మనలో చాలామంది మలబద్ధకం నాకు రాదులే అనుకుంటారు. ఇక Malabaddakam Treatment తో మాకేం పని ? ఇలాగే ఉంటుంది వారి ధోరణి. కానీ, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే.. మీ ఆరోగ్యం కోసం మీరు వేసుకునే మందులే (మెడిసిన్) మీకు మలబద్ధకాన్ని తెచ్చిపెడతాయి. అదేమిటి ?, మనం అవసరార్ధం వాడుకునే మందులు మలబద్ధకానికి కారణం ఎలా అవుతాయి ?, ఉదాహరణకు దగ్గు, జలుబును తగ్గించే యాంటీహిస్టమిన్లను, ఎలెర్జీకి సంబంధించిన ఔషధాలను తీసుకొనే వారికి మలబద్ధకం వస్తూ ఉంటుంది.
అలాగే, నొప్పులు, వాపులు, తగ్గే మెడిసెన్, మైగ్రెయిన్ తలనొప్పికి వాడే మెడిసిన్ కూడా మలబద్ధకాన్ని తెచ్చి పెడుతుంటాయి. ఫిట్స్, మూర్ఛలు, అపస్మారం వంటి వ్యాధులకు రోజూ మందులు వాడక తప్పదు. ఆ మందుల వలన చాలా మందిలో మలబద్ధకం వస్తూ ఉంటుంది. కడుపులో మంటని తగ్గించే మందులు లెక్క ప్రకారం విరేచనం అయ్యేలా చేయాలి. కానీ, వాటిలో వుండే కేల్షియం, అల్యూమినియం వంటి ఖనిజాలు మలబద్ధకానికి ఒక్కొక్కసారి కారణం అవుతూ వుంటాయి. శరీరానికి నీరు పట్టిన వ్యాధిలో మూత్రం ఎక్కువగా నడవడం కోసం వాడే మందులు కూడా మలబద్ధకానికి కారణం అవుతాయి.
ఇనుము కలిసిన మందులు రక్త పుష్టి కోసం వాడతారు. కొందరిలో ఇనుము విరేచనాలు అయ్యేలా చేస్తుంది కొందరికి మలబద్ధకం తెస్తుంటుంది. బీపీ తగ్గడానికి వాడే మందుల వలన కూడా మలబద్దకం వస్తుండడం చాలా మందిలో గమనించాం. అదేవిధంగా గసగసాలు కలిపిన ఆహార పదార్థాలు ఎక్కువగా తిన్నా మలబద్దకం వస్తూ ఉంటుంది. వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులుగానీ, నాడులకు సంబంధించిన వ్యాధులుగానీ వచ్చిన వారిలో విరేచన బద్ధకం సహజంగా వుంటుంది. విరేచనానికి వెళ్ళాలని అనిపించాలంటే, మలాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పని చేసి అలా అనిపించేలా ప్రేరేపిస్తాయి.
నాడీ సంబంధ వ్యాధుల వలన ఈ సెన్సేషన్ పోతుంది, అందువలన విరేచనానికి వెళ్ళాలని అనిపించదు. ఇది చాలా ప్రమాదకరం. అసలు, Malabaddakam Treatment లోనే ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా ?, మలబద్ధకం రావడానికి గల కారణాన్ని కనిపెట్టడమే.
Malabaddakam symptoms – మలబద్ధకం లక్షణాలు
Dr. Badari Narayana Vutukuri వంటి డాక్టర్స్ చెప్పే మాట మలబద్ధకం లక్షణాలను చాలా ఈజీగా గుర్తించొచ్చు. కానీ, ఒక్కోసారి మలబద్ధకం గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే, ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి. ప్రోక్టోస్కోపీ ద్వారా మలద్వారం లోంచి లోపల పరీక్ష చేస్తే, ఫిషర్స్, మొలలు, పుళ్ళు, ఎర్రగా పూసినట్టుండటం… ఇలాంటి మలబద్ధకానికి కారణం అయ్యే అంశాలన్నీ ఈ పరీక్షలో తెలుస్తాయి. సిగ్మాయిడో స్కోపీ అనే పరీక్ష చేయిస్తే కేన్సర్ గడ్డలు, పేగులోపల ఏదైనా అవరోధం ఏర్పడటం, పేగు లోపల పూతవంటి పరిస్థితులేమైనా వున్నాయేమో అర్ధం అవుతుంది. అందుకే, విరేచనం పరీక్ష చేయిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.
