సోషల్ మీడియా సౌందర్య చిట్కాలు, అసలుకే ఎసరు!

సోషల్ మీడియా అందరికీ చేరువైన సాధనం. వయసుతో సంబంధం లేకుండా సామాజిక మాధ్యమాలకు జనాలు అడిక్ట్ అయ్యారు. స్మార్ట్ ఉన్న ప్రతి ఒక్కరు రోజూ సోషల్ మీడియా వాడుతున్నారు. పలు రకాల సమాచారం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఇక సోషల్ మీడియా సమాచారాన్ని గుడ్డిగా ఫాలో అయ్యే నెటిజెన్స్ అనేకం. అయితే సోషల్ మీడియాలో కనిపించే సమాచారం అంతా నిజం కాదు. వ్యూస్, లైక్స్ కోసం… అలాగే సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు తప్పుడు సమాచారం అందించే సోషల్ మీడియా హ్యాండిల్స్ కోకొల్లలుగా ఉన్నాయి.

కాబట్టి సోషల్ మీడియా సమాచారాన్ని నమ్మడం, ఆచరించడం రిస్క్ తో కూడిన వ్యవహారం. ముఖ్యంగా హెల్త్ కి సంబంధించిన సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల పర్యవేక్షణ, సూచనలు లేకుండా మెడిసిన్ వాడటం, టిప్స్ పాటించడం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బ్యూటీ టిప్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ లేదా హ్యాండిల్స్ షేర్ చేసే కొన్ని రకాల బ్యూటీ టిప్స్ పాటించకపోవడం ఉత్తమం అంటున్నారు.

అందంగా కనిపించాలనే ఆరాటంలో ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో వైరల్ అయ్యే రీల్స్, వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ అందం మెరుగవ్వక పోగా… ఉన్న అందం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కొత్త సమస్యల బారినపడొచ్చు. సోషల్ మీడియా ఆధారంగా పాటించకూడని కొన్ని బ్యూటీ టిప్స్ ఏమిటో ఈ ఆర్టికల్ లో చూద్దాం…

టూత్ పేస్ట్-నిమ్మరసం మిశ్రమం 

సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే బ్యూటీ టిప్స్ లో టూత్ పేస్ట్, నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమం వాడకం. మొటిమల మీద టూత్ పేస్ట్ రాయడం వలన మొటిమలు తగ్గుతాయని సూచిస్తూ ఉంటారు. అలాగే నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమాలు ముఖానికి అప్లై చేస్తే మొటిమల సమస్య తగ్గుతుందని అంటారు.

నిజానికి టూత్ పేస్ట్ ముఖ చర్మం మీద రాయడం మంచిది కాదు. టూత్ పేస్ట్ లో పిప్పర్మెంట్, ఆల్కహాల్ ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మరింత డ్రై గా చేస్తాయి. ఇవి కెమికల్ బర్న్స్ ని దారి తీస్తాయి. మొటిమలు తగ్గకపోగా ముఖ చర్మం పాడవుతుంది నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నిమ్మరసంలో అధిక మోతాదులో PH స్థాయి ఉంటుంది. దీని వలన చర్మం ఎర్రబడుతుంది. సూర్యరశ్మి తగిలితే తీవ్రమైన పిగ్మెంటేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ఈ టూత్ పేస్ట్, నిమ్మరసం, బేకింగ్ సోడా టిప్ ఆచరించకండి అంటున్నారు.

DIY స్క్రబ్ లు 

కాఫీ పొడి, షుగర్ లేదా పిస్తా పొడి తో చేసిన స్క్రబ్ లో చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయనే భావన ఉంది. చర్మంపై నల్లని మచ్చలు తొలగిపోయి, అందంగా మార్చేందుకు కాఫీ పొడి స్క్రబ్ ఉపయోగపడుతుందని సోషల్ మీడియాలో బ్యూటీ టిప్స్ ప్రచారం అవుతూ ఉంటాయి. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటున్నారు నిపుణులు.

చక్కెర, కాఫీ పొడి రేణువులు చాలా పదునుగా ఉంటాయి. వీటిని ముఖంపై రుద్దడం వలన చర్మం డామేజ్ అవుతుంది. కంటికి కనిపించని స్థాయిలో సూక్ష్మ గాయాలు ఏర్పడతాయి. ఈ గాయాల ద్వారా బ్యాక్టీరియా సులభంగా చర్మంలోకి చేరుకుంటుంది. అనంతరం ఇన్ఫెక్షన్స్ కలిగిస్తాయి. చర్మం సున్నితంగా మారి పాడయ్యే అవకాశం ఉంది.

కెమికల్ పీల్స్ 

ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందం కోసం కెమికల్ పీల్స్ వినియోగించే వారి సంఖ్య అధికమైంది. స్ట్రాంగ్ యాసిడ్స్, పీలింగ్ సొల్యూషన్స్ చర్మం మీద డెడ్ స్కిన్ తొలగించేందుకు వాడుతున్నారు. ఫీలింగ్ సొల్యూషన్స్ వాడకం ఫ్యాషన్ గా మారిన నేపథ్యంలో డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. పర్యవేక్షణ, నిపుణుల సూచనల లేకుండా పీల్స్ వినియోగించడం సరికాదంటున్నారు.

అధిక గాఢతతో కూడిన పీల్స్ చర్మం పై పొరను పాడు చేస్తాయి. ఈ కారణంగా ముఖం మీద శాశ్వతమైన మచ్చలు, డార్క్ స్పాట్స్ కి దారితీయవచ్చు. శాశ్వత మచ్చలు ఏర్పడితే లైఫ్ టైం బాధపడాల్సి ఉంటుంది.

 గృహ వైద్యం 

కొందరు వెనిగర్, క్లోరోఫామ్ లేదా కొన్ని రకాల హెర్బల్ పేస్ట్ లను దద్దుర్లు, మొటిమలకు వైద్యంగా సూచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి చర్మ గుణం ఒకేలా ఉండదు. ఒకరికి పని చేసిన చిట్కా మరొకరికి పని చేయకపోవచ్చు. సొంత ప్రయోగాలు అలర్జీకి దారితీయవచ్చు.

సురక్షితమైన స్కిన్ కేర్ టిప్స్ 

ఒక మంచి క్లిన్సర్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడితో సరిపోతుంది. డైలీ వాడటం వలన చర్మానికి రక్షణ లభిస్తుంది.

ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఏదైనా ప్యాక్, ప్రొడక్ట్ ముఖాన్ని అప్లై చేసే ముందు చేతి మీద రాసుకుని సాయంత్రం వరకు వేచి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రభావంతంగా పని చేస్తుందని నమ్మితే, వాడటం ఆరంభించండి.

తీవ్రమైన మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యల బారినపడితే సొంత ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. వెంటనే డెర్మటాలజిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. సోషల్ మీడియా చిట్కాలకు దూరంగా ఉండండి. మీ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Leave a Comment