అంతెందుకు ?, ఆ శబ్దం విన్న ప్రతి ఒక్కరూ తమ మాటలు, చేతలు ఆపేసి ఒక్కసారిగా తలను శబ్దం వచ్చిన వైపు తిప్పుతారు. ఆ శబ్దం వచ్చిన ప్రదేశం వైపు కళ్లు విప్పి చూస్తారు. కొందరైతే వెనువెంటనే తమ జేబులు తడిమి చూసుకుంటారు. తమ జేబులో చిల్లర నాణేలు లేవని తెలిసినవారు కూడా జేబులు తడుముకుంటారు. ఆ నాణెం ఎటువైపు దొర్లుకుంటూ వెళ్లిందో అటువైపు చూపు సారిస్తారు. ఆ నాణెం ఒకవేళ తమ దగ్గరిలో బల్లకిందికి చేరివుంటే వంగి చూస్తారు కొందరు. ఎవరూ చూడటం లేదు అనుకుంటే.. వంగి తీసుకుంటారు. అంతకు ముందు నడుము నొప్పితో, నడుము పట్టేసినవారు కూడా ఆ బాధను పట్టించుకోక నాణెం కోసం ఎంత కిందికైనా వంగుతారు. ఇది వాస్తవం. కావాలంటే మళ్లీ పరీక్షించి చూడండి. మరి అలాంటప్పుడు Dabbu Sampadinchadam Ela ? అని అడిగేవారు ఎక్కువ కాకుండా ఎలా ఉంటారు ?!!. అందుకే, ఇప్పుడు ప్రపంచమంతా Dabbu మయమే.
Dabbulu kavali.. చివరకి ఆ దేవుడికి కూడా :
కలియుగ దైవం ఆ తిరుమలేశ్వరుడికి కూడా అప్పుల బాధ తప్పలేదు. ఈ కలియుగంలో ఆయనకూ డబ్బు కావాల్సి వచ్చింది. నిజానికి భగవంతుడ్ని కూడా ప్రత్యక్షంగానే పరోక్షంగానే డబ్బు కోసమే పూజిస్తారు. భగవంతుడు కూడా తాను సృష్టించిన జీవులన్నీ సర్వసంపదలను సర్వ కాలాల్లో అనుభవించాలనే అంటాడు. అయితే, కొందరిలో ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. వారికీ ఆనందం, సంపదలు రెండూ అందినట్టే అంది అందనంత దూరానికి వెళ్లిపోతుంటాయి. దీనికి ప్రధాన కారణం వారే. వారి ఆలోచన విధానమే. ఆలోచనలను మార్చుకుంటూ తమను తాము ముందుకు నడిపించుకుంటూ వెళ్తే.. డబ్బును కచ్చితంగా ఆదా చేయవచ్చు. మీరే ఆలోచించండి.
కాలుతున్న దూదిని నోటితో తినమని అడిగితే ఎవరైనా సరే వింతగా చూస్తారు. నోరు కాలిపోతుంది. అలా తినటం సాధ్యం కాదని తేల్చి చెబుతారు. కానీ, మండే దూదిని ఎవరైనా నోట్లో వేసుకుని, మింగడం చూసినప్పుడు “అతను చేసినప్పుడు నేనెందుకు చెయ్యలేను” అని ఆలోచిస్తారు. అంటే, మనిషి ఆలోచనలో కొంత మార్పు వచ్చింది. అసాధ్యం అనే దశ నుంచి చేయగలమేమో అనే దశకు వచ్చింది. అయితే అప్పటికి సాధ్యం అనేది మనసులో మాత్రమే వుంది. అది వాస్తవం కావాలంటే నిజంగానే ఆ మండుతున్న దూదిని తినాలి. మరి ఇప్పుడు ఆ తినే ప్రక్రియను నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఒకసారి చేసి చూడాలి. అంటే ఆలోచనా స్థాయి నుండి అనుభవ స్థాయికి రావాలి.