1. ఐతే, విరేచనం రిబ్బన్ లా సన్నగా అవుతుంటే మలద్వారం మూసుకుపోయి సరిగా ఓపెన్ కాకపోవడం జరుగుతోందన్న మాట. మొలలు, పుళ్ళు, గడ్డలు, ఆ ప్రాంతంలో ఆపరేషన్ జరగడం, దెబ్బతగలటం ఇలాంటి కారణాలు అనేకం ఉన్నాయి.
2. విరేచనం పెంటికలు కట్టుకొని మేక మలంలాగా అవుతున్నట్లయితే, అది ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ అనే అమీబియాసిస్ వ్యాధికి చెందిన లక్షణం కావచ్చు.
3. విరేచనాన్ని మైక్రోస్కోప్లో పరీక్ష చేయిస్తే, సూక్ష్మజీవులు వున్నా, రక్తం వున్నా, నులిపురుగులు ఉన్నా, జిగురు వున్నా, అపక్వమైన ఆహార పదార్ధాలున్నా తెలుస్తుంది. మామూలుగా వాడే విరేచనకర ఔషధాలతో మలబద్ధకం తగ్గనప్పుడు తప్పనిసరిగా ప్రోక్టోస్కోపి, సిగ్మాయిడోస్కోపి, బేరియం ఎనీమా ఎక్స్, రక్త పరీక్షల్లో TC, DC, ESR, HFY శరీరంలో ఎలక్ట్రోలైట్ శాతం, కాల్షియం, లెడ్ వంటి ఖనిజాల శాతం, థైరాయిడ్ గ్రంధి పనితీరు వగైరా పరీక్ష లన్నింటినీ డాక్టర్ చేయించి చూస్తారు. అందుకే, Malabaddakam Treatment లో విరేచనాన్ని మైక్రోస్కోప్లో పరీక్ష చేయడం చాలా కీలకం.
కానీ, ఈ మైక్రోస్కోప్లో పరీక్ష అనవసరం అనుకొని, డాక్టర్ సలహాను పెడచెవిని పెట్టేవారు కూడా ఉంటారు. అలా పెట్టవద్దని మా మనవి. మలబద్దకం సహజంగా వచ్చింది కానప్పుడు లోపల ఏదో కారణం ఉండే ఉంటుందని అనుమానించక తప్పదు. అది ఒక్కోసారి చాలా ప్రమాదం కూడా. అందుకే, Malabaddakam symptoms ను కనుక్కోవడానికి చాలా దారులు ఉన్నాయి. కాబట్టి, నిర్లక్ష్యం చెయ్యొద్దు.
Malabaddakam medicine – మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి ?
ఇదిగో…. ఇవి పాటించండి! మలబద్ధకాన్ని పారద్రోలండి. పాయింట్స్ ప్రకారం Malabaddakam remedies (మలబద్ధకం నివారణ చిట్కాలను) చూద్దాం రండి.
1. బీన్స్, సోయాబీన్స్, చిక్కుడు, అలసందలు, బొబ్బర్లు ఇలాంటి ఆహార పదార్ధాలలో ఫైబర్ ఎక్కువగా వుంటుంది. కాబట్టి, వీటిని ఎక్కువగా తీసుకుంటే విరేచనం ఫ్రీగా అవుతుందని ఆధునిక శాస్త్రం చెబుతుంది.
2. అల్లం మెత్తగా దంచి, తగినంత సైంధవ లవణం అందులో కలిపి ఒక సీసాలో నిలవ వుంచుకోండి. రోజూ అన్నంలో మొదటి ముద్దగా 1/4 చెంచా మోతాదులో నెయ్యి వేసుకుని తినండి. విరేచనం ఫ్రీగా అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
3. ఆముదం మంచిది తెచ్చుకొని, దాంతో ఆహారపదార్ధాలు వండుకుంటే చాలా మంచిది. ఆముదంలో వండిన గారెలు ఈ వ్యాధిలో చాలా బాగా పనిచేస్తాయి. ఆముదాన్ని నేరుగా తీసుకున్నా మంచిదే! మలబద్ధకం ఉన్న రోగులకు ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం ఆముదం!
