డిప్రెషన్ లో ఉన్నారా ? బెస్ట్ సొల్యూషన్ ఇదే

డిప్రెషన్ లక్షణాలు : మానసిక స్థితికి మూలం మన ఆలోచనలు, మన భావోద్వేగాలే కారణమనుకుంటాం. వాస్తవానికి అసలు మూలం మనం తీసుకునే ఆహారమే. దృఢమైన శరీరంలోనే ధృడమైన మనస్సు ఉంటుందనే ఒక సాధారణ నానుడి.  ఈ విషయం మరింత లోతుగా, స్పష్టంగా అన్నింటినీ మించి శాస్త్రీయమైన ఆధారాలతో ఇప్పటికే నిరూపించబడింది కూడా.  ఆహారంలో ఉండే ఫాట్స్, ఆలివ్ నూనె లాంటి  మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్  సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ హార్మోన్ ఉత్పత్తి చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. నాడీ కణాలను, మెదడులోని రిసెప్టార్స్ మధ్య బంధాన్ని కుదుర్చడంలో సెరటోనిన్ హార్మోన్ బాగా తోడ్పడుతుంది.

అంతే కాదు మూడ్ ను, కోపాన్ని, ఉద్రేకాన్ని, చివరికి ఆకలిని క్రమబద్ధం చేయడంలో సెరటోనిన్ బాగా తోడ్పడుతుంది. సెరటోనిన్ హార్మోన్ కొన్నిసార్లు మెలటోనిన్ మారుతుంది. ఇది మంచి నిద్ర రావడానికి దోహదం చేస్తుంది. మంచి యాంటీ డిప్రెసెంట్ కూడా బాగా పనిచేస్తుంది.

 

డిప్రెషన్ లక్షణాలు సరే, డిప్రెషన్ తగ్గాలంటే ఏం చేయాలి ?

డిప్రెషన్ తో ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి చూద్దాం రండి. నరాల లోపలి పొర కొవ్వు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. అందువల్ల మనం తీసుకునే కొవ్వు పదార్థాల నాణ్యత కచ్చితంగా ఆ నరాల పొరను దృఢపరుస్తుంది.  విటమిన్ బి6, ఫోలేట్, కూరగాయలు, పండ్లు, నట్స్, చిక్కుడు ధాన్యాలు వంటివి ఎక్కువగా తినాలి. ఇవి ఆరోగ్యవంతమైన సెరటోనిన్ ను పెంచుతాయి.  అలాగే, పాల ఉత్పత్తులు, మాంసం, అరటి పండ్లు, ఓట్లు, వీటిలో ఉండే కొవ్వు పదార్థాల్లో దొరికే పోషకాలు ట్రిప్టోఫాన్స్ గా మారతాయి. ఆ తర్వాత అవే సెరటోనిన్ గా రూపాంతరం చెందుతాయి. కాబట్టి, పై లిస్ట్ లో పేర్కొన్న ఆహారాన్ని తింటే  మీరు డిప్రెషన్  నుండి బయట పడే అవకాశం ఉంది.

మీలో డిప్రెషన్ లక్షణాలు మరియు నిరాశా నిస్పృహల పాళ్లెంత?

ముందుగా మీరు మీ డిప్రెషన్  ఏ స్టేజ్ లో ఉందో తెలుకోవాలి. మనిషి అన్నాక  అప్పుడప్పుడూ మానసికంగా కుంగిపోవడం, నిరాశా నిస్పృహలు ఆవరించడం సహజం. కానీ, అదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే నలుగురిలో కలవలేక ఏకాకిగా మారిపోతాం. ఈ పరిస్థితి ఉంటే  మీలో డిప్రెషన్ లక్షణాలు ఉన్నట్లే.

మీలో నిరాశా స్థాయి తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది ప్రశ్నలకు అవును లేదా కాదు అని సమాధానాలు ఇవ్వండి.

1. రాత్రి నిద్రకు ముందు  మీరూ.. ఆ రోజు జరిగిన సంతోషకరమైన సంఘటనలకు బదులుగా  బాధించిన అంశాలను పదే పదే గుర్తు చేసుకుంటూ  ఉంటారు ?,

2. మిమ్మల్ని ఎవరైనా ప్రశంసిస్తే ముఖస్తుతి కోసం చెప్పినట్టు భావిస్తారు.

3. ఒకప్పుడు మీరు ఇష్టంగా చేసిన పనులన్నిటి మీద క్రమంగా ఆసక్తి కోల్పోయారు ?

4.  మీకు ఆకలి, నిద్ర కరువయ్యాయి?

5. మీరు మనస్ఫూర్తిగా నవ్వడం మానేసి చాలా కాలమైంది?

6. ప్రతి చిన్న విషయానికి మీకు ఏడుపు తన్నుకొస్తోంది?

7. నిద్ర లేవగానే ‘హమ్మయ్య… ఒక రోజు గడిచింది’ అని నిట్టూరుస్తున్నారు ?

8. ఒంటరిగా గడపటానికే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ?

9. మీకు మతిమరుపు పెరిగింది?

10. మీరు జీవితం మీద ఆసక్తి కోల్పోయారు?

రిజల్ట్ : పై ప్రశ్నల్లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం  అవును అయితే  మీరు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారని అర్థం. ఆ స్థితి తాత్కాలికమే అయితే ఫర్వాలేదు. కానీ ఎక్కువ కాలం కొనసాగితే తప్పక మానసిక వైద్యుల్ని సంప్రదించాలి.

