ఎన్నికల వేడి ప్రజల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంది. ముఖ్యంగా యూట్యూబ్ చానెళ్లు ఎవరో ఒకర్ని పట్టుకుంటారు. వారు నోటికొచ్చింది పేలుతుంటారు…వీరు మాంచి మసాలా థంబ్ నెయిల్స్‌తో ఆ వీడియోలను వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం ట్రెండ్ ఇదే. దాదాపు యూట్యూబ్ చానెళ్లన్నీ ఇంతే… వాళ్లూ వీళ్లూ అనే లేదేమీ లేదు లెండి. అందరి బాగోతం అంతే. తాజాగా పోసాని కృష్ణ మురళి ని ఓ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఓ కుర్ర మెయిల్ యాంకర్. ఇతగాడికి ఓవర్ యాక్టింగ్ కాస్త ఎక్కువే. ముఖ్యంగా నోటికి హద్దూఅదుపూ లేని పోసాని కృష్ణ మురళి లాంటి కేరక్టర్ దొరికింది అంటే ఇతగాడు పండగ చేసుకుంటాడు.
అసలుకే, పోసాని కొన్నాళ్లుగా టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించిన వారి పై ఎవరి మీద పడితే వాళ్ల మీద ఏదేదో కక్కేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఈ రెండు పార్టీల నాయకులు మోసం చేశారు అనేది పోసాని మాట. పవన్ కళ్యాణ్ అసలు మనిషే కాదు అన్నట్టు కామెంట్స్ చేస్తాడు. ఏదైనా సరే పరిమితి దాటితే, శృతిమించితే ఇక ఎవరో ఎదురు దాడి ప్రారంభిస్తారు. జనసైనికులు అదే పని చేస్తున్నారు. పాపం, జగన్ మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడం వల్ల పోసానికి ఏం లాభం లేదు. నిజానికి పోసాని మంచి సినీ రచయిత. ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపైన రాసే అక్షరం తోనే మొదలవుతుంది. అందుకే రచయితదెప్పటికీ అగ్రస్థానమే అంటారు.
సీనియర్ ఎన్టీఆర్ మరణం పైనా అదే గోల !
అందుకే, స్థాయితో నిమిత్తం లేకుండా రచయితను ఎప్పుడూ గౌరవిస్తారు. ఐతే, పోసాని కృష్ణ మురళి వంటివారు మాత్రం కొంత ప్రత్యేకం అయ్యారు. అందుకు తగ్గట్టుగానే పోసాని కి కొన్ని ప్రత్యేక ప్రతిభలున్నాయి. ముఖ్యంగా మీడియా మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే చాలు….. జీవితంలో ఎంత సాధించినవారినైనా వాడు వీడు అని సంబోధించగల మెంటల్ మనిషి పోసాని. చంద్రబాబు నాయుడు ఎందుకు పనికి రాడు అని పిచ్చి పలుకులు పలకగల వ్యక్తి పోసాని. అసలెందుకు టీడీపీ పార్టీ వారు ఎవరు ఎన్ని కోట్లు కాజేశారో.. ఏ బ్యాంక్ లో ఎన్ని కోట్లు దాచారో కూడా కళ్ళారా చూసినట్టు చెప్పగలడు పోసాని వారు.
అసలు సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు ఏమేమి ఎలా జరిగిందో అప్పుడు ఆ ప్రదేశంలో ఆయన అక్కడ వున్నట్టే వివరించగలడు ఈ పోసాని. కాకపోతే, ఆ పలుకులు అన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటాయి. అన్నట్టు లోకేష్ బాబు స్విస్ బ్యాంక్ లో దాచిన కోట్ల సొమ్ము వివరాల చీటీని కూడా అవలీలగా చెప్పగలడు. అంతేనా ?, పవన్ కళ్యాణ్ ఎవరి దగ్గర ఎంత పాకేజి తీసుకున్నాడో కూడా చెప్పగలడు. మరి, పవన్ కళ్యాణ్ సొంతంగా సంపాదించిన కోట్ల రూపాయిలను ప్రజలకు పంచి పెట్టడం మాత్రం పోసాని కృష్ణ మురళి వారికి తెలియదు. తెలిసినా అవి మంచి పనులు కావు. అద్భుతమైన సింగిల్ ఎక్స్ ప్రెషన్ ను కూడా ప్రదర్శించే పోసాని వారి దృష్టిలో.. జస్ట్ వందల సినిమాలలో మాత్రమే నటించి వందల కోట్లు వసూళ్లు చేసే స్థాయికి చేరిన బాలకృష్ణ గారు అసలు ఆర్టిస్టే కాదని బల్లలు బద్దలు కొట్టగలరు మన పోసాని వారు.
