క్యాన్సర్ కి టాప్ 5 ఫుడ్స్ 

క్యాన్సర్ కి టాప్ 5 ఫుడ్స్ :  క్యాన్సర్ కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎక్కువ అయిపోతున్నాయి. క్యాన్సర్ పై సరైన అవగాహన కలిగిస్తే.. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది జీవితాలు సేఫ్ అవకాశం ఉంది. చాలా మంది క్యాన్సర్ బారిన పడి కోలుకుని కూడా  ఆ తర్వాత అశ్రద్ద చేస్తుంటారు.  క్యాన్సర్ కు చికిత్స తీసుకుని, దాన్నుంచి బయట పడ్డాక చాలామందిని వేధించే ప్రశ్న ‘జబ్బు తిరగబెడుతోందా? ‘ అనే.  నిజానికి క్యాన్సర్ నుంచి బయటపడ్డాక ఊబకాయం లేదా అధిక బరువు, గుండె సమస్యలు, ఎముకలు సన్నబడటం లేదా విరగటం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం, మధుమేహం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

అయితే చికిత్స తీసుకుంటున్నప్పుడు, ఆ తర్వాత మంచి జీవనశైలిని పాటిస్తే రెండోసారి క్యాన్సర్ బారిన పడకుండా చూసుకో వచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 

ఇంతకీ క్యాన్సర్ కి టాప్ 5 ఫుడ్స్ ఏమిటో చూద్దాం రండి.

  • తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.. ముఖ్యంగా వివిధ రంగుల పదార్థాలు
    ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నివారణకు తోడ్పడుతాయి. అలాగే కొవ్వు పదార్థాలు తగ్గించాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో మంచిది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించటంతో పాటు ఆత్మ విశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని పెంపొందిస్తుంది.  బరువు అదుపులో ఉండటానికి, గుండె ఆరోగ్యం మెరుగు పడటానికి, కండరాలు, ఎముకలు బలోపేతం కావడానికి తోడ్పడుతుంది.
  • పొగ తాగే అలవాటుంటే పూర్తిగా మానేయాలి. గుట్కాలు, జర్దాల వంటి పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి. అలాగే మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఇప్పటికే మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి.
  • మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతాన్ని వినడం, పుస్తకాలు చదవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోకుండా వీలైనప్పుడల్లా నలుగురితో కలివిడిగా గడపటం మంచిది. దీంతో మానసిక ఉల్లాసం, ఆనందం కలుగుతాయి.

 

క్యాన్సర్ కి టాప్ 5 ఫుడ్స్ లో మరో అద్భుతమైన ఫుడ్ :

అదే హనుమాన్ ఫలం. నిజంగానే క్యాన్సర్ నివారిణి.. హనుమాన్ ఫలం ఓ వరం. ప్రాణాంతకంగా మారుతున్న క్యాన్సర్ వ్యాధిని హనుమాన్ ఫలం (ముళ్ల రాంఫలం) ద్వారా సంపూర్ణంగా నిరోధించవచ్చని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. క్యాన్సర్ రోగులకు హనుమాన్ ఫలం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాలను ఈ ఫలం సమూలంగా నాశనం చేస్తుంది.  ఇది ఆయుర్వేదంలో రుజువైంది. ఈ ఫలాలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో దొరుకుతాయి. క్యాన్సర్ కి టాప్ 5 ఫుడ్స్ లో హనుమాన్ ఫలం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

 

క్యాన్సర్ గడ్డలు ఎలా ఉంటాయి, క్యాన్సర్ లక్షణాలు ఈ ఇమేజ్చెబుతుంది. Telugu Needs
క్యాన్సర్ – Telugu Needs

క్యాన్సర్ విషయంలో ఇది చాలా ముఖ్యం :

విటమిన్ “డి” లోపం వలన క్యాన్సర్ వస్తోంది అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీంతో శరీరానికి విటమిన్ “డి” అందడం లేదు. ఈ కారణంగా అనేక విధాలైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విటమిన్ “డి” లోపంతో క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, మానసిక జబ్బులు, కీళ్లనొప్పులు వస్తాయి. విటమిన్ “డి” ని మందుల రూపంలో తీసుకునే దానికన్నా సహజసిద్ధంగానే ఎండ ద్వారానే సమకూర్చుకోవడం మంచిది. కనుక ప్రతి రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు అయినా సూర్య రశ్మి తగిలే విధంగా ఉండడం శరీరానికి అవసరం. క్యాన్సర్ కి టాప్ 5 ఫుడ్స్ లో విటమిన్ “డి” చాలా కీలకంగా చూడాలి.

 

క్యాన్సర్ కి చెక్ పెట్టే పండు ఇదే :

క్యాన్సర్ కు చెక్ పెట్టే పండు ఏమిటో తెలుసా ?, ‘ఆస్ట్రేలియన్ బ్లష్ ఉడ్’ అనే చెట్టు నుంచి వచ్చే పండు. క్యాన్సర్ వ్యాధిని ‘ఈవీఎస్-46’ ఔషధంతో చెక్ పెట్టొచ్చు. ఈ మెడిసిన్ లభించేది ఈ పండు నుంచే. దీని నుంచి తీసిన విత్తనాల ద్వారా క్యాన్సర్ మటుమాయం అవుతుంది. జంతువులు ఈ పండును తినడం ద్వారానే దీర్ఘకాలం జీవనం సాగిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని మానవులపై ప్రయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ట్రై చేసి చూశారు. అద్భుతమైన ఫలితాలు రావడంతో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తర ఆస్ట్రేలియాలో మాత్రమే దొరికే ఈ పండు వ్యాధినిరోధకతను కూడా పెరుగుతుందని అంచనా.

Leave a Comment