Janhvi Kapoor Movies : హిందీ సినీ లోకం… అదొక మెరుపుల కార్ఖానా అంటారు కొందరు. అంటే నిత్యం, బోలెడు మంది వస్తుంటారు, పోతుంటారు… అందులో జాన్వీ కపూర్ లాంటి కొందరు వెలిగిపోతుంటారు, అనన్య పాండే లాంటి మరికొందరు మాడిపోతుంటారు. ఏది ఏమైనా అదొక విచిత్ర ప్రపంచం… స్థూలంగా చూస్తే అది అథోప్రపంచం. వీటికి తోడు ఆ హిందీ చిత్రసీమ పై మాఫియా ప్రభావం ఒకటి. అంతేనా.. మధ్యలో బంధుప్రీతి గురించి ఏం చెప్పాలి ?, ఎంత అని చెప్పాలి ?. అసలు బాలీవుడ్ అంటేనే అనేక వివక్షలు, శ్రమ దోపిడీ, ఆర్థిక దోపిడీ.. చివరికి లైంగిక దోపిడీ కూడా. సరేసరి… ఇవన్నీ టాలీవుడ్ లో లేవా ?, లేక కోలీవుడ్ లో లేవా ?, ఎందుకు బాలీవుడ్ నే ఆడిపోసుకోవడం. ఎందుకంటే బాలీవుడ్ లో బంధుప్రీతి మరీ విచ్చలవిడిగా ఉంటుంది.
జాన్వీ కపూర్ విషయానికే వద్దాం. ఆమెలో గొప్ప నటి లేదు. జిమ్ బయట కుర్రాళ్లకు చెమటలు పట్టించడం తప్ప, ఆమె నటనతో ఆకట్టుకున్న పాపాన పోలేదు. ఇలాంటి భామ సౌత్ లో నెగ్గుకురావడం అంత వీజీ కాదు… బోణీ కపూర్ అనబడే ఒకానొక అవలక్షణమూర్తి బిడ్డ జాన్వీ కపూర్. ఎలాగూ శ్రీదేవి బ్రాండ్ నేమ్ ఉండనే ఉంది. ఇలా ఆమె పై ఎన్నో విమర్శలు వచ్చాయి. నిజానికి జాన్వీ కపూర్ కి 18, 19 ఏళ ప్రాయం నుంచే సినిమాలు… ఆమెకు వేరే లోకం ఏమీలేదు… షూటింగ్ స్పాట్లు, స్టార్ట్, యాక్షన్, కట్ అరుపులు… మేకప్పులు… ఫోటోషూట్లు… అదే ఆమె జీవితం. కానీ, చెప్పుకోతగ్గ హిట్ పడలేదు. ఇక, నార్త్ లో అమ్మడుకి క్రేజ్ కష్టమే అనుకుంటున్న సమయంలో ఆ జూనియర్ ఎన్టీవోడు ఓ అవకాశం ఇచ్చాడు. దీంతో ‘Janhvi Kapoor Movies’ అనే ట్రెండ్ అయ్యి కూర్చుంది.
ఆ ఛాన్స్ ఆమె జాతకమే మార్చింది :
సహజంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో హీరోయిన్ కు కొత్తగా వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఎందుకో దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కి క్రేజ్ బాగా పెరిగింది. పైగా దేవర నుంచి జాన్వీ కపూర్ రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఆమెను సౌత్ జనాలు బాలీవుడ్ బురదలో పుట్టిన కమలం అంటున్నారు. తెలుగులో ఎంట్రీ వరకూ తల్లి శ్రీదేవి పేరే వాడుకుంది. కానీ, ఆ తర్వాత తనే నిలబడింది… ఈరోజు బోణీ కపూర్ పేరు జస్ట్, జాన్వీ కపూర్ తండ్రిగా క్రేజ్. దటీజ్ జాన్వీ కపూర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? టాలీవుడ్ ఏ ప్రిస్టేజియస్ ప్రాజెక్టు తీసుకున్నా సరే… ఫస్ట్ చాయిస్ జాన్వీ కపూరే.
జాన్వీ కపూర్ కాదంటేనే, డేట్స్ లేవంటేనే మరొకరికి వెళ్తుంది ప్రాజెక్టు… అతిశయోక్తి కాదు… అంత పేరు సంపాదించుకుంది జాన్వీ… ఈమధ్య ఎవరో దారినబోయే దానయ్య ఏడ్చాడట… ఆమెకు రోజుకు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతోంది అని… హీరోలు అయితే అంతకు పదిరెట్లు పెడతారు పడీ పడీ కాళ్లు మొక్కుతూ… కానీ జాన్వీ కపూర్ అనేసరికి చీప్ అనుకున్నాడేమో ఫాఫం… ఆమె పేరుతో సినిమాకు వచ్చే కమర్షియల్ వాల్యూ ముందు ఈ ఖర్చులన్నీ బలాదూర్… జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ యువరాణి. ఎస్, జాన్వీ కపూర్ బయటి షూటింగుల కోసం ఎటువెళ్లినా సరే, పర్సనల్ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ స్టయిలిస్టు, ముగ్గురో నలుగురో బౌన్సర్లు, పీఏ, సెక్రెటరీ… దాదాపు పది మందిని నిర్మాత పోషించాల్సిందే. ఇలాంటివి శ్రీలీల లాంటి హీరోయిన్లకు కూడా తప్పవు కదా.