కానీ, ఆ పని చేసేటప్పుడు మనసులో వున్న భయాందోళనల స్థాయిని బట్టి ఆ పని విజయం లేదా వైఫల్యముంటుంది. భయం అధికమైతే ఆ పని అసాధ్యమవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మండుతున్న దూదిని తినగలిగితే ఎంతో విజయం సాధించినట్లు పొంగిపోతారు. మీ భయాలమీద మీరు విజయం సాధించినట్టు. స్వానుభవంతో నాటి వరకు మనసులో వున్న అసాధ్యమనే దాన్ని శాశ్వతంగా తొలగించుకోగలిగారు. ఇది లక్ష్యమందుకునే దశ. ఏ విషయమైనా కేవలం తెలుసుకున్నందువల్ల లాభం లేదు. దానిని ప్రయత్నించాలి… సాధించాలి. ఆ దశకు రానంతవరకు మీకు కొన్ని విషయాలు తెలిసిన స్థితిలోనే వుంటారు. అయితే, అసలు లాభాలన్నీ తెలిసినవాటిని అనుభవపూర్వకంగా ప్రయోగించి నప్పుడే వస్తాయి. మండుతున్న దూదిని తినటం వంటిదే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టటమైనా, డబ్బుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవటం అయినా.
ఇంతకీ, Dabbu sampadinchadam ela ? ఇది గుర్తు పెట్టుకోండి.
ఈ లోకంలో డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. అసలు బిజినెస్ అంటే ఏమిటి ?, వస్తువు విలువకి ఉన్న రేటు కంటే, ఎక్కువ రేటు చెప్పి అమ్ముకోవడమే కదా. ఇది ఎవరు ఎంత బాగా చేస్తారో వారే అంబానీలు.వారెన్ బఫెట్ లాంటి ఆర్థిక వేత్తల మాటలను బట్టి ఆలోచిస్తే.. డబ్బు సంపాదించడానికి కొన్ని దశలు దాటుతూ ముందుకు వెళ్లాలి. ఈ క్రమంలో తొలిదశ ‘అసాధ్యం’ నుండి మానసికంగా ‘సాధ్యమనే’ రెండవ దశకు, ఆ తర్వాత భయం భయంగా చేసే తొలి ప్రయత్నం మూడవ దశ అవుతుంది. చిట్ట చివరిదశ సాధించే దశ. అందుకే అంటారు.. విజయం సాధించలేక పోవడానికి కారణం సాహసం చేయలేకపోవటం.
కాబట్టి సరైన మార్గంలో అడుగులు వేయండి. ఒకవైపు విఫలమైనా అద్భుత అనుభవం మిగులుతుంది. పొరపాట్లు తెలుస్తాయి. అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలకు విలువ అత్యధికం. కాబట్టి ముందుగా మీ మానసిక స్థితిని మార్చుకోండి. నిర్ణయాలు తీసుకోగలిగిన దిశగా ఆలోచనలు మార్చుకోండి. ధైర్యసాహసాలు లేకుండా ఏ పనీ సాధించలేరు. డబ్బు విషయంలో కూడా ధైర్యం, సాహసం అవసరం. అందుకే మీ మనసులో స్థిరంగా అనుకోండి…“కేవలం తెలుసుకోవటంతో సాధించేది లేదు – సాధనతో మాత్రమే సాధ్యం”. ఇది డబ్బు సంపాదనలోనూ వర్తిస్తోంది. అన్నట్టు Dabbu sampadinchadam ela ? ఈ ప్రశ్నకు సంబంధించి మరో కంటిన్యుయేషన్ ఆర్టికల్ కూడా ఉంది, చూడండి.
ఈ డబ్బు కేటగిరీ ద్వారా ఎందరో మహోన్నతమైన ఆర్థికవేత్తలు చెప్పిన గొప్ప డబ్బు సూత్రాలను మీకు అర్ధమయ్యేలా అందించే ప్రయత్నమే మా ‘తెలుగునీడ్స్.కామ్’ ముఖ్య ఉద్దేశ్యం. మరి మీకు ఉపయోగ పడే ఈ కథనాల కోసం తెలుగు నీడ్స్.కామ్ ను విజిట్ చేస్తూనే ఉండండి.