4. గులాబి పువ్వుల రేకుల్ని తీసుకొని వాటిని పల్చగా పొరలా పళ్ళెంలో పరవండి. దాని మీద పంచదార చల్లండి. పైన మళ్ళీ గులాబి రేకులు పరవండి. దాని మీద పంచదార మళ్ళీ చల్లండి. ఇలా పొరలు పొరలుగా గులాబీ రేకుల మీద పంచదార చల్లుతూ ఒక పాతకగా పేర్చి రోజూ నీటితోగానీ, పన్నీటితోగానీ తడపండి. కొన్ని రోజులకు రేకులు, పంచదార కలిసి మిశ్రమంగా మారి లేహ్యం అవుతుంది. రోజా పుష్ప లేహ్యం పేరుతో ఇది బజార్లో దొరుకుతుంది కూడా. దీన్ని రోజూ తీసుకొంటే మృదు విరేచనం అవటమే కాకుండా రక్తశుద్ధిని కూడా కల్గిస్తుంది. చలవ చేస్తుంది. పైత్యపు వ్యాధులన్నింటిలోనూ మంచిది. Malabaddakam Treatment లో డాక్టర్స్ కూడా ఈ రెమెడీని వాడతారు.
5. అదేవిధంగా ఇంగువని నేతిలో వేయించి, మెత్తగా దంచి, శనగ గింజంత మాత్రలు కట్టుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే మలద్వారం దగ్గర మంట, నొప్పి, విరేచనంతో కలిసి నెత్తురు పడడం, జిగురు తగ్గుతాయి. విరేచనం ఫ్రీగా అవుతుంది.
ఇంట్లోనే Malabaddakam nivarana chitkalu (ఇంటి చిట్కాలు)
2. ఉప్పునీళ్ళు వాంతినీ, విరేచనాన్ని అయ్యేలా చేసి పేగుల్ని శుభ్రం చేస్తాయి.3. ధనియాలు, జీలకర్ర, వాము… ఈ మూడింటినీ సమానంగా తీసుకొని నేతిలో వేయించి, మెత్తగా దంచి తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలోగానీ, టిఫెన్లలోగానీ, మజ్జిగలోగానీ రోజూ తీసుకొంటే, ఆకలి పెరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరం తేలికగా వుంటుంది. కడుపులో పాములు పోతాయి. కడుపులో వాతం తగ్గుతుంది. పిల్లలకు అజీర్ణం, కడుపులో నొప్పి తగ్గుతాయి. విరేచనం చక్కగా అవుతుంది. మూత్రం బంధించినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ధాన్యకాదిలేహ్యం అనే మందు బజార్లో దొరుకుతుంది. ఇది విరేచనాన్ని మృదువుగా అయ్యేలా చేస్తుంది.
4. అలాగే, కాకరాకురసం రెండు చెంచాల మోతాదులో తేనె కలుపుకొని తీసుకొంటే, చలి జ్వరాలు తగ్గుతాయి. కడుపులో పాములు పోతాయి. కఫం తగ్గుతుంది. విషదోషాలు ఎలర్జీ వ్యాధుల్లో మంచిది. అన్నహితవు కలుగుతుంది. అన్నం తినబుద్ధి కావటల్లేదు అనేవారు దీన్ని తీసుకొంటే నోటికి రుచి కలుగుతుంది కూడా.
5. ద్రాక్ష, కిస్మిస్, యాపిల్, కమలాలవంటి పళ్ళకు విరేచనాన్ని కల్గించే గుణం వుంది.
6. కొత్తిమీరను ఎంత వీలైతే అంత తరచుగా ఆహార పదార్థాలలో వాడుకొంటూ వుంటే చక్కగా విరేచనాన్ని కల్గిస్తుంది. కరివేపాకు, కొత్తిమీర ఎండించి, మెత్తగా దంచి, తగినంత ఉప్పు కలుపుకొని అన్నంలో తింటే మరీ మంచిది. పైన చెప్పిన టిప్స్ Malabaddakam Home Remedies లోనే అద్భుతమైనవి. ఎంతో పవర్ ఫుల్ గా పని చేస్తాయి. 20 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్స్ చెప్పిన చిట్కాలు ఇవన్నీ.
