పీఎం సురక్ష బీమా యోజన పథకం పేదలకు భరోసా లాంటిది. కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలనే తీసుకు వచ్చింది. వాటిలో ఇది కూడా ఒకటి. ఇది ఒక ప్రమాద బీమా పథకం. ప్రమాదవశాత్తు చనిపోయినా, లేదా ప్రమాదం కారణంగా వైకల్యం వచ్చినా ఈ పథకం ఆసరాగా నిలుస్తుంది. ఈ పథకం ప్రీమియం విషయానికి వస్తే.. సభ్యుడు సంవత్సరానికి రూ.20/- కట్టాల్సి ఉంటుంది. బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా నుంచి ‘ఆటో డెబిట్’ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ప్రీమియం ప్రతి ఏడాది అదే కట్ అవుతూ ఉంటుంది.
(ప్రధాన మంత్రి) పీఎం సురక్ష బీమా యోజన వివరాలు :
- ఈ పథకం పేరు : ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన.
- మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది.
- ఈ పథకంలోని లబ్ధిదారులు అందరూ పేదవారే కావడం విశేషం.
- ఈ పథకం ముఖ్య లక్ష్యం ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే.
- కేవలం రూ.20 రూపాయలు కట్టి, ఆపద సమయంలో రూ.2 లక్షల వరకూ పొందవచ్చు.
పీఎం సురక్ష బీమా యోజన తో లాభాలు :
అనుకోని ప్రమాదం కారణంగా కుటుంబంలోని వ్యక్తి మరణిస్తే.. ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన నామినీకి రూ. 2 లక్షలు వస్తోంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం చేత అంగవైకల్యం కలిగినా చందాదారులకు రూ. 2 లక్షలు అందుతుంది. అంగవైకల్యం అంటే.. రెండు కళ్ళు పూర్తిగా లేదా కోలుకోలేని నష్టం కలిగినా, రెండు చేతులు లేదా కాళ్లు విరిగినా అలాగే ఏ ఇతర అంగవైకల్య సమస్యలు వచ్చినా చందాదారునికి రూ. 2 లక్షలు అందుతాయి. ఐతే, ప్రమాదం కారణంగా చందాదారునికి చందాదారునికి ఒక కన్ను పూర్తిగా మరియు కోలుకోలేని నష్టం కలిగినా, అలాగే ఒక చేయి లేదా కాలు ఉపయోగించకుండా పోయినట్లయితే ఒక రూ. 1 లక్ష వరకూ ఈ పథకం ద్వారా అందుతుంది.
పీఎం సురక్ష బీమా యోజన కి అర్హతలు ఇవే :
ఈ పథకం తీసుకోవాలని భావించే వారికి కొన్ని అర్హతలు ఉన్నాయి.
వారి వయసు 18 నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే అర్హులు
18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి. అలాగే 70 సంవత్సరాలు లోపు ఉండాలి.
ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దానికి ఆధార్ కార్డు కచ్చితంగా లింక్ చేసి ఉండాలి.
ఈ పథకంలో ఎలా చేరాలి ?
ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఐతే, ఈ పథకం పేదవారి కోసం కాబట్టి, వారు ఎక్కువ ఆఫ్ లైన్ ద్వారా తీసుకుంటారు కాబట్టి, ఆ విధానం చూద్దాం.
మొదటి స్టెప్ : ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఆఫ్ లైన్ లో తీసుకోవడానికి, బ్యాంక్ సేవింగ్ ఖాతాను ఓపెన్ చేయాలి. మీ దగ్గరలో బ్యాంక్ కి వెళ్లినా వారు మీకు తగిన సూచనలు చేయగలరు. లేదా మేం ఇస్తున్న ఈ ప్రభుత్వ అధికారిక సైట్ లోకి వెళ్లి ఫామ్ ని డౌన్ లోడ్ చేసుకోండి. సైట్ లింక్ : https://jansuraksha.gov.in/Forms-PMSBY.aspx
రెండో స్టెప్ : డౌన్ లోడ్ చేసుకున్న ఆ దరఖాస్తు ఫామ్ ని అభ్యర్థి యొక్క వివరాలతో నింపండి. అలాగే, అవసరమైన పత్రాలతో పాటు ఆ ఫామ్ ని బ్యాంకుకు వెళ్లి సమర్పించండి.
మూడో స్టెప్ : ఆ ఫామ్ ని విజయవంతంగా సమర్పించాక, మీరు ఒక సబ్‌స్క్రైబర్ రసీదు స్లిప్ తో పాటు ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ను పొందుతారు. ఆ ఆ తర్వాత మీరు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో సభ్యులు అయినట్టే.