 

ఇలా చేయండి, డిప్రెషన్ లక్షణాలు  ఇక మీ దరిచేరవు :

డిప్రెషన్ తో  బాధపడే వారికి ఆత్మీయుల అండ చాలా ముఖ్యం. వారిలో మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు హోమియో వైద్యం ఇప్పించడం ద్వారా వారు సాధారణ జీవితం గడిపేలా చేయవచ్చని అంటున్నారు డాక్టర్ సురేష్ వర్మ.

డిప్రెషన్ లక్షణాల గురించి డాక్టర్ సురేష్ వర్మ ఇంకా మాట్లాడుతూ..  బాధగా ఉండటం, ఆత్మన్యూనతకు లోనుకావడం, నిరాశ, నిస్పృహలతో రోజులు గడపడం, జీవితంపై నిరాసక్తత, చేసే పనులపై ఆసక్తి లేకపోవడం, ఒంటరిగా గడపాలని అనిపించడం… ఇలాంటి లక్షణాలున్న అట్లయితే డిప్రెషన్ లో ఉన్నారని గుర్తించాలి. డిప్రెషన్ పురుషుల్లో కన్నా స్త్రీలలో ఎక్కువ చూస్తుంటాం.

 

డిప్రెషన్ తగ్గాలంటే ఏం చేయాలి ? బెస్ట్ టిప్స్ ఏమిటి ? ఈ ఇమేజ్ సూచిస్తోంది.  - Telugu Needs
డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి

 

డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి ?

డిప్రెషన్ లో ఉన్న వారి మనసులో ఎప్పుడూ ఆందోళన ఉంటుంది.  జీవితంపై నిరాసక్తత  ఉంటుంది. కోపం, బాధ, చిరాకు,  చేసే పని పై ఆసక్తి లేకపోవడం,  జీవితం అగమ్యగోచరంగా ఉండటం, శరీరంలో శక్తి లేనట్లుగా ఉండటం,  ఆకలి లేకపోవడం, లేదంటే విపరీతంగా ఆకలేయడం, ఏకాగ్రత లోపించడం, మతిమరుపు, నిద్రపట్టకపోవడం, శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం,  ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం ఇలా డిప్రెషన్ కి చాలా లక్షణాలు ఉన్నాయి.

 

డిప్రెషన్ కి కారణాలు ఏమిటి ?

దీర్ఘకాలంగా ఆందోళన, గాబరాగా ఉండటం ఓసీడీ తో బాధపడే వారిలోనూ డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే, దీర్ఘకాలంగా ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకునే వారు కూడా డిప్రెషన్ కి  లోనుకావచ్చు.

పౌష్టికాహార లోపం, విటమిన్ బి12 లోపం కూడా డిప్రెషన్ కి ఒక కారణమే. మరి  డిప్రెషన్ పోవాలంటే ఏం చేయాలి ? డాక్టర్ ను సంప్రదించాలి. అలాగే, మేం పై లిస్ట్ లోని ఫుడ్ ను రెగ్యులర్ గా తీసుకున్నా మీరు డిప్రెషన్  నుండి బయట పడొచ్చు.

డిప్రెషన్ గురించి మరిన్ని విషయాలు ?

ఒకవేళ డిప్రెషన్ ఎక్కువగా ఉంటే  పిచ్చికి దారితీస్తుందా?

డిప్రెషన్ ఫైనల్ స్టేజ్ దాటితే  పిచ్చికి దారి తీసే అవకాశం ఉంది. తీవ్రమైన డిప్రెషన్‌ను ఉన్నవారిలో  కొందరు వ్యక్తులకు పిచ్చి పట్టిన సందర్భాలు ఉన్నాయి. సహజంగా డిప్రెషన్ లో ఉన్నవారికి భ్రాంతితో కూడిన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పైగా సైకోసిస్ లక్షణాలు కూడా వారిలో ఎక్కువ. కాబట్టి, డిప్రెషన్ ఫైనల్ స్టేజ్ దాటితే  పిచ్చి పట్టే అవకాశం ఉంది.

డిప్రెషన్ మీనింగ్ ఇన్ తెలుగు ?

తెలుగులో డిప్రెషన్ కి చాలా అర్ధాలు ఉన్నాయి. కానీ సింపుల్ గా చెప్పుకోవాలంటే.. డిప్రెష‌న్ అనేది ఒక మాన‌సిక రుగ్మ‌త‌. దీన్నే కుంగుబాటు అని కూడా పిలుస్తూ ఉంటారు.

 

డిప్రెషన్ పై కొన్ని కోటేషన్స్ : 

  • విరిగిన మీ మనసు ముక్కలతో   మీ శాంతిని నిర్మించుకోండి
  • డిప్రెషన్ అనేది కలర్ బ్లైండ్. ప్రపంచం ఎంత రంగులమయంగా ఉందో  నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది.
  • నిరాశ, బాధ, కోపం ఇవన్నీ.. డిప్రెషన్ కి పునాదులు.
  • డిప్రెషన్ తో మీ ప్రతిభ పోదు. కానీ, మీ ప్రతిభను బయటకు రాకుండా డిప్రెషన్ అణచివేస్తోంది

Leave a Comment