మరి జాన్వీ కపూర్ విషయంలోనే ఎందుకు ?, ఆమెను నిర్మాత భరిస్తున్నారు అంటూ వార్తలు రాస్తున్నారు. అయినా, భరించాలి… అదీ జాన్వీ కపూర్ కున్న డిమాండ్… అసలు ఇవన్నీ తెలియదా ఆమెను బుక్ చేసుకుంటున్నప్పుడు..? ఇప్పుడు జాన్వీ కపూర్ చరణ్ సినిమాలో కూడా చేస్తోంది… ఆమె షూటింగుకు వస్తోంది అంటేనే ఓ వార్త… ఇరగబడి రాసేసుకున్నారు అందరూ… కమర్షియల్ యాడ్స్‌లో జాన్వీ కపూర్ దే అత్యధిక బ్రాండ్ వాల్యూ… దటీజ్ జాన్వీ కపూర్… ఆమె ఆ అతిలోక సుందరి కుమార్తె కావచ్చు, జాన్వీ కపూర్ తళుకును శ్రీదేవికి తక్కువ చేయలేం. ఎస్, ఈ మెరుపు కొన్నాళ్లే కావచ్చు… కానీ ఆ కొన్నాళ్లే ఎంత బాగా మెరిసిందీ అనేదే ప్రధానం… ప్రస్తుతానికి జాన్వీ కపూర్… మిరుమిట్లు గొలిపే మెరుపు.
Janhvi Kapoor Movies సరే, ఆమె గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలివే :
జాన్వీ కపూర్ ఎక్కడ పెరిగింది ?,
అలాగే, జాన్వీ ఎక్కడ పుట్టింది ? అంటూ తరుచూ అభిమానులు అడుగుతూ ఉంటారు. 1997న మార్చి 6వ తేదీన జాన్వీ కపూర్ ముంబైలో జన్మించింది. ఆమె బాల్యం కూడా ముంబైలోనే గడిచింది. చెల్లి ఖుషీ కపూర్ తో కలిసి జాన్వీ కపూర్ తన స్కూలింగ్ ను ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేసింది. అనంతరం యూ.ఎస్.ఐ కి వెళ్ళి, లాస్ ఏంజిల్స్ లోని ‘లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’ నుండి థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టాను కూడా జాన్వీ కపూర్ అందుకుంది.
ఇంతకీ, జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడగలదా ?
ఒక విధంగా జాన్వీ కపూర్ మాతృభాష తెలుగే. జాన్వీ కపూర్ తల్లి, దివంగత శ్రీదేవి దక్షిణాదికి చెందినవారు అని అందరికీ తెలుసు. శ్రీదేవి మాతృభాష తెలుగు. అయితే, ఆమె కుటుంబం తమిళంలో సెటిల్ అయ్యింది. ఆ రకంగా శ్రీదేవికి తమిళం బాగా వచ్చు. పెళ్లి తర్వాత శ్రీదేవి పూర్తిగా ముంబైకే పరిమితం అయ్యింది. దీంతో జాన్వీ కపూర్ తెలుగులో సరిగ్గా మాట్లాడలేదు. ఆమెకు తెలుగు రాదు. ఇదే విషయం పై ఆమె స్పందిస్తూ.. “నా చిన్న తనంలో నేను తెలుగు నేర్చుకోలేదు. అందుకు నేను సిగ్గుపడుతున్నాను అని కూడా జాన్వీ కపూర్ చెప్పింది. ఇక దేవర సినిమాలో ఛాన్స్ వచ్చాక, జాన్వీ కపూర్ తెలుగు నేర్చుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడగలదు. ఎలాగూ Janhvi Kapoor movies అన్నీ ప్రస్తుతం తెలుగులో వస్తున్నాయి కదా.
అన్నట్టు జాన్వీ కపూర్ కి తమిళం తెలుసా ?, అవును ఆమెకు తమిళం వచ్చు. జాన్వీ కపూర్ తన చిన్నతనంలో చెన్నై (తమిళనాడు) వెళ్లినప్పుడల్లా ఆమె తమిళంలో మాట్లాడేది. శ్రీదేవే దగ్గర ఉండి జాన్వీ కపూర్ కి తమిళం నేర్పింది. అందుకే, జాన్వీ కపూర్ కి తెలుగు కంటే తమిళం బాగా తెలుసు. కానీ, సౌత్ లో మాత్రం ఆమెకు మొదట తెలుగులోనే అవకాశం వచ్చింది.
Janhvi Kapoor Movies సరే, ‘జాన్వీ కపూర్’ బాయ్ ఫ్రెండ్ ఎవరు?
జాన్వీ కపూర్, శిఖర్ పహారియా అనే తన స్నేహితుడితో ప్రేమలో పడింది. వారు కలిసి తిరుపతి వేంకటేశ్వరున్ని కూడా దర్శించుకున్నారు. దీంతో, ఆ సమయంలో ‘జాన్వీ కపూర్’ ప్రియుడు అంటూ శిఖర్ పహారియా గురించి చాలా రకాల కథనాలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని టాక్.