బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ : వీటితో రెట్టింపు అందం     

బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్  : సాధారణంగా చేతులు అందంగా నాజూకుగా వున్నా, మోచేతులు మాత్రం గరుకుగా, చర్మం బిగదీసినట్లు వుంటాయి. కొంతమందిలో నల్లగా మొద్దుబారి పోయి వుంటాయి. చంద్రుడిలో మచ్చలా  ఈ మోచేతి నలుపు   మొత్తం చేతి అందానికి మచ్చ తెచ్చినట్లుగా కనిపిస్తోంది. మరి మీ మోచేతుల అందం పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా ?,  మోచేయి గరుకుగా వుంటే ప్యూమిక్ స్టోన్ గానీ బొడిపెలు ముదురుగా ఉన్న కాకరకాయను వెన్నలో అద్ది సున్నితంగా మర్దన చేసుకోవాలి.  మర్దన చేయగానే తగు వేడినీళ్ళలో మెత్తని ‘గాజ్’ బట్టను ముంచి రెండు ముడతలు గా చేసి మోచేతిని 2,3 నిమిషాలపాటు వుంచాలి. అనంతరం మెత్తని శనగ, సున్నిపిండితో కడగాలి.  

ఆ తర్వాత నిమ్మరసంలో విటమిన్ ‘ఇ’ ఆయిల్ 4, 5 చుక్కలు వేసి దూదిలో ముంచి మోచేతులకు మృదువుగా రాయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే  మోచేతి నలుపు పూర్తిగా తగ్గి గరుకుతనం పోయి సున్నితంగా చేతుల్లా  సహజ రంగును సంతరించుకుంటాయి. మోచేతికి సంబంధించిన బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో ఇది బెస్ట్.

 

మరి చేతులు నునుపుగా తేలి నాజూగ్గా కనిపించాలంటే ?

చాలామందికి జన్మతః కానీ హార్మోన్ల  లోపం వల్ల కానీ రోమాలు అసంఖ్యాకంగా పెరిగి మోటు గాను, అసహ్యంగానూ  కనిపిస్తాయి. ఐతే, వారి మొహం తెల్లగా అందంగా వున్నా.. చేతుల మాత్రం పై విధంగా ఉంటాయి. మరి చేతులు నునుపుగా, తెల్లగా కనిపించాలంటే ఏం పాటించాలి.

1. రోమాలను కుదుళ్ళతో సహా వాక్సింగ్ పద్ధతిలో తీసివేయాలి.

2. రెండవపద్ధతిలో 4 చెంచాల పాల పొడిలో గ్లిజరిన్ 1 స్పూన్ కలిపి పేస్టు లాగా చేసి  చేతులకు కింది నుంచి పైకి పట్టించి (అంటే చేతివేళ్లను మొదలుకుని భుజంపై భాగం వరకు) అరగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి.

3. ఓట్మీల్ 1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం లేదా నారింజరసం 1 టేబుల్ స్పూన్  ఇవన్నీ పేస్టులా కలిపి చేతులకు పట్టించి 15, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

 

బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ : కోమలమైన చేతుల కోసం

‘హ్యాండ్ ప్యాక్స్’

మనం ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత చేతులకివ్వం. ఎదుటివారి చూపులు మన ముఖంతో పాటు ఎక్కువగా కదిలేది మన చేతుల మీదకే.  కాబట్టి చేతుల అందం, ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉండాలి. ఇందుకోసం చేతులకు ప్యాక్స్ అప్లై చేస్తూ ఉండాలి. ఇంట్లో తయారుచేసుకునే వీలుండే ‘హ్యాండ్ ప్యాక్స్’ చేతులకు ఆప్లై చేయండి.


బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో ఎగ్ క్రీమ్ ప్యాక్ మొదటిది :  

గిన్నెలో ఒక గుడ్డు తెల్ల సొన తీసుకుని రెండు టీ స్పూన్ల బార్లీ పొడి, రెండు టీ స్పూన్ల గ్లిజరిన్ కలపాలి. దీనికి రెండున్నర టీ స్పూన్ల తేనెను కూడా చేర్చి రోజ్ వాటర్ కలుపుతూ చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని చేతులకు అప్లై చేసి ఆరాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చేతులు మృదువుగా తయారవుతాయి. అందుకే, ఇది బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో  ఫస్ట్ ప్లేస్ లో ఉంది.  

బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో గ్లిజరిన్ ప్యాక్ రెండోది :

ఒక టీస్పూన్ గ్లిజరిన్ కు  అర టీ స్పూన్ నిమ్మరసం చేర్చి బాగా కలిపి చేతులకు అప్లై చేయాలి. పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా రోజూ క్రమం తప్పక చేస్తే రోజువారీ పనులతో గరుకుగా తయారైన చేతులు సుతి మెత్తగా తయారవుతాయి.

మూడో ప్లేస్ లో  ఓట్ మీల్ ప్యాక్ : 

గుడ్డును బాగా బీట్ చేసి రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, ఒక టేబుల్ స్పూన్  తేనె కలిపి చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని చేతులకు పూసుకుని వేళ్లతో మసాజ్ చేసి ఆరాక  కడిగేసుకుంటే మృత కణాలు తొలిగి చేతులు మెరుపును సంతరించుకుంటాయి. అందుకే, ఇది బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో మూడో  ప్లేస్ లో ఉంది.  

బాదం, పాలతో ప్యాక్ : 

బాదం పప్పును మెత్తగా నలగ్గొట్టి పాలలో కలిపి మరిగించాలి. తర్వాత గుడ్డులోని పచ్చసొన పాలలో వేసి కలపాలి. మంట తీసి పూర్తిగా చల్లారాక అర టీ స్పూన్ బాదం నూనె చేర్చి పేస్ట్ గా తయారయ్యాక చేతులకు రాయాలి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు చేతులకు ఈ పేస్ట్ అప్లై చేసి తెల్లారాక కడిగేసుకోవచ్చు. ఇలా క్రమం తప్పక చేస్తే చేతుల మీద ఏర్పడే ముడతలు తొలగిపోతాయి.  

బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో నెక్స్ట్ ప్లేస్ లో  క్యారెట్ ప్యాక్

ఒక టీ స్పూన్ క్యారెట్ జ్యూస్ కు రెండు టీ స్పూన్ల తేనె కలిపి ఈ మిశ్రమంతో చేతులు మసాజ్ చేయాలి. తర్వాత క్యారెట్ గుజ్జును చేతులకు అప్లై చేసి ఆరాక కడిగేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే ఎండ వల్ల నల్లబడిన చేతులు తెల్లబడతాయి.

 

ముల్తానీ మట్టి ప్యాక్

4 టీ స్పూన్ల ముల్తాని మట్టికి ఒక గుడ్డు, అర టీ స్పూన్ గంధం నూనె, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గ్లిజరిన్ చేర్చి పేస్ట్ లా తయారుచేయాలి. దీన్ని చేతులకు పట్టించి ఆరాక కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ తో వదులుగా తయారైన చేతుల చర్మం బిగుతుగా మారుతుంది. బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో దీనికి కూడా మంచి గుర్తింపు ఉంది.

 

బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో గోళ్ళ సంరక్షణ ముఖ్యమే.    

గోళ్ళ సంరక్షణ అనేది  చేతుల అందంతో పాటు గోళ్ళను కూడా అందంగా తీర్చిదిద్దుతాయి.  మనం ఆధునిక యువతులలో తరుచు చూస్తూనే వుంటాం. చేతులు, మోచేతులు ఎంత అందంగా ఉన్నా..  పుచ్చుగోళ్ళు, విరిగిన గోళ్ళు తామర తూళ్ళలాంటి వేళ్ళ  వారి అందాల్ని కొంత వరకు చెడగొడుతాయనడంలో సందేహంలేదు. చేతులతోబాటు గోళ్ళు కూడా అందంగా ఉంటే మరి ఇంకెంత బాగుంటుంది కదూ!

 

మరి గోళ్ళను అందంగా పెంచే విధానాలు.


1. ముందుగా అన్ని గోళ్ళను నెయిల్ కట్టర్ తో కత్తిరించి తీసివేయాలి.
2. గోళ్ళను కొంతపొడవు వరకు పెంచి వంపుగా మంచి ఆకారం వచ్చేటట్లుగా కత్తిరించి, ఫైలర్తో గోరుచివర్లు రుద్ది నునుపుగాచేసి గోళ్ళరంగు వేయాలి. 

3. గోళ్ళు అందంగా పెరగాలంటే తాజా ఆకుకూరలు, సమతులాహారం తీసుకోవాలి.  ప్రతి రోజూ గ్రుడ్డు తినాలి. 

4. గోళ్ళు ఆరోగ్యంగా పెరగాలంటే ఒక కప్పు టమాటా జ్యూస్ లేదా క్యారెట్ జ్యూస్ కొద్దిగా జిలాటిన్ కలిపి తాగాలి.  బెస్ట్ హ్యాండ్ ప్యాక్స్ లో భాగంగా ఇది బాగా పని చేస్తోంది.

Leave a Comment