మరణించిన టీడీపీ పార్టీ నాయకులను అపహాస్యం చేయటమే కాక వీరికి అవకాశాలిచ్చి ఉపాధి కల్పించిన పరుచూరి బ్రదర్స్ వంటి వారి ప్రతిభకూ వ్యంగ్యంగా మరకలద్దగల ధీరుడు మన పోసాని వారు. పాపం అస్సలు మందు వాసనంటే తెలియని పోసాని, ఇప్పుడు ఇండస్ట్రీలో మందుని దాటి అందరూ డ్రగ్స్ విరివిగా వాడుతున్నారనీ కామెంట్లు కురిపించగలరు. తనకు అన్నం పెడుతున్న ఇండస్ట్రీనే ఎంతవరకైనా దిగజార్చగల వ్యక్తి పోసాని వారు. తనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించిన వ్యక్తుల మీద అబధ్ధాల అవాకులు చెవాకులు పేలగల నేర్పరితనం పోసాని కృష్ణ మురళి కి ఉంటే ఉండొచ్చు గాక, కానీ.. ఆయనకు తెలియనిదొక్కటే. ఆయన బాగోతాలు కూడా ఇక్కడ బోలెడు మందికి తెలుసు.
పోసాని కృష్ణ మురళి గారి అసహ్యకర జుగుప్సాకర లీలల మాటేమిటి ?
ఇప్పటికైనా పోసాని కృష్ణ మురళి గారిలో పశ్చాత్తాపం రాకుంటే వారికున్నంత కుసంస్కార ప్రతిభ గురించి, పోసాని వారి అసహ్యకర జుగుప్సాకర లీలలు విన్యాసాల గురించి బయటకు పొక్కే అవకాశం ఉంది. మెంటల్ కృష్ణ సినిమా షూటింగ్ లో జరిగిన పిచ్చి పిచ్చి వేషాల గురించి బయటకు లీక్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అయినా, పోసాని వారి అబధ్ధపు ఘోష మధ్యలో కూడా పట్టరాని నవ్వులతో నవ్వించగల పోసాని పిచ్చి టాలెంట్ కు మా పిచ్చి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈయన గారికి ఒక్క జగన్ మోహన్ రెడ్డే మొగాడు. మిగిలిన వారంతా అసలు మనుషులే కాదు.
మెంటల్ కృష్ణ అని తనకు తానే పేరు పెట్టుకుని ఏకైక వ్యక్తి బహుశా మన పిచ్చి పోసాని తప్ప మరొకరు కానరారు ఈ భూ ప్రపంచంలో. అందుకే, పోసాని అంటే రీల్ కమెడియన్ కాదు, రియల్ కమెడియన్. కాకపోతే, ఈ కమెడియన్ రాజకీయ తెరపై మాత్రం విలన్ గా ప్రమోట్ అవుదాం అని ప్రయత్నాలు చేస్తోంది. తప్పేం లేదు. ఇప్పటికే రాజకీయాల్లో ఎన్నో దరిద్రాలు ఉన్నాయి. ఈ దరిద్ర దారిద్య్రాన్ని కూడా భరించవచ్చు. కానీ, ఈ లోపే తన పిచ్చి పలుకులతో ప్రజల మనుసులను మసి చేసుకుంటే పోతేనే.. భరించడం కష్టం. అసలు పోసాని కృష్ణ మురళి ఆరోపణలకు ఏ నాడు ఆధారాల్లేవు. అయినా, మళ్లీ మళ్ళీ ఏదో కూస్తూనే ఉంటాడు. ఇదేం సామాజిక స్పృహో… ఆయన గారి వ్యాఖ్యలన్నీ ఇలాంటి అపరిపక్వ కూతలే… పైగా వీటికి సోషల్ కాన్షియస్నెస్ అని పూతలు రాయడం ఒక్క పోసాని కృష్ణ మురళి కే చెల్లింది !!