తల్లిపాలు చిట్కాలు టాప్ 5 కంటే ముందు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. తల్లిపాలు పట్టడం ఇటు పిల్లలకే కాదు, అటు తల్లులకూ ఎంతో మేలు చేస్తుంది. చనుబాలు మూలంగా బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే కణాలు తల్లి నుంచి శిశువులకు అందుతాయి. దీంతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా ఆస్థమా, అలర్జీల వంటి సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లిపాలతో బుద్ధి కుశలత కూడా మెరుగవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక్క మాటలో మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు తల్లిపాలు అమృతభిందువులు.
తల్లిపాలు చిట్కాలు లో ముఖ్యమైన పాయింట్స్ :
బిడ్డకు పాలు ఇవ్వడం బిడ్డకు మేలు అని కొందరు భావిస్తారు. కానీ.. తల్లికి కూడా మేలే. శిశువులకు పాలు పట్టటం వల్ల గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గుతుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటి తీవ్ర సమస్యల ముప్పు తగ్గుతుంది. అంతేకాదు.. పాలు పట్టే తల్లులకు గుండెపోటు, పక్షవాతం ముప్పు సైతం 9% వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. అలాగే, కాన్పయ్యాక పదేళ్ల తర్వాత కూడా ఈ ఫలితం. కనబడుతుండటం గమనార్హం. పైగా ఇది పిల్లల సంఖ్య, పాలు పట్టే సమయం తోనూ ముడిపడి ఉంటోంది కూడా. ఒకరి కన్నా ఎక్కువమంది పిల్లలకు.. అలాగే ప్రతి బిడ్డకూ రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పాలు పట్టిన వారికి గుండె జబ్బు, పక్షవాతం ముప్పు 18% వరకూ తగ్గుతుండటం గమనార్హం.
గుండె జబ్బు ముప్పు కారకాలైన కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తపోటు, పొగ అలవాటు, ఊబకాయం, శారీరక శ్రమ చేయకపోవటం వంటి అంశాలను పక్కనపెట్టి చూసినా ఈ ప్రభావం కనబడుతుండటం విశేషం. పాలు పట్టటం వల్ల కాన్పు తర్వాత మహిళల్లో జీవక్రియ క్రియల్లో మార్పులు తలెత్తుతుండొచ్చని, ఇది గుండె జబ్బు ముప్పు తగ్గడానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా గర్భధారణ సమయంలో పిండానికి తగినన్ని పోషకాలు అందటానికి, కాన్పు అనంతరం శిశు రావుకు అవసరమైన పాలు పట్టటానికి వీలుగా తల్లి శరీరం ఆయా భాగాల్లో, కొవ్వును నిల్వ చేసుకుంటుంది. దీంతో గర్భిణీలు బరువు పెరుగుతారు. అయితే, శిశువుకు పాలు పట్టే సమయంలో జీవక్రియలు పుంజుకొని… కొవ్వు మరింత సమర్థంగా ఖర్చవుతుంది. దీంతో బరువు మాత్రమే కాదు.. రక్తనాళాల్లో పూడికలు తలెత్తటం కూడా తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు, పక్షవాతం ముప్పులు తగ్గటానికి దోహదం చేస్తుంది.
ఇంతకీ, తల్లి పాలు పెరగాలంటే ఏం చేయాలి ?
తల్లి పాలు పెరగడానికి మార్కెట్ లో చాలా దారులు ఉన్నాయి. కొన్ని మెడిసిన్స్ కూడా అమ్ముతున్నారు. కానీ, అవేవీ పని చేయవు. తల్లి పాలు పెరగాలంటే.. ఈ పనులు మాత్రమే చేయండి. తల్లి తన బిడ్డకు పలు ఇచ్చాక.. రెండు, మూడు గ్లాసుల నీరు తాగాలి. వీటితో పాటు కొబ్బరి పాలు, పాలు తాగడం, ఆకుకూరలు తినడం ఎంతో మంచిది. దీని వల్ల పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. తల్లిపాలు చిట్కాలు లో ఇది ప్రధానమైన పాయింట్. ఇది అద్భుతంగా పని చేస్తోంది.
