదు. మీ తోటి ఎంప్లాయ్ తో లంచ్ టైం లో ఫుడ్ షేర్ చేసుకోండి. మీ నైబర్స్, తెలిసిన వ్యక్తులు ఎక్కడైనా ఎదురైతే నవ్వుతూ పలకరించండి. అనాధలకు, పేదవారికి, బిచ్చగాళ్లకు చిన్న సహాయం చేయండి. మీకు చాలా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ మార్పును మీరు స్వయంగా గమనిస్తారు.
మిత్రులను కలవండి
కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోలేని కొన్ని విషయాలు, సమస్యలు స్నేహితులవుతోనే చర్చించగలం. తరచుగా మిత్రులను కలవడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మిత్రులతో అందమైన జ్ఞాపకాలు పంచుకోవాలి. వాటి తాలూకు ఎమోషన్స్ ఎంజాయ్ చేయాలి. ఎంత మంది స్నేహితులు ఉన్నారన్నది ముఖ్యం కాదు. మన హృదయానికి దగ్గరైన, అర్థం చేసుకునే మిత్రులు ఒకరిద్దరైనా చాలు. అలాంటి ఫ్రెండ్స్ తో సమయం స్పెండ్ చేయండి.
ప్రకృతిలో మమేకం అవ్వండి
అనేక మానసిక రుగ్మతలకు ప్రకృతి సరైన మందు. నిరాశ, నిస్పృహలతో బాధపడే వారు ఒక అందమైన హిల్ స్టేషన్ లో విహరించండి. పచ్చని చెట్ల మధ్య… కొండ కోనల్లో సేద తీరండి. మీకు నచ్చిన టూరిస్ట్ స్పాట్ కి చెక్కేయండి. ఒత్తిడిని అధిగమించాడనికి ఇదొక గొప్ప ఆలోచన. విహారాలకు వెళ్లే సమయం, ఆసక్తి లేనివారు… కనీసం తమ దగ్గరలో ఉన్న పార్క్ కి తరచుగా వెళ్ళండి. లేదంటే మన ఇంటి గార్డెన్ లో కాసేపు మొక్కలతో గడపండి. గార్డెనింగ్ వంటి వ్యాపకాలు మనసుకు ఆహ్లాదంగా ఉంటాయి.
ఇంట్లో ఒంటరిగా ఉండకండి
డిప్రెషన్ కి లోనైన చాలా మంది తమ గదికే పరిమితం అవుతారు. బయటకు రావడానికి ఇష్టపడరు. నిజానికి ఇది చాలా ప్రమాదం. ఒంటరితనం ప్రతికూల ఆలోచనలకు దారి తీయవచ్చు. ఒత్తిడిని అధిమించడానికి బయటకు వెళ్లడం ఉత్తమం. థియేటర్స్ లో సినిమాలు చూడండి. రెస్టారెంట్ లో నచ్చిన ఫుడ్ ఆస్వాదించండి. స్టాండ్ అప్ కామెడీ షోలకు అటెండ్ కావడం, లాఫింగ్ క్లబ్స్ లో చేరడం వంటివి చేయండి.
లక్ష్యాలను నిర్ధేశించుకోండి
గతం గురించి అతిగా ఆలోచించకుండా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయండి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని సాధించాడనికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. మనసును, శరీరాన్ని శ్రమకు గురిచేయండి. మనం బిజీగా ఉన్నప్పుడు ప్రతికూల ఆలోచనలు దరిచేరవు.
బాధలు శాశ్వతం కాదనే విషయాన్ని గమనించండి. మీలో భక్తిభావన ఉంటే… ప్రముఖుల ఆధ్యాత్మిక సూక్తులు వినండి. ఇలా మీ జీవనశైలి మార్చుకోవడం ద్వారా కష్టాలను అధిగమించవచ్చు. తిరిగి మునుపటి జీవితం పొందవచ్చు….
