తెలుగు నెంబర్ 1 హీరో పవనే : పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ, సినిమా వాళ్ళు, సినీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ డేట్లు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. బహుశా రోజుకు కోటి రూపాయిలు తీసుకున్న ఏకైక హీరో పవన్ కల్యాణే. అందుకే, నేటికీ తెలుగు నెంబర్ 1 హీరో పవన్ కల్యాణే. కాకపోతే, అసలు ఈయన హీరో ఏమిటో అర్థం కాదు. మాస్ హీరో అంటే ఎలా ఉండాలి..?, అందులోనూ ఓ ఇండియన్ హీరో… అదీ తెలుగు స్టార్ హీరో అంటే ఏ రేంజ్ ఉండాలి… మిలియన్ల కొద్దీ సోషల్ మీడియా ఫాలోవర్స్ అంటూ, అలాగే నిత్యం ఫ్యాన్స్ గీన్స్ హంగామా అంటూ రెచ్చిపోవాలి, ఫేక్ కలెక్షన్స్ తో సోషల్ మీడియా మోత మోగించాలి. కానీ, పవన్ కళ్యాణ్ కి ఇవేమీ పట్టవు. ఫ్యాన్స్ సంఘాలతో అధికారికంగా టచ్ లో ఉండడు.
పైగా వద్దంటూ రద్దు చేస్తాడు. అసలు ఒక స్టార్ తెలుగు హీరో అంత సింపుల్ గా ఉంటే ఎలా ?, సెట్ బాయ్ కూడా కూల్ గా పవన్ దగ్గరకు వెళ్లి మాట్లాడే అవకాశం పవనే ఇస్తాడు. ఒక హిట్ సినిమా హీరోకే ఫ్యాన్స్ ఉండే రోజులు ఇవి. హిట్ పడగానే తానే తోపు అంటాడు. కానీ, ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసినా తోటి హీరోలకు కూడా గుర్తింపు ఇస్తాడు. పబ్లిక్ మీటింగ్స్ లో కూడా తోటి స్టార్ హీరోల గురించి మంచిగా చెబుతాడు. తన కంటే వారికే మార్కెట్ ఎక్కువ అని ఓపెన్ గా చెబుతాడు. పక్క భాషలో వారికీ మార్కెట్ క్రియేట్ అవ్వొచ్చు. కానీ, తెలుగులో నేటికీ మార్కెట్ పరంగా, ఫ్యాన్స్ పరంగా తెలుగు నెంబర్ 1 హీరో పవన్ కల్యాణే.
పవన్ కళ్యాణ్ రియాలిటీలో హీరో… ఒక్కొక్క రీల్ హీరో.. పవన్ కళ్యాణ్ ను చూసి లోలోపల ఈర్ష్యతో గింజుకునేంత హీరో… సమాజం కోసం జీవితాన్నే త్యాగం చేసే హీరో. ఇక సినిమాల్లో హీరోయిజం అనేది తనకు ఉత్త జుజుబీ. జీవితం అంటే మొహానికి రంగు, డబ్బులు, ఆస్తులు, ఫాల్స్ ఇమేజీ అనుకునే తొక్కలో దిక్కుమాలిన హీరోలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తల వంచని ఆకాశమే.
నేను ఓ స్టార్ హీరోను, నేను దైవాంశసంభూతుడిని అనుకుని విర్రవీగే హీరోలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆరడుగుల బుల్లెటే. అప్పుడప్పుడూ తన ఫ్యాన్స్ పేరిట కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ తో సోషల్ గొడవలకు దిగితే.. అసలు ఆవైపు చూడడు… అలాంటివి ఎప్పుడు పవన్ కళ్యాణ్ కలలో కూడా ఎంకరేజ్ చేయడు. అందుకే.. తెలుగు నెంబర్ 1 హీరో పవన్ కల్యాణే. ఎస్… పవన్… ఒక డొల్ల హీరో కాదు…రియల్ హీరో… అంతే.
రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానానికి చేరుకుంటాడు. తన డైలాగే ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అని. తగ్గిన వాడికే నెగ్గే అవకాశం ఉంటుంది. నెగ్గాలనే కసి ఉంటుంది. కచ్చితంగా పవన్ భక్తులందరూ కోరిక తీరుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ మీటింగ్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆయన ఇదే వేగాన్ని కొనసాగించి.. నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలని కోరుకుందాం.