గత రెండు వేల సంవత్సరాల వ్యవధిలో ప్రపంచం కొన్ని వేల సంవత్సరాల ముందుకు సాగింది. మనిషిలో మానసిక వికాసం బాగా పెరిగింది. కాబట్టి, ఇప్పుడు క్రీస్తు తాత్వికతను, తులనాత్మకంగా, అధ్యయనం చేసి అర్ధం చేసుకునే వీలుంది. కాబట్టి, ఈ జీసస్ పాటలను అందరికీ షేర్ చేసి ఆ జీసస్ సేవలో భాగం అవుదాం.
jesus songs lyrics in telugu – మొదటి పాట
యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా
(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా ||అమ్మా||
కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా
ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా
అమ్మా… నాన్నా…
అమ్మా నాన్నా నీవేనయ్యా ||అమ్మా||
ఎవరూ లేని ఒంటరి నేనయ్యా
ఎవరూ లేని అనాథను నేనయ్యా
అమ్మా… నాన్నా…
అమ్మా నాన్నా నీవేనయ్యా ||అమ్మా||
నేనున్నాను భయమేలను అని
నాకభయమిచ్చిన నా యేసు రాజా
అమ్మా… నాన్నా…
అమ్మా నాన్నా నీవేనయ్యా ||అమ్మా||
jesus songs lyrics – రెండో పాట :
ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు
జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదనుషారోను రోజా ఆయనే
లోయ పద్మమును ఆయనే
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు ||కీర్తింతున్||పరిమళ తైలం నీ నామం
దాని వాసన వ్యాపించెగా
నింద శ్రమ సంకటంలో
నను సుగంధముగా చేయున్ ||కీర్తింతున్|| (Jesus songs lyrics in telugu)
మనోవేదన సహించలేక
సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి ||కీర్తింతున్||
నా త్రోవకు దీపం నీవే
నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే
నా ఆత్మకాదరణ నీవే ||కీర్తింతున్||
ఘనమైన నా ప్రభువా
నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత ||కీర్తింతున్||
నీవు నా దాసుడవనియు
ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడనని
భయపడకు-మని అంటివి ||కీర్తింతున్||
Jesus Telegu మూడో పాట :
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2) (Jesus songs lyrics in telugu)ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను (2)
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2) (Jesus songs lyrics in telugu)