ముద్ర లోన్ ఎలా తీసుకోవాలి ? ఈజీగా 10 లక్షలు.. మీరు చదివింది నిజమే. మరి మీరు ఏదైనా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా ?, ఈ రోజుల్లో ఏ చిన్న వ్యాపారం చేయాలన్న భారీగా డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. మరి పెట్టుబడి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ?, మీ బిజినెస్ కి ప్రభుత్వమే పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది ?, అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఔత్సాహి
అందుకు మనం నమ్మేలా ఈ పథకం గణాంకాలే చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద దాదాపు 68 % శాతం మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారారు. అదేవిధంగా 51% శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పారిశ్రామికవేత్తలకు కూడా మేలు జరిగింది. వారి బిజినెస్ ను పెంచుకోవడానికి ఈ ముద్ర లోన్ పథకం చాలా ఉపయోగపడింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) పథకం ద్వారా మన దేశంలోని బ్యాంకులు, మరియు కొన్ని ఆర్థిక సంస్థలు ఇప్పటివరకూ దాదాపు 40.82 లక్షల మందికి రుణాలను ఇచ్చాయి. డబ్బు రూపంలో చూసుకుంటే.. దాదాపు రూ. 23.3 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశారు. నిజంగా ఇది రికార్డే. ఈ పథకంలో ఉన్న సీరియస్ నెస్ కి పై గణాంకాలే నిదర్శనం. కాబట్టి, నిజంగా మీరు బిజినెస్ చేయాలనుకుంటే.. మీకు ఈ ముద్ర లోన్ పథకం గొప్ప అవకాశం.
ముద్ర లోన్ ఎలా తీసుకోవాలి ? పూర్తి వివరాలు :
మీకు తెలుసా ?, భారత ప్రభుత్వ ప్రధాన పథకాల్లో ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కూడా ఒకటి. ఆ మాటకొస్తే.. మోడీ ప్రభుత్వం ప్రధాన పథకం ఇదే. ఇండియాలో ఈ ముద్ర లోన్ మైక్రో క్రెడిట్ / లోన్ ను చాలా సులభతరం చేసింది. ముఖ్యంగా చిన్న తరహా బిజినెస్ లు చేసుకునే వారికీ ఈ పథకం జీవితాన్ని ఇచ్చింది. పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ బిజినెస్ లతో పాటు వ్యవసాయేతర రంగంలోని వారికీ కూడా రూ.10 లక్షల వరకూ రుణం వచ్చేలా చేసింది ఈ ముద్ర లోన్ పథకం.
చిన్న కంపెనీలు యొక్క తయారీ యూనిట్లు, సేవా రంగ యూనిట్లు దగ్గర నుంచి పండ్లు / కూరగాయల సరఫరా చేసే వారి వరకూ.. అలాగే, ట్రక్ ఆపరేటర్లు, ఆహార-సేవ యూనిట్లు, మరమ్మతు దుకాణాలతో పాటు మెషిన్ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు నడిపే వారికి, చివరికి చేతివృత్తుల వారికి కూడా ఈ పథకం ద్వారా 10 లక్షలు వరకు రుణాలు అందాయి.
ముద్ర లోన్ పేరిట రుణాలు ఇస్తున్న బ్యాంకులు
- అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పథకంలో భాగంగా రుణాలు ఇస్తున్నాయి.
- అలాగే, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి.
- రాష్ట్ర నిర్వహణలోని సహకార బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి.
- కొన్ని గ్రామీణ బ్యాంకులతో పాటు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రుణాలు ఇస్తున్నాయి.
- నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ పథకంలో భాగంగా రుణాలు ఇస్తున్నాయి.
ఈ ముద్ర లోన్ పథకం వల్ల దేశానికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సమాజంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువమంది వెలుగులోకి వస్తారు. అదేవిధంగా అనేక మైక్రో యూనిట్లు తయారుఅవుతాయి.
అనట్టు ఈ పథకాన్ని ‘శిశు’, ‘కిషోర్’ మరియు ‘తరుణ్’గా మూడు విభాగాలుగా పెట్టారు.
శిశు పేరిట రూ.50,000/- వరకు రుణాలను కవర్ చేస్తుంది.
కిషోర్ పేరిట రూ.50,000/- పైన మరియు రూ. 5 లక్షల లోపు రుణాలను కవర్ చేస్తుంది.
ఇక తరుణ్ పేరిట ఒక రూపాయి నుంచి 5 లక్షలు మరియు రూ. 10 లక్షలు వరకూ రుణాలను కవర్ చేస్తుంది.
పైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం తీసుకున్న రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి.
ఏ అర్హత ఉన్న వారు ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని తీసుకోగలరు ?
- అర్హత కలిగిన వ్యక్తులు ఎవరికైనా ఈ పథకం అందుతుంది.
- భాగస్వామ్య సంస్థలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
- అలాగే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు తమ బిజినెస్ ను పెంచుకోవాదానికి ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
- ఇక పబ్లిక్ కంపెనీలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
కాకపోతే, ఈ ముద్ర లోన్ ఎలా తీసుకోవాలి ? దీనికి కొన్ని షరతులు – అర్హతలు ఉన్నాయి.
