ఇవన్నీ చూస్తుంటే ఒకటి గుర్తు వస్తోంది. టెనెట్ అనే ఇంగ్లీష్ సినిమా ఎండింగ్ లో హీరో ప్యాటిసన్ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి వస్తాడు. అలాగే, మరో హీరో వాషింగ్టన్ గతం నుంచి వర్తమానంలోకి వస్తాడు. వాషింగ్టన్ తో ప్యాటిసన్ ఒక మాట అంటాడు. నీ గతానికి గొప్ప భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే, నాకు కొన్నేళ్లు క్రితం నీకు కొన్నేళ్ల తర్వాత కాబట్టి… అని భవిష్యత్తులోకి వెళ్లిపోతాడు. వాషింగ్టన్ గతంలోకి వెళ్తాడు. మరి వర్తమానం పరిస్థితి ఏమిటి ? అనిసినిమా చూసిన వారికీ అనిపిస్తోంది. భారీ క్రేజ్ ఉన్న సినిమాల వర్తమానం కూడా ఎవరికీ అక్కర్లేదు. భవిష్యత్తులో వాటి పరిస్థితి ఏమిటీ అనేది అందరికీ కావాలి. అందుకే, గాసిప్స్ కి వ్యూస్ ఎక్కువ.
Mahesh Babu Rajamouli Movie Release Date ఇదే :
ఈ క్రమంలోనే Mahesh Babu Rajamouli Movie Release Date పై వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడో తెలుసా ?, 2026 జనవరి 9వ తేదీన సంక్రాంతి స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుందట. మహేష్ సినిమా అంటే భారీ సినిమా. పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న మొదటి సినిమా. కాబట్టి, ఈ సినిమాకి అటు ఇటు సినిమాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి, 2026 సంక్రాంతికి తక్కువ సినిమాలే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉంది. ఎలాగూ థియేటర్స్ నుంచి భారీ లాభాలు పొందటంలో రాజమౌళికి మంచి అనుభవం ఉంది. రాజమౌళి తన బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల విషయంలో కూడా తక్కువ కమిషన్ మీద పెద్దగా అడ్వాన్స్ లు కూడా తీసుకోకుండా నేరుగా విడుదల చేసుకుని ఫుల్ క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ అదే చేస్తాడు.
Mahesh Babu Rajamouli Movie Release Date తో పాటు ఈ ముచ్చట్లు కూడా :
ఏ సినిమా అయినా సరే, ఒక్కొక్కరి పర్సెప్షన్ లో ఆ సినిమా ఒక్కోలా అర్థమవుతూ ఉంటుంది. ఐతే, ఎమోషన్ ఉన్న సినిమాను అర్ధం చేసుకోవడం చాలా ఈజీ. బుర్రకు నిజానికి చాలా సులభంగా ఉంటుంది. రాజమౌళి సినిమాలు ఎమోషన్ పైనే నడుస్తాయి. పైగా విజువల్ గా సీన్లు అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. రాజమౌళి కొన్ని సీన్లు ఎలా తీశాడో కూడా అర్థం కాదు. ప్రతి సీన్ లో ఇంట్రెస్టింగ్ మూమెంట్ ని చూపిస్తాడు రాజమౌళి. బాగా పరిశీలిస్తే రాజమౌళి సినిమాలో ఒక మూమెంట్ ఫార్వర్డ్ లో ఇంకో మూమెంట్ రివర్స్ లోలా జరుగుతూనే ఉంటాయి. ఆ మూమెంట్స్ కి తగ్గట్టుగానే పాత్రల మధ్య సంఘర్షణ కూడా వైవిధ్యంగా ఉంటుంది. అందుకే, తన కెరీర్ లో ఇంతవరకు ప్లాప్ కూడా లేదు. కాబట్టే.. Mahesh Babu Rajamouli Movie కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని నమ్ముతున్నారు. అన్నట్టు ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.
Mahesh Babu Rajamouli Movie టైటిల్ ఏమిటి ?
సంక్షిప్తంగా ప్రస్తుతానికి అభిమానులు ఈ సినిమాకి SSMB29 అని టైటిల్ పెట్టుకున్నారు. ఐతే, మహేష్ బాబు సినిమాకి మాత్రం రాజమౌళి ‘మహారాజా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే, ఈ టైటిల్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Mahesh Babu Rajamouli Movie Budget ఎంత ?
మహేష్ బాబు – రాజమౌళి సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. దాదాపు రూ. 1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు అని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం ఉన్నా.. Mahesh Babu Rajamouli Movie Budget భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికం కానుంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ?
SSMB29 సినిమాకి మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయానికొస్తే, దాదాపు ₹80 కోట్ల వరకూ ఉంటుందని.. అలాగే తెలుగు డిజిటల్ రైట్స్ లో 40 % షేర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా మహేష్ ఒక్కో చిత్రానికి ₹50 నుంచి ₹60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. కానీ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మాత్రం మరింత ఎక్కువ అందుకుంటున్నాడు.
Mahesh Babu Rajamouli Movie Heroine ఎవరు ?
రీసెంట్ గా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో ఓ విదేశీ నటి కూడా నటిస్తోంది అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆమె మరెవరో కాదు, ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ అని టాక్. ఈ వార్తకు బలం చేకూర్చేలా దర్శకుడు రాజమౌళి కూడా అమెరికాలో చెల్సియా ఇస్లాన్ మీట్ అయ్యాడు. ఆ పిక్ ఆ మధ్య వైరల్ అయ్యింది. ఐతే, ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే Mahesh Babu Rajamouli Movie Release Date వరకు లేదా ఎనౌన్స్ డేట్ వరకో ఆగాలి.
SSMB29 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది ?
Mahesh Babu Rajamouli Movie Producer ఎవరు ?
మహేష్ బాబు రాజమౌళి సినిమా నిర్మాత K.L. Narayana (కె.ఎల్.నారాయణ). కె.ఎల్.నారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో నిర్మాతగా ఆయనకు మంచి అనుభవం ఉంది. తన బ్యానర్ దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ మంచి చిత్రాలను నిర్మించారు. క్షణక్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సంతోషం వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆయనే నిర్మించారు.