ఆంటీలపై కుర్రాళ్లకు అంత మోజు ఎందుకు? షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈడు జోడు మరచి యువకులు తమకంటే వయసులో పెద్దవారైన మహిళల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. వారితో సాంగత్యం కోరుకుంటున్నారు. ఇదేదో ఊహాజనిత ఆలోచన మాత్రమే, ఎలాంటి ఆధారాలు లేవనుకుంటే పొరపాటే. ప్రముఖ మీడియా సంస్థలు, డేటింగ్ యాప్స్ చేపట్టిన సర్వేలలో బట్టబయలైన పచ్చినిజాలు. సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న టీనేజ్/యంగ్ ఏజ్ యూత్… మిడిల్ ఏజ్ మహిళల పట్ల ఆసక్తి కనబరుస్తునట్లు వెల్లడైంది.

ముఖ్యంగా బెంగుళూరు యువత ఈ విషయంలో ముందు ఉన్నారట. ఆ నెక్స్ట్ ప్లేస్ హైదరాబాద్ కి దక్కడం విశేషం. ఇక ముంబై, ఢిల్లీ నగరాలు వరుసగా తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 20 ఏళ్ళ వయసు ముగిసే దశలో ఉన్న యువకులు 40 ఏళ్ల మహిళల పట్ల ఆసక్తిగా ఉన్నట్లు, వారితో సాంగత్యం కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు అక్రమ సంబంధాలకు దారి తీస్తున్నాయి. ఈ విపరీత ధోరణికి కారణాలు ఏమిటో చూద్దాం…

బాధ్యతలు-ఒప్పందాలు లేని జీవితం 

ఒక అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనే నిబంధ ఉంటుంది. పెళ్లి అనంతరం పిల్లల్ని కనాలి. ఇదంతా బాధ్యతతో కూడిన వ్యవహారం. నిబద్ధతగా ఉంటేనే కుటుంబ బాధ్యతలు నెరవేర్చగలం. ఇద్దరికీ నచ్చక విడిపోవాలంటే విడాకుల జంజాటం ఉండనే ఉంది.  దీని వలన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను కోల్పోతామనే భావన యువతలో ఉంది. కాగా పెళ్ళైన మహిళలతో… పెళ్లి, పిల్లలు అనే కమిట్మెంట్స్ ఉండవు. ప్రతి నెలా కుటుంబ పోషణకు జీతంలో కొంత కేటాయించాల్సిన అవసరం ఉండదు.

మెచ్యూరిటీ అండ్ కమ్యూనికేషన్ 

వయసులో పెద్దవారైన మహిళలు… యువత కంటే మానసికంగా పరిపక్వత చెంది ఉంటారు. యంగ్ గర్ల్స్ తో పోల్చితే అర్థం చేసుకునే స్వభావం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకే  లక్షణాలు ఉంటాయి. అలాగే తమ బంధానికి స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించుకోవచ్చు. మన ఫ్రీడమ్ కి ఎలాంటి ఢోకా ఉండదు. ఉదాహరణకు… రోజూ గంటల తరబడి ఫోన్లో మాట్లాడాలి, గంటకోసారి టెక్స్ట్ చేయాలి. షాపింగ్, సినిమాలకు తిప్పాలి, గిఫ్ట్స్ ఇవ్వాలనే ఫార్మాలిటీస్ పాటించాల్సిన అవసరం ఉండదు. ఆంటీలతో గొడవలు లేకుండా రిలేషన్ సాఫీగా సాగుతుంది.

శృంగారంలో స్వేచ్ఛాయుత వాతావరణం 

మహిళలు శృంగారం సమయంలో స్వేచ్ఛగా, సంకోచించకుండా తమ కోరికలు వ్యక్తపరుస్తారు. ఇది పురుషులను థ్రిల్ కి గురి చేసే అంశం. అదే సమయంలో యువతులు మనసులోని భావాలు వ్యక్తీకరించరు. అలా చేస్తే తన ప్రియుడు తప్పుగా అర్థం చేసుకుంటాడేమో, తన క్యారెక్టర్ ని జడ్జ్ చేస్తాడేమో అనే అనుమానంతో ఉంటారు. శృంగారానికి యువతులను ప్రేరేపించడం కూడా కష్టం. చాలా సమయం పడుతుంది. అదే సమయంలో మహిళలు కోపరేటివ్ నేచర్ కలిగి ఉంటారు.

మేట్ పోచింగ్

ఒక సైకాలజీ స్టడీ ప్రకారం… పురుషులు తమని తాము శృంగార పురుషుడిగా నిరూపించుకోవాలని కోరుకుంటారు. అందుకు ఇతర వ్యక్తుల భార్యలతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. దీన్ని మేట్ పోచింగ్ అంటారు. ఈ ఆలోచన విధానం సైతం పెళ్ళైన మహిళలను యువత కోరుకునేలా చేస్తుంది.

ఒంటరితనం & కెరీర్ 

పెళ్లి కాని బ్రహ్మచారుల సంఖ్య నానాటీకీ పెరిగిపోతుంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలో లైంగిక వాంఛలు నెరవేర్చుకోవడానికి అఫైర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ కోసం పెళ్లిని పక్కన పెట్టేస్తున్న యువత కూడా ఉన్నారు. వీరంతా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా తమ లైంగిక కోరికలు నెరవేర్చుకునే భావన కలిగి ఉన్నారు. 70% నుండి 75% యువత పెళ్ళికి ముందు లివ్ ఇన్ రిలేషన్ కోరుకుంటున్నారు.

నోట్: అక్రమ సంబంధాలను ప్రోత్సహించడం ఈ కథనం ఉద్దేశం కాదు. నేటి యువత ఆలోచనా విధానం తెలియజేసే ప్రయత్నం మాత్రమే. ఇల్లీగల్ అఫైర్స్ చట్టరీత్యా నేరం. అనేక సమస్యలకు దారి తీస్తాయి.

Leave a Comment