రచయితల బుక్స్ ప్రింటింగ్ కు  ప్రత్యేక పథకం 

రచయితలు రాసిన బుక్స్ ప్రింటింగ్ కు ప్రత్యేకంగా ఓ పథకం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ‘ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ ద్వారా “సాంప్రదాయ కళాకారులకు అవార్డులు ఇచ్చే పథకం” ఒకటి ఉంది. ఇప్పటికే, తమిళనాడు ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఎందరో రచయితలకు మేలు చేసింది. ముఖ్యంగా కళల అభివృద్ధికి అరుదైనదిగా భావించే పుస్తకాల ప్రచురణ కోసం రచయితకు ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు.  1000 కాపీల ప్రింటింగ్ ఛార్జీల మొత్తం ఖర్చులో  60% లేదా  ₹15,000/-  ఆయా రచయితలకు అందిస్తున్నారు.

 

ఈ పథకం ద్వారా పొందే ప్రయోజనాలివే :

 

దాదాపు 1000 కాపీల ప్రింటింగ్ ఛార్జీల మొత్తం ఖర్చులో  60% తో పాటు కొన్ని సందర్భాల్లో ₹15,000/- ఆర్ధిక సాయాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం అందిస్తోంది.

ఐతే,  గ్రాంట్‌గా మంజూరు చేయబడిన ఎమౌంట్ ను రెండు వాయిదాల రూపంలో అందిస్తోంది.

మొదటి విడత విషయానికి వస్తే.. :  కమిటీ నిపుణులందరూ  ఒక పుస్తకాన్ని ఎంపిక చేసిన తర్వాత  దాదాపు 50% ఎమౌంట్ ను రిలీజ్ చేస్తారు.

ఇక రెండవ విడత విషయానికి వస్తే.. :  వెరిఫికేషన్ స్టేట్‌మెంట్‌తో పాటు పుస్తకం 100 ప్రింటెడ్ కాపీలను  రచయిత కమిటీ నిపుణులకు సమర్పించిన తర్వాత మిగిలిన 50% ఎమౌంట్ ను రిలీజ్ చేస్తారు.

ఈ పథకం ద్వారా ఎందరో రచయితలు ప్రయోజానాలు పొందారు. ముఖ్యంగా కొన్ని అరుదైన పుస్తకాలు మళ్లీ అందుబాటులోకి రావడం విశేషం.

 

ఈ పథకానికి అర్హత ఏమిటి ?

 

అర్హత అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. దరఖాస్తుదారు రచయిత/రచయిత్రీ అయి ఉండాలి.  గతంలో వారు కొన్ని కథలు రాసి ఉండాలి.

అలాగే,  రచయిత  తాను రాసిన ఆ అరుదైన పుస్తకం ప్రచురణ ఖర్చులకు  తగినంత ఆర్థిక వనరులు తన లేవు అని లెటర్ రాయాల్సి ఉంటుంది.

అన్నిటికీ మించి రాసిన పుస్తకం కళల అభివృద్ధికి సంబంధించినది అయ్యి ఉండాలి.

అలాగే, ప్రచురణ సాయం కోసం సమర్పించిన మీ పుస్తకం  ఇంతకు ముందు ప్రచురించబడి ఉండకూడదు. అది కొత్తది అయ్యి, మీ స్వంత రచన అయ్యి ఉండాలి.

 

ఈ పథకం విషయంలో  ఆ రెండు ప్రభుత్వాలే :

 

‘Scheme of Extending Grants for the Publication of Rare Books on Arts’ అనే పేరుతో తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. అలాగే, గోవా ప్రభుత్వం ‘Promotion of Literature on Art & Culture of Local Authors/ Organization’ అనే పేరుతో ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తోంది. మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితేమిటి అంటారా ?.

రచయితల బుక్స్ ప్రింటింగ్ కు స్పెషల్ పథకంగా ఉన్న  ఈ అరుదైన పథకాన్ని  తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దారుణంగా నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. పైగా అసలు  తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురాకపోవడం రచయితలకు చేస్తున్న ద్రోహమే. అలాగే, కేంద్ర ప్రభుత్వం పరిధిలో యువ రచయితల కోసం కూడా ప్రత్యేకమైన స్కీమ్ ఉంది. కానీ, మన తెలుగు ప్రభుత్వాలు మాత్రం అలాంటి ఏ పథకాన్ని రచయితలకు అందేలా ఎలాంటి చొరవ చూపడం లేదు. మరి భవిష్యత్తులో అయినా, ఈ పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని, చేస్తారని కోరుకుందాం.

2 thoughts on “రచయితల బుక్స్ ప్రింటింగ్ కు  ప్రత్యేక పథకం ”

  1. పుస్తకం కళల అభివృద్ధికి సంబంధించినది అయ్యి ఉండాలి అన్న షరతు కాస్త ఇబ్బంది గా ఉంది. అన్ని కథలు అలా ఎందుకు ఉంటాయి?

    Reply

Leave a Comment