TDP Jr Ntr cm : ఓ ప్రముఖ వెబ్ సైట్ ‘చంద్రబాబు తర్వాత తెలుగుదేశం భవిష్యత్తు ఏమిటి ?’ అని ఓ ఆర్టికల్ రాసింది. ఏ సంస్థకైనా, ఏ వ్యవస్థకైనా భవిష్యత్తు బాగుండాలి అంటే.. వారసుడిలో విషయం ఉండాలి. కానీ, తెలుగుదేశానికి ఆ పరిస్థితి లేదని ఆ ఆర్టికల్ లో లోకేష్ ను ఉద్దేశించి రాసుకొచ్చారు. ఏ..?, తెలుగు దేశానికీ వారసుడు కేవలం లోకేషేనా ?, జూనియర్ ఎన్టీఆర్ పేరు తేవడానికి కూడా వారు ఎందుకు భయ పడుతున్నారు ?,
ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అన్ని పార్టీల వారిని చూసుకున్నా.. జూనియర్ ఎన్టీఆర్ కి సరితూగకపోవచ్చు. తారక్ కు ఉన్న వాచకం, ప్రజల్లో తారక్ కి ఉన్న గుర్తింపు, మాస్ లో ఫాలోయింగ్, పడినా లేచే నాయకత్వం లక్షణాలు, లోతైన ఆలోచనలు ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న బలం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా వారసుడు ఎన్టీఆరే అవుతాడు, కాబట్టి.. మరో ముప్పై ఏళ్ల వరకూ తెలుగుదేశం భవిష్యత్తు కు వచ్చిన ముప్పు ఏమీ లేదు.
మరీ లోకేష్ ఉండగా.. జూనియర్ ను రానివ్వరు కదా..? అని కొందరు అభిమానులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫక్తు బాబు ఫాలోవర్స్ అయితే, లోకేష్ ముందు జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ చేసినా.. పాజిటివ్ ప్రచారంతో మేనేజ్ చేసినా.. అది ఎప్పటికీ వాపే అవుతుంది గానీ, బలుపు కాదు. లోకేష్ కి కూడా తెలుగు దేశం కావాలి. కానీ, తెలుగు దేశానికీ ఎన్టీఆర్ కావాలి. ఇతర పార్టీల నుంచి పోటీని తట్టుకుని నిలబడాలి అంటే.. ప్రజల్లో బలం ఉన్న నాయకుడు కావాలి.
సోషల్ మీడియా వచ్చాక, ప్రత్యర్థి పార్టీల పై దుష్ప్రచారాలు చేసి గెలిచే రోజులు పోయాయి. అదే విధంగా వ్యవస్థలతో కట్టడి చేయడం వంటి ఎత్తుగడలకు కూడా కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఇప్పుడు తెలుగు దేశానికీ కావాల్సింది బలమైన నాయకుడు. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించగలిగే నాయకుడు. కచ్చితంగా ఒక్క ఎన్టీఆర్ మాత్రమే దానికి అర్హుడు. ఈ ఎలక్షన్స్ కి తారక్ దూరంగా ఉండొచ్చు. ఎన్టీఆర్ వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు. 2029 ఎన్నికలకు 45 ఏళ్లు వస్తాయి. అప్పుడు చంద్రబాబుకు 80 ఏళ్లు వస్తాయి. అప్పటి పరిస్థితులు కచ్చితంగా ఎన్టీఆర్ వైపే చూస్తాయి. తారక్ కి కూడా అదే సరైన సమయం కావొచ్చు.
ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ అయినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో చక్కటి ప్రతిపక్ష పార్టీ ఉండడం ప్రజలకు మేలు చేస్తోంది. కాబట్టి, తెలుగు దేశం ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా పార్టీ ఎక్కడకు పోదు. కాకపోతే, దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీని అంగుళం కూడా ఎదగనీకుండా టీడీపీ పార్టీ, చంద్రబాబు అడ్డు పడ్డారని బీజేపీ బలంగా నమ్ముతుంది. ఒకవేళ, అనేక కారణాలతో… ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. ఆ తర్వాత ఆ పార్టీని సమూలంగా తుడిచిపెట్టేసేలా బీజేపీ ఇప్పటికే పావులు కదిపి ఎదురు చూస్తోందని టాక్.
పైగా ఆ పరిస్థితే వస్తే.. టీడీపీ మొత్తాన్ని తమ పార్టీలోకి లాగేసి.. ఆ మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ను లీడర్ గా పెడితే గెలుపు ఖాయం అనేది బీజీపీ పెద్దల అంచనా. ఆ మధ్య అమిత్ షా.. ఎన్టీఆర్ ను కలిసింది కూడా ఈ రాజకీయాల గురించే అని వార్తలు వచ్చాయి. ఏమో గుర్రం ఎగరొచ్చేమో. రాజకీయాల్లో అసాధ్యానికి చాలా దారులు ఉంటాయి. ఓ దారి ముసిపోయినా.. మరో దారి తెరుచుకుంటుంది. ఎన్టీఆర్ రాజకీయ రాక కూడా అచ్చంగా ఇలాగే ఉండే అవకాశం ఉంది.
టాలెంట్ ఉంటే.. అవుట్ ఫుట్ వచ్చి తీరుతుంది. ఎన్టీఆర్ విషయంలో కూడా ఇది కచ్చితంగా రుజువు అవుతుంది. ఆ సమయం ఆసన్నం అయితే, ఎన్టీఆర్ ప్రాపకం కోసమే ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితుల్లో బాబు వర్గం చిక్కుకుని పోవొచ్చు. అప్పుడు tdp jr ntr cm అని అనిపించుకోవచ్చు. ఇప్పుడంటే.. పవన్ కళ్యాణ్ తో కలిసి.. పైగా సగం బాధ్యతలు పవన్ కి ఇవ్వడానికి బాబు వర్గం సిద్ద పడుతుంది గాని, జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. కానీ, చంద్రబాబు యాక్టీవ్ గా లేని పక్షంలో ఒక్క జూనియర్ ఎన్టీఆరే టీడీపీకి భవిష్యత్తు. అప్పుడు ఎన్టీఆర్ ను ఆహ్వానించక్కర్లేదు. తెలుగు తమ్ముళ్లే ఎన్టీఆర్ వైపు వెళ్తారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ సీఎం కూడా కావ్వొచ్చు. మరి ఆ రోజు రావాలని, tdp jr ntr cm కావాలని కోరుకుందాం.