‘Husband Neglecting Wife Quotes in Telugu’.. ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు భార్య పాత్ర గురించి నాలుగు ముచ్చట్లు. నిజంగా ఏ సంబంధం లేకున్నా.. కేవలం తాళి కట్టించుకున్నందుకే తన జీవితాన్నే త్యాగం చేస్తోంది భార్య. భర్తతో రక్తసంబంధం లేకున్నా కేవలం ప్రేమ బంధంతో అక్కున చేర్చుకునేదే భార్య. అంతేనా ?, తన ఇంటి పేరును విడిచి భర్త ఇంటి పేరును మోసి పరువు, ప్రతిష్టలను కాపాడుతుంది. భర్త కష్ట సుఖాలను పంచుకుంటుంది. అందుకే, ఇంటికి దీపం ఇల్లాలు అంటారే కానీ, భర్తే దీపం అని ఎవరూ అనరు. ఎందుకో తెలుసా ?.. భార్య, తన ప్రేమనే నూనెగా చేసి, వాత్సల్యాన్ని ఒత్తిగా చేసి ఇంటికి వెలుగునిస్తుంది, భర్తకు తోడుగా నిలుస్తోంది. దురదృష్టవశాత్తు భర్త చనిపోతే తాను చీకట్లోకి వెళ్ళిపోతుంది. భర్త జ్ఞాపకాలతోనే శేష జీవితాన్ని గడిపేస్తుంది. అదే భర్త విషయంలో ఏడాదిలోపే మరో స్త్రీని పెళ్లాడతాడు. నిజంగా అర్ధాంగి మగాడికి దీపం. మరి అలాంటి అర్ధాంగి గౌరవమర్యాదలను దేని కోసం బలి చేయొద్దు.
జన్మ జన్మల బంధంతో ఏడడుగులు నడిచి, మూడు ముళ్లు వేయించుకొని పచ్చని సంసారంలో అర్దాంగి అయి మమతల కోవెలలో దేవత అవుతుంది. ఆ అర్ధాంగిని కంటి పాపలా చూసుకోవాలి. కుటుంబం కోసం త్యాగం చేసే మహిళా మణులకు విలువ నివ్వాల్సిందే. కొందరు నెటిజన్లు ఇదే విషయాన్ని షేర్ చేయడానికి ‘Husband Neglecting Wife Quotes in Telugu’ అని గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. వారి కోసం భార్య గొప్పతనానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన కొటేషన్స్, అండ్ ఎమోషనల్ కోట్స్.
1. “ఒక భర్త అనుమానంతో తనలో తాను యుద్ధం చేసినప్పుడు, అతని భార్య ఆ యుద్ధం యొక్క బీభత్సాన్ని అనుభవించాల్సి వస్తుంది.”
2. నేను మీలో ఏ తప్పొప్పులు చూడకుండా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాను. అందుకేనేమో.. మీరు, నా తప్పు లేకపోయినా నన్ను ఎక్కువగా బాధ పెట్టగలిగారు.
3. “ఓ భార్య అదేదన ఇలా ఉంది. నా జీవితం ఎప్పుడో ఆగిపోయింది. నేను ఇప్పుడు జీవించడం లేదు. నేను వేచి ఉన్నాను. కానీ, దేని కోసం ఎదురు చూస్తున్నానో నాకే తెలియదు.
4. “దాంపత్య జీవితంలో అతి బాధాకరమైన విషయం ద్వేషం కాదు, నిర్లక్ష్యం.”
5. “ప్రేమించే మీ భార్యను దూరం చేసుకుంటున్నారా ?, ఐతే, చేతిలోని వజ్రాన్ని నదిలోకి విసిరినట్లే.
6. “రిలేషన్ లో మీ పార్ట్నర్ ను నిర్లక్ష్యం చేయడం అంటే.. ఒక విధంగా అది దుర్వినియోగం కంటే ఘోరం.
7. “ప్రపంచంలో అత్యంత నీచమైన అనుభూతి ఏమిటో తెలుసా ?, మీరు ఇష్టపడే మీ భర్త ద్వారే మీరూ బాధింపబడటం.
8. “నమ్మకం ఉన్నచోట ప్రేమ పెరుగుతుంది, నిజమే. కానీ, అదే నమ్మకం ద్రోహానికి గురైన చోట ఆ ప్రేమ చనిపోతుంది.” Husband Neglecting Wife Quotes in Telugu
9. “ఎవరైనా మీకు ద్రోహం చేసినప్పుడు, అది వారి కర్మగానే ఉండాలి, ఆ కర్మ ఎప్పటికీ మీది కాకూడదు. అలా మీకు మీరే మారాలి.
10. ఒక చెడ్డ భర్త, చెడ్డ భార్య కంటే చాలా చెడ్డవాడు. ఎందుకంటే.. మైనస్ – మైనస్ ఎప్పటికీ మైనసే.
11. మీ భాగస్వామికి అబద్ధం చెప్పడం, మీ భాగస్వామిని మోసం చేయడం, మీ భాగస్వామిని అగౌరవపరచడం వీటి కంటే.. మీరు ఒంటరిగా ఉండటమే చాలా మంచిది.
12. “పెళ్లిలో పెద్ద సమస్య ఏమిటంటే, ఆయన ఆమెను బాధపెట్టాడని ఆయన ఎప్పటికీ అనుకోరు. ఆమె ఆయన్ని ఇబ్బంది పెట్టిందని ఆమె ఎప్పటికీ అనుకోదు.
13. “నిన్న మీకు చాలా ప్రేమను పంచిన వ్యక్తి, ఈ రోజు మిమ్మల్ని చాలా ద్వేషిస్తున్నారు అంటే.. అది కచ్చితంగా మీ తప్పే.
14. “డబ్బు ద్వారా ఎన్నో పొందవచ్చు. కానీ నిజమైన ప్రేమ గొప్ప దాంపత్య జీవితంలోనే పొందగలం – Husband Neglecting Wife Quotes in Telugu.
15. భార్యాభర్తల మధ్య రెండు రహస్యాలు ఉండొచ్చు. కాకపోతే, అందులో ఒకటి బంధాన్ని రక్షించడానికి ఉపయోగపడాలి, మరొకటి ప్రేమను పెంచడానికి ఉపయోగపడాలి.
16. “ఒక భర్త తన భార్య దగ్గర యజమానిలా ఉండొచ్చు. కానీ, అవసరం ఐతే ఆమెకు అతను పని మనిషిగా కూడా మారగలగాలి.
17. “ప్రతి హృదయానికి నొప్పి ఉంటుంది. కానీ, భార్యలు దానిని కళ్ళలో దాచుకుంటే.. భర్తలు తమ చిరునవ్వులో దాచుకుంటారు.