Malabaddakam Treatment : మీ పిల్లల్లో మలబద్ధకం పోవాలంటే ఏం చేయాలి ?
1. Chinna Pillala Malabaddakam – పిల్లలకు మలబద్ధకం వస్తే చింతపండు చారు రోజూ తాపాలి. అప్పుడు కడుపులో బేజారు పోయి కాలవిరేచనం అవుతుంది. అలాగే, సునాముఖి ఆకుని ఈ చారులో వేసి బాగా మరిగించి తాగితే తప్పకుండా విరేచనం అవుతుంది.
2. బూడిద గుమ్మడికాయ హల్వాచేసుకొని పిల్లలకు తినిపించాలి. చలవ చేస్తుంది. విరేచనాన్ని కల్గిస్తుంది. కూష్మాండ లేహ్యం అనే పేరుతో బజార్లోదొరికే మందును తీసుకున్నా మంచిదే. చక్కగా విరేచనం అవుతుంది.
3. లేత ములగాకు కూరని వండుకొని తింటే విరేచనం అవటమే కాకుండా వాతం తగ్గుతుంది. పక్షవాతం, కీళ్ళవాతం వంటి వాతవ్యాధులన్నింటిలోనూ ఇది మంచిది.
4. సీతాఫలం ఆకుల కషాయాన్ని తేనె కలిపి తాగిస్తే మలద్వారంలోంచి పేగు బైటకు వచ్చే వ్యాధి తగ్గుతుందని వస్తుగుణదీపిక అనే వైద్య గ్రంధం చెప్తోంది.
5. సీతాఫలం వేరు ఎక్కువ విరేచనాలు అయ్యేలా చేస్తుంది. చాలా తక్కువ మోతాదులో ఇస్తే అమీబియాసిస్ వ్యాధిలో జిగురును తగ్గించి, విరేచనాన్ని ఫ్రీగా అయ్యేలా చేస్తుంది.
6. బొప్పాయి పండు తింటూ వుంటే మలబద్ధకాన్ని కల్గించే ప్రకృతి మారుతుంది. Malabaddakam Treatment లో పిల్లలకు మలబద్ధకాన్ని తగ్గించడానికి పైన చెప్పుకున్న పాయింట్స్ అత్యంత విలువైనవి.
Malabaddakam Treatment, Solution – మలబద్ధకానికి మరో రెండు బెస్ట్ టిప్స్
1. వేపచెట్టు మీద జిగురు సేకరించి, కుంకుడు గింజంత సైజు మాత్ర కట్టుకొని ఉదయం, సాయంత్రం ఒకటి తీసుకొంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగట విరేచనాలు,, రక్తం పడడం తగ్గుతాయి. విరేచన బద్ధకం పోతుంది.
2. ఆకు కూరలు రోజూ తినడం అవసరం. పెరుగుతోటకూర, కొయ్యతోటకూర, పాలకూర, మెంతికూర. పొన్నగంటికూర, గంగపాయలి కూర, చక్రవర్తి కూర వాటిలో ఏవి దొరికితే వాటిని రోజూ వండుకొని తినాలి. విరేచనం సాఫీగా అవటమే కాకుండా చలవచేస్తాయి. గోంగూర, పుల్లబచ్చలి, చుక్కకూర వంటి పుల్లని కూరలు వాతాన్ని కల్గించి, మలబద్ధకాన్నిస్తాయి. అందుకే వీటిని తినేప్పుడు జాగ్రత్తగా వుండాలి. ఎంతోకష్టపడి పలువురి డాక్టర్స్ నుంచి సేకరించిన ఈ అమూల్యమైన సమాచారం చదివి.. మీకు ఏది మంచిదో ఆలోచించి తగిన జాగ్రత్తలతో ఈ రెమడీస్ ను తీసుకోండి. ఈ ఆర్టికల్ ఒకవిధంగా Malabaddakam Solution. అవును, మీ మలబద్దకానికి మీకు మీరే సొల్యూషన్ ఇవ్వండి. ఆరోగ్య ప్రాప్తిరస్తు..!.