Market Mahalakshmi Review and Cast and Crew :
నటీనటులు : పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్షవర్ధన్, ముక్కు అవినాష్ తదితరులు.
దర్శకత్వం: వీఎస్ ముఖేష్,
రచన : వీఎస్ ముఖేష్,
ఎడిటర్ : ఆర్ఎం విశ్వనాథ్ కుంచానపల్లి,
ఛాయాగ్రహణం: సురేంద్ర చిలుముల,
సంగీతం : జోయ్ ఎమ్నావ్,
నేపథ్య సంగీతం: సృజన్ శశాంక,
నిర్మాత: అఖిలేష్ కిలారు.
Market Mahalakshmi Review లో కథ పరంగా చూసుకుంటే.. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అబ్బాయి, మార్కెట్‌లో కాయగూరలు అమ్ముకునే అమ్మాయి కోసం ఫ్యామిలీని సైతం వదిలేసి.. తాను మార్కెట్‌లో కాయగూరలు అమ్ముకుంటాడు. చివరకు ఆమె కోసం తన ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతాడు. నిజంగా ఈ సమాజంలో ఆ పరిస్థితి ఎవరికైనా వస్తోందా ?, ఒకవేళ, ప్రేమలో పడినా.. ఆ అమ్మాయి కోసం ఇతగాడు కూడా వెళ్లి మార్కెట్‌లో కాయగూరలు అమ్ముకుంటూ.. ఆ అమ్మాయికి లైన్ వేసి ప్రేమలో పడేస్తాడా ?.. మనకు ప్రశ్నలుగా మిగిలిపోయిన ఈ డౌట్లు చుట్టే దర్శకుడు వీఎస్ ముఖేష్ ఈ సినిమా కథ రాసేసుకున్నాడు.
టైటిల్ ఎలాగూ ‘మార్కెట్ మహాలక్ష్మి’ అని పెట్టుకున్నాడు కదా, కనీసం సీన్స్ అయినా ట్రెండీగా ఉంటాయి కదా అని ఎక్కడో ఆశ. అంతే ఆశతో సినిమా చూస్తే.. నీరసం వచ్చింది. విమర్శలు చేయాలని కాదు గానీ, ఈ సినిమా పై ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చు. తనకు ఇండిపెండెంట్ అమ్మాయిలు అంటే ఇష్టం అని హీరో బలంగా చెబుతూ ఉంటాడు. కానీ, ఆ ఇండిపెండెంట్ కి అర్ధం కూడా తెలుసుకోకుండా చివరకు ఆ అమ్మాయి అలా ఎందుకు ఉంది అని అమాయకంగా నటుడు హర్షవర్ధన్ అడుగుతాడు. ఇలా సాగాయి ఈ సినిమాలో పాత్రలన్నీ.
అయినా, ఓ సాఫ్ట్‌వేర్ కుర్రాడు ఓ మార్కెట్ అమ్మాయిని ప్రేమలో పడేయడానికి సినిమా మొత్తం ప్రయత్నాలు చేస్తూనే ఉండటం.. అంత మంచి కథ అనిపించుకోదు. ప్రేమలో ఎలాగూ కొత్తదనం లేదు, కనీసం ప్రేమించే విధానం అయినా కొత్తగా ఉంది అంటే.. అదే పాత చింతకాయ పచ్చడి డ్రామా.
Market Mahalakshmi Review లో పాజిటివ్ పాయింట్స్ :
మహాలక్ష్మిగా, కూరగాయలు అమ్మే అమ్మాయిగా ప్రణీకాన్వికా చాలా బాగా నటించింది. కానీ, ఆమె లుక్స్ బాగాలేదు. ముఖ్యంగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఆమెకు సెట్ కాలేదు. కానీ, ప్రణీకాన్వికా మాత్రం బాగుంది. హీరో పార్వతీశం బాగా నటించాడు. మరో కీలక పాత్రలో హర్షవర్ధన్ మెప్పించాడు. అన్నట్టు ఈ సినిమాకి రచయితగా కూడా పని చేసిన హర్షవర్ధన్ కొన్ని డైలాగ్స్ ను చాలా బాగా రాశాడు. ముక్కు అవినాష్ నటన పర్వాలేదు. మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు. క్లైమాక్స్ లో ఎమోషన్స్ బాగున్నాయి.
Market Mahalakshmi Review లో నెగిటివ్ పాయింట్స్ :
మార్కెట్ మహాలక్ష్మి సినిమా కథే కాదు, ఏ సినిమా కథకైనా ప్రాధమికమైన అంశం ఏమిటి ?, కాన్-ఫ్లిక్ట్ బలంగా ఉండాలి. అది సినిమా మొదలైన తర్వాత ఎంత త్వరగా వస్తే అంత మంచి స్క్రీన్ ప్లే అవుతుంది. కానీ, అదేంటో మార్కెట్ మహాలక్ష్మి లో ఆ పాయింట్ సినిమా ఇంకొక పావుగంటలో ముగుస్తుందనగా వచ్చింది. మరి, దర్శకుడు కాన్-ఫ్లిక్ట్ ను లేకుండానే సినిమాని రెండు గంటలు నడపడం అంటే మాటలా !!.
Market Mahalakshmi Review (మార్కెట్ మహాలక్ష్మి రివ్యూ) సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో ఇంత దయనీయమైన రచన మరో ఏ సినిమాలోనూ చూడలేదు. దర్శకుడు రాసుకున్న సీన్స్ కి ఇరిటేషన్ వచ్చింది. అసలు రచన అనేది కామెడీ అయిపోయింది. రచనలో మాత్రం కామెడీ లేదు. మరి ప్రేక్షకులు ఏమైపోవాలి ?, మార్కెట్ మహాలక్ష్మిలో ఏ పాయింటుని పట్టుకుని సినిమా చూడాలి ?, ఈ ప్రశ్నలు వేసుకుని ఉండి ఉంటే స్క్రిప్ట్ దశలోనే రిపేర్ జరిగుండేది. అయినా హీరో గారు మార్కెట్టులో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడటం ఏమిటి ?, ఆ అమ్మాయి కోసం మార్కెట్ లో కూరగాయలు అమ్మడం ఏమిటి ? ఆలోచనల్లో కూడా క్వాలిటీ లేదు.
Market Mahalakshmi Review తీర్పు :
పాయింట్ లెస్ పెయిన్ తో ఎమోషన్స్ తో పండవు. ఈ సినిమా చివరాఖర్న వచ్చే పావుగంట బిట్ కోసం రెండు గంటల మార్కెట్ మహాలక్ష్మి టార్చర్ ను ఎందుకు భరించాలి ?, అదేదో.. ఈ మార్కెట్ మహాలక్ష్మి రివ్యూ (Market Mahalakshmi Review) చదువుకుంటే సరిపోతుంది కదా. నిజానికి పూర్తిగా దర్శకుడినే అనలేం. అలా అని అతన్ని విమర్శించకుండా ఉండలేం. ఓవరాల్ గా మార్కెట్ మహాలక్ష్మి నిరాశ పరిచింది.
మార్కెట్ మహాలక్ష్మి రివ్యూ రేటింగ్ : 1.5 / 5
మార్కెట్ మహాలక్ష్మి రివ్యూ పంచ్ లైన్ : మార్కెట్ కి – మహాలక్ష్మికి మధ్యలో సిల్లీ డ్రామా