అలాగే, మీ బిడ్డకు తరచుగా నర్సింగ్ చేయించాలి. అదే విధంగా తల్లి పాల ఉత్పత్తిని పెంచడానికి మంచి నాణ్యమైన డబుల్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంపును కూడా ఉపయోగించొచ్చు. తల్లిపాలు ఇచ్చిన తర్వాత, పంపింగ్ చేయడం వల్ల తల్లి శరీరం ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు. కాబట్టి, తల్లి పాలు పడాలంటే ఏం చేయాలో ఇప్పటికైనా అర్ధం చేసుకోండి.
తల్లిపాలు చిట్కాలు టాప్ 5 కంటే ముందు తల్లి పాలు ప్రాముఖ్యత తెలుకోండి :
ఈ సృష్టిలో స్వచ్ఛమైన ఆహారం ఏమైనా ఉంది అంటే.. అది తల్లిపాలు మాత్రమే. పైగా ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం ఏదైనా ఉంది అంటే.. అది తల్లి పాలు మాత్రమే. అందుకే, ఈ సృష్టిలో అధిక ప్రాముఖ్యత ఉన్న ఆహారం కూడా తల్లి పాలు మాత్రమే.
బిడ్డ పుట్టిన గంట లోపు తల్లిపాలు ముర్రు పాలు పట్టడం వలన తల్లికి కలిగే ప్రయోజనాలు ఏమిటి ? అని కొందరు అడుగుతూ ఉంటారు. తల్లి కంటే ముందు మీ బిడ్డకు ప్రయోజనం ఎక్కువ. తన బిడ్డ జన్మనిచ్చిన మొదటి గంటలోనే ఆ తల్లి తన స్తన్యాన్ని ఆ బిడ్డకు అందించకపోతే ఆ బిడ్డపై చాలా ప్రభావం ఉంటుంది. తాజా నివేదిక ప్రకారం బిడ్డ పుట్టిన తొలి గంటలో తల్లి స్తన్యం లభించకపోతే ఆ బిడ్డ చనిపోయే అవకాశాలు 33 శాతం ఉన్నాయని నిర్ధారణ అయ్యింది.
తల్లి తన పాలను బిడ్డకు ఎన్ని రోజులు తాపొచ్చు ?
తల్లిపాలు చిట్కాలు అనగానే ఈ ప్రశ్న తప్పనిసరిగా ఉంటుంది. 12 నెలల వరకు తన బిడ్డకు తల్లి తన పాలు పట్టవచ్చు.
అసలు తల్లి పాలు ఎలా ఉత్పత్తి అవుతాయి?
తల్లి తన బిడ్డకి పాలిచ్చిన తర్వాత, ఆ సమయంలో ఆ తల్లి మెదడు ఓ సందేశాన్ని ఇస్తోంది. మెదడు హార్మోన్లు, ప్రోలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ విడుదల చేసేలా సంకేతాలు ఇస్తుందట. ఆ ప్రోలాక్టిన్ ఆల్వియోలీ పాలను తయారు చేసేలా కొన్ని చర్యలు చేస్తోంది. ఓ తల్లిలో పాలు ఇలా ఉత్పత్తి అవుతాయి.
తల్లిపాలు చిట్కాలు : తల్లిపాలు మాన్పించే పద్ధతులు ఏమిటి ?
మెత్తగా వండిన ఆహారాన్ని మీ పిల్లలకు స్పూన్ లేదా చేతి వేళ్ళతో తినిపిస్తూ ఉండాలి. ఈ విధానాన్ని ‘పేరెంట్-లెడ్ వీనింగ్’ అని పిలుస్తారు. సహజంగా ప్రతి తల్లి తెలుసో తెలియకో ఇలాగే చేస్తోంది. ఇక తల్లిపాలను మాన్పించే పద్దతిలో మరో విధానం కూడా ఉంది. అదే ‘బేబీ-లెడ్ వీనింగ్’. ఇది 2000 ఏడాది నుంచి అందుబాటులోకి వచ్చింది.