- సమస్త రోగాలకూ మూలం మలబద్ధకంలోనే వుంది,
- మలబద్ధకం రావడానికి కారణం అదే,
- వారి జన్మ ధన్యం.
malabaddakam – మలబద్దకం వారిలోనే ఎక్కువ :
మలబద్ధకం ఆడవారిలో ఎక్కువ. అందుకు సామాజికమైన కారణం ఒకటుంది. ప్రొద్దున నిద్ర లేచింది మొదలు, అర్ధరాత్రి పడుకునే వరకూ ఇంట్లో ఆడవాళ్ళకున్న బిజీ షెడ్యూల్’ వలన వాళ్ళు విరేచనానికి వెళ్ళే టైం లేక వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదాలు పడీపడీ, ఆఖరికి మలబద్దకం అనేది వారిలో అలవాటుగా మారిపోతుంది!.
మలబద్ధకం రావడానికి చాలా రకాల వ్యాధులు కారణం కావచ్చు. కానీ, చాలామంది విషయంలో విరేచనానికి వెళ్ళడానికి బద్ధకించి వాయిదా వేయటమే ముఖ్య కారణం.
malabaddakam – మీకు నిజంగానే విరేచనం బాగా అవుతోందా?
విరేచనం బాగానే అవుతోంది అంటారు చాలామంది. కానీ ఆ చాలా మందిలో ఎందరికో అయ్యేది సరిఅయిన విరేచనం కాదు. విరేచనం వేళ ప్రకారం సరిగ్గా సమయానికి అవ్వాలి. దాని కోసం ఎదురుచూస్తూ టాయిలెట్ లోకి ఇంట్లోకి షటిల్ తిరగే విధంగా ఉండకూడదు. వేళకు విరేచనానికి వెళ్ళాలని అనిపించాక టాయిలెట్ లోకి వెళ్ళగానే విరేచనం అయిపోవాలి. గంటల తరబడి మోకాళ్ళు పట్టేసేలా కూర్చోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. విరేచనం మృదువుగా వుండాలి. అందులో అంతకు మునుపు తీసుకున్న ఆహారపదార్ధాలు కనిపించకూడదు.
విరేచనంలో జిడ్డుగానీ, జిగురు (బంక) గానీ, రక్తపు చారలు గానీ ఉండకూడదు. పుల్లటి వాసన గానీ, కుళ్ళిన వాసన గానీ, చీము వాసన గానీ, విరేచనానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో గాలి రావడం, ఆ గాలి దుర్వాసన గా ఉండటం మీ కడుపులో వాతం బాగా చేరిందనడానికి గుర్తు. ఇది రానున్న వాత వ్యాధులు హెచ్చరిక కూడా. చూశారా ?, మలబద్దకం ఎంత ప్రమాద కరమో.
అమీబియాసిస్ వ్యాధి మలబద్ధకానికి తల్లి
1. రోజూ విరేచనం సరిగా కాకపోవడంతో మీరు బాధపడుతున్నారా? వెళ్ళాలని అనిపించకపోవడం, వెళ్ళినా ఎంతసేపటికీ రాకపోవటం జరుగుతోందా? పేగుల్లో జడత్వం అనేది ఈ లక్షణానికి ముఖ్య కారణం.
2. రోజూ విరేచనానికి వెళ్లాలని అనిపిస్తుంది కానీ, వెళ్ళిన తర్వాత వస్తున్నట్లే అన్పించి ఆగిపోతోందా? విరేచనం నడిచే మార్గంలో పేగులోపల అవరోధం వుందేమో పరీక్ష చేయించుకోవడం మంచిది.
3. విరేచనానికి పదే పదే అనేకసార్లు వెళ్ళాలని అన్పించడం, వెళ్ళినప్పుడల్లా పెంటికలుగానో, ముక్కలుగానో, జిగురుగానో, రక్తంతో కలిసో విరేచనం అవుతోందా…? ఇది ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ అనే వ్యాధి లక్షణంగా చెప్తారు. అమీబియాసిస్ వున్న వారిలో ఇలాంటి బాధ ఎక్కువ వుంటుంది. అయితే జిగురుతో కూడిన విరేచనాలు అవుతాయి. లేకపోతే మలబద్ధకం ఏర్పడి, విరేచనం అయ్యీ అవ్వక, వచ్చీరాక వచ్చినా ఇంకా ఎంతో కొంత లోపల మిగిలే వుందనిపించే పరిస్థితి ఈ అమీబియాసిస్ వ్యాధిలో తరచూ కనిపిస్తుంది.

మొలలూ – మలబద్దకం (malabaddakam) :
గట్టిగా ముక్కగా ముక్కగా కొద్ది విరేచనం అతికష్టం మీద అవుతూ లోపల ఏదో పట్టుకొని బంధించినట్లు విరేచనం అవుతోందా…? లోపలి వైపు మొలలు (ఇంటర్నల్ పైల్స్) వున్నాయోమో పరీక్ష చేయించుకోవాలి.
ఇది ఇలా వుంటే మరికొందరి విషయంలో ప్రతిరోజూ విరేచనానికి వెళ్ళడం అనేది ఒక పెద్ద యుద్ధ కార్యంగా మారిపోయి, అతికష్టం మీద విరేచనానికి వెళ్ళటం జరుగుతుంటుంది! కానీ, ఇంకా లోపల చాలా విరేచనం మిగిలిపోయినట్లే అన్పించి, గట్టిగా ప్రయత్నించగా అంతో ఇంతో రక్తం పడటం గానీ, జిగురు పడటం గానీ జరుగుతుంది.
పైల్స్ కంప్లెయింట్లో అయితే కేవలం రక్తం పడుతుంది. అలా కాకుండా, విరేచన మార్గం లోపల, పేగు చివరి భాగం బయటకు జారడం వల్ల ఒక్కోసారి రక్తపు బొట్లు గానీ, ధారగా రక్తం కారడం గానీ జరగవచ్చు. దీన్ని RECTAL PROLAPSE అంటారు.
రెక్టమ్ బైటకు జారినప్పుడు, బొటనవేలితో నెమ్మదిగా లోపలకు నొక్కితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మలబద్దకంలో పదేపదే ముక్కడం వలన ఇలా జారుతుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చూసుకుంటే, ఇలా రెక్టమ్ జారడం అయిపోతుంటుంది. కొందరు ఆడవాళ్ళలో మరో దురదృష్టకరమైన అంశం జరుగుతుంటుంది. యోని లోపలి నుంచి వేలితో బయటకు నొక్కితే గానీ విరేచనం కాదు. పేగు చివరి భాగంగా మనం ఇందాక చెప్పుకున్న రెక్టమ్ (మలాశయం) యోనిలోకి జారడం వలన ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. రెక్టోసీల్’ ఏర్పడటం అంటారు దీన్ని. విరేచన మార్గాన్ని పైకి నొక్కితేగానీ కొందరికి కడుపు కదలదు. విరేచనాన్ని బయటకు తోసెయ్యడానికి ఉపయోగపడే కండరాలు వదులు కావటం గానీ, సాగిపోవడం గాని జరిగి విరేచనం కదలదన్నమాట. ఈ రెండు లక్షణాలను శస్త్రచికిత్స ద్వారా సరిచేసుకోవచ్చు. రోజూ తగినంత నీరు తీసుకోవటం, విరేచనాన్ని చక్కగా అయ్యేలా తోడ్పడే ఆహారాన్ని తీసుకోవడం ఈ రెండు అలవాట్లూ లేనివారికి మలబద్ధకం ఒక సమస్యగా ఉంటుంది. కాబట్టి, మలబద్ధకం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.