Devara Song :  దేవర టైటిల్ సాంగ్ 

Devara song : ‘దేవర’గా ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో తెలుసా ?,  ‘నాయకుడై నడిపించేవాడిగా… రుద్రుడై శత్రువుల గుండెలు చీల్చే వాడిగా.. సేవకుడై పేదల పాలిట పాలకుడిలా… అందరికోసం అడుగేసే గంగమ్మ తల్లి వరాల పుత్రుడిలా..’ ఎన్టీఆర్,  దేవర సినిమాలో కనిపించబోతున్నాడు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి  ‘దేవర’ సినిమా టైటిల్ సాంగ్ (devara song) కోసం ఈ లైన్లు రాశారు.  మా తెలుగునీడ్స్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం.. ఇదీ ఎన్టీఆర్ ‘దేవర’ టైటిల్ సాంగ్ గా  రాబోతుంది. ఎన్టీఆర్  సినిమా టైటిల్ సాంగ్ అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.  

దేవర సాంగ్ లో ప్రత్యేకతలు ఇవే :

అందుకే, ఎన్టీఆర్ సినిమా టైటిల్ సాంగ్ ను కంపోజ్ చేయడం ఏ సంగీత దర్శకుడికైనా పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ను అనిరుధ్ రవిచందర్ సమర్దవంతగా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. పాట ఎత్తుకోవడమే క్యాచి ట్యూన్స్ తో అనిరుధ్ ఎత్తుకున్నాడట. బేస్ గిటార్ లో థీం ట్యూన్ ప్లే చేస్తూ తర్వాత ఎన్టీఆర్ ఎలివేషన్ షాట్స్ కి  క్యాచి రిధమ్ ను టచ్ చేస్తూ..  డ్రమ్ బీట్స్ ను ఫుల్ గా వాడేశాడట.  ”దెవరో” అంటూ కిక్ ఇచ్చేలా  అనిరుధ్ అదరగొట్టేశాడని, దేవర టైటిల్ సాంగ్ లో ప్రత్యేకలు ఇవే అని టాక్.     

devara song లో రెండు కోణాలు 

రచయిత రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం కూడా చక్కగా కుదిరింది. ”’నాయకుడై నడిపించేవాడిగా… రుద్రుడై శత్రువుల గుండెలు చీల్చే వాడిగా.. ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేస్తూ.. మళ్లీ ఇదే పాటలో.. సేవకుడై పేదల పాలిట పాలకుడిలా… అందరికోసం అడుగేసే గంగమ్మ తల్లి వరాల పుత్రుడిలా.. అంటూ ఎన్టీఆర్ పాత్రలోని మంచి తనాన్ని మరియు జన్యున్ ఎమోషన్స్ ను చాలా బాగా పరిచయం చేశారు. మొత్తానికి దేవర సాంగ్ లో రెండు కోణాలను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ  దేవర టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ ను ఖుషి చేయబోతుంది.  
 

మే 20న  devara song రిలీజ్ :   

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా  మే 20న  devara song రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ కూడా ప్రత్యేకంగా ఉంటాయట.  ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్  ‘నాటు నాటు…’ పాటకు ప్రపంచమంతా స్టెప్పులు వేసింది. ఏకంగా తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును ఎన్టీఆర్ డ్యాన్స్  తీసుకు వచ్చింది. మరి ఇప్పుడు దేవర సాంగ్ తో ఎన్టీఆర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.    

 

అక్టోబర్ 10న  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి జాతరే :  

 
అక్టోబర్ 10న ‘దేవర’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.  కాబట్టి, ఆ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి జాతరే. పైగా ఎన్టీఆర్, కొరటాల శివ  కాంబోలో వస్తోన్న రెండో సినిమా ఇది. దీనికితోడు, ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ దేవర చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. అందుకే,  పాన్ ఇండియా సినిమాల్లోనే  క్రేజీ సినిమాగా దేవర రాబోతుంది.  
 
 

Leave a Comment