Note 1: దరఖాస్తుదారుడు ఏ బ్యాంక్ కు లేదా ఏ ఇతర ఆర్థిక సంస్థకు డిఫాల్టర్ కాకూడదు. అలాగే, ఈ పథకం పొందే వ్యక్తికీ మంచి క్రెడిట్ ట్రాక్ రికార్డ్ ఉండాలి.
Note 2: ఏ బిజినెస్ కోసం అయితే మీరు రుణం అడుగుతున్నారో.. ఆ బిజినెస్ కి సంబంధించిన నైపుణ్యాలు ముద్ర లోన్ ఆశించే వ్యక్తికి ఖచ్చితంగా తె
Note 3: ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం పొందే వ్యక్తికి విద్యార్హత అవసరం.
ముద్ర లోన్ అర్హత పత్రాలు, ఇంతకీ ఎలా అప్లై చేసుకోవాలి ?
ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలో ఆ విధానం చూద్దాం రండి.
ఈ ప్రాసెస్ చేయాలంటే, ముందు మీ దగ్గర కొన్ని ముద్ర లోన్ అర్హత పత్రాలు ఉండాలి.
- ముందుగా మీ ID ప్రూఫ్ తో పాటు మీ అడ్రస్ ప్రూఫ్ కూడా కావాలి.
- అలాగే, మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో
- దరఖాస్తు ఫామ్ పై మీ పై సంతకం
- ఇక, మీ బిజినెస్ సంస్థల చిరునామా ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ముద్ర లోన్ అర్హత పత్రాలతో ఆన్ లైన్ లో అప్లై చేసే విధానం
Step 01: ముందుగా మీరు ముద్ర లోన్ అధికారిక వెబ్సైట్ కి (https://www.mudra.org.in/) వెళ్ళండి. ఆ తర్వాత ఉద్యమమిత్ర పోర్టల్‌ని ఎంచుకోవాలి.
Step 02: ఆ పోర్టల్‌ని ఎంచుకున్న తర్వాత, ముద్ర లోన్ “అప్లై నౌ” అనే దాని పై క్లిక్ చేయాలి.
Step 03: ఆ తర్వాత కొత్త పారిశ్రామిక వేత్త / ప్రస్తుత పారిశ్రామిక వేత్త /స్వయం ఉపాధి ఇలా మూడు సెక్షన్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి. మీ కేటగిరిని సెలెక్ట్ చేసుకోండి.
Step 04: ఆ తర్వాత, మీ పేరు, ఇమెయిల్ మరియు మీ మొబైల్ నంబర్ ను ఇవ్వండి. మీ ఫోన్ కి ఒక OTP వస్తోంది. అది అక్కడ ఇవ్వాల్సి కొట్టాల్సి ఉంటుంది.
ఇలా విజయవంతంగా పై వివరాలు నమోదు చేసిన తర్వాత.. ముద్ర లోన్ ఎలా తీసుకోవాలి ?
Step 01: మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీ వృత్తిపరమైన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
Step 02: మీ ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు సంబంధించి ఏదైనా సహాయం అవసరమైతే హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీలను ఎంచుకోవాలి. ఎలాంటి సాయం అవసరం లేకపోతే.. “లోన్ అప్లికేషన్ సెంటర్”ని క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.
Step 03: ముద్ర శిశు / ముద్ర కిషోర్ / ముద్ర తరుణ్ ఇలా మూడు ఉంటాయి. కాబట్టి, మీకు అవసరమైన లోన్ సెక్షన్ ను ఎంచుకోండి.
Step 04: మీ బిజినెస్ నేమ్ తో పాటు మీ బిజినెస్ కార్యకలాపాలు మరియు మీ బిజినెస్ పూర్తి సమాచారాన్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది.
Step 05: మీ వివరాలతో పాటు, ఇప్పటికే మీకు ఉన్న బ్యాంకింగ్/క్రెడిట్ సౌకర్యాలు, భవిష్యత్తు అంచనాలు వంటి ఇతర సమాచారాన్ని కూడా పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది.
Step 06: ఆ తర్వాత అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే.. మీ ID ప్రూఫ్, మీ అడ్రస్ ప్రూఫ్, మీ ఫోటో, మీ సంతకం, మీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అడ్రెస్ ఇలా అన్ని ఫైల్స్ ను అక్కడ అటాచ్ చేయాలి.
Step 07: ఇలా ఆ అప్లికేషన్ లో పూర్తిగా అన్ని వివరాలు సమర్పించిన తర్వాత, ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది మీ లోన్ ప్రాసెస్ స్టేటస్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది.
గుర్తు పెట్టుకోండి.. మీరు అన్ని వివరాలు కరెక్ట్ గా ఇస్తే.. మీకు 100% లోన్ వస్తోంది. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం పెట్టిందే మీలాంటి వారి కోసం అని గుర్తు పెట్టుకోగలరు.