ఈ మొత్తం ప్రాసెస్ చేసే క్రమంలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ టోల్‌ఫ్రీ నంబర్ లను సంప్రదించండి:
రాష్ట్రాల వారీగా టోల్‌ఫ్రీ నంబర్స్ ఈ పీడీఎఫ్ లింక్ లో ఉన్నాయి. పీడీఎఫ్ డౌన్ లోడ్ చేసుకుని మీ రాష్ట్రం టోల్‌ఫ్రీ నంబర్ ను పొందండి. https://jansuraksha.gov.in/files/STATEWISETOLLFREE.pdf
ఇక జాతీయ టోల్ ఫ్రీ నంబర్ ఇదే – 1800-180-1111 / 1800-110-001.
జాగ్రత్త.. ఈ పొరపాట్లు చేస్తే కవరేజ్ దక్కదు :
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కవరేజ్ వ్యవధి గురించి :
70 సంవత్సరాల వయస్సు దాటిన వారికీ ఈ పథకం వర్తించదు.
ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం కట్టే బ్యాంక్ ఖాతా మూసివేయకూడదు. అలాగే, ప్రీమియం డేట్ కి తగిన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.
అన్నట్టు ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా ఈ ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ పథకాన్ని తీసుకోకూడదు. అలా తీసుకుంటే.. ఈ పథకం కవర్ కాదు.
పీఎం సురక్ష బీమా యోజన గురించి ఇంకా డెప్త్ గా :
ఏదైనా ప్రమాదం జరిగింది. అంగవైకల్యం రాలేదు. కానీ హాస్పిటల్ లో భారీగా ఖర్చులు అయ్యాయి. మరి ఈ పథకం ద్వారా ఆ ఖర్చులు వస్తాయా ?
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ఎలాంటి హాస్పిటల్ ఖర్చులు కవర్ కావు అండి.
పీఎం సురక్ష బీమా యోజన తీసుకున్న వ్యక్తి 70 ఏళ్ల లోపే మరణించాడు. మరి ఈ పథకం నుంచి కుటుంబ సభ్యులు ఆ రూ. 2 లక్షలను ఎలా పొందవచ్చు ?
ఈ పథకం తీసుకునే సమయంలో ఖాతాదారుడు, ఎన్రోల్మెంట్ ఫామ్ ప్రకారం తన నామినీ (కుటుంబ సభ్యుడు) పేరు రాస్తాడు. ఆ నామినీ క్లెయిమ్ దాఖలు చేసుకుని రూ. 2 లక్షలను పొందవచ్చు. ఒకవేళ ఫామ్ లో ఎటువంటి నామినీ పేరును రాయకపోయినట్లయితే.. చట్టపరమైన వారసులు క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు.
పీఎం సురక్ష బీమా యోజన పథకం తీసుకున్న ఖాతాదారుడు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబానికి బీమా ప్రయోజనం వర్తిస్తుందా ?
లేదు అండి, ఖాతాదారుడు ఆత్మహత్య చేసుకుంటే.. ఎలాంటి బీమా ప్రయోజనం దక్కదు.
ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులు ఇవి గుర్తు పెట్టుకోండి :
(ప్రధాన మంత్రి) పీఎం సురక్ష బీమా యోజన ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే ముందు ఇవి తప్పక గుర్తు పెట్టుకోండి.
రోడ్డు, రైలు మరియు ఇతర వాహన ప్రమాదాలు, నీటిలో పడి మరణించడం, అలాగే ఏదైనా నేరంతో కూడిన మరణం ఇలా మొదలైన ప్రమాద కార సంఘటనల విషయంలో, ఆ ప్రమాదాన్ని పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. వారి నుంచి తగిన ధ్రువీకరణ పత్రాలను కూడా తీసుకోవాలి.
ఒకవేళ, ఏదైనా పాము కాటు ద్వారా చనిపోయినా, లేదా చెట్టుపై నుంచి పడిపోయి చనిపోయినా.. ఇలాంటి సంఘటనల విషయంలో, వెంటనే ఆసుపత్రి రికార్డు ద్వారా కారణాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
పీఎం సురక్ష బీమా యోజన పథకం నుంచి నిష్క్రమించిన వ్యక్తులు మళ్లీ ఈ పథకంలో చేరే అవకాశం ఉందా ?
ఏ కారణం చేతైనా ఈ పథకం నుంచి నిష్క్రమించిన వ్యక్తులు, నిర్దేశించబడిన షరతులకు లోబడి, వార్షిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పథకంలో మళ్లీ చేరే అవకాశం ఉంటుంది.
భూకంపం ద్వారా, లేక వరదలు ద్వారా మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయినా లేదా వైకల్యం కలిగినా ఈ పథకం నుంచి సాయం (కవరేజీ) అందుతుందా ?
ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే మరణం లేదా వైకల్యం.. ఏదైనా సరే పీఎం సురక్ష బీమా యోజన పథకం వర్తిస్తుంది.
ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న వారు ఈ పథకం తీసుకోగలరు ?
సంస్థాగతమైన ఏ బ్యాంక్ అయినా, లేదా పోస్టాఫీసు ఖాతాదారులందరూ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం తీసుకోవడానికి అర్హులే.