ప్చ్..  ఆమె కోసం బాలీవుడ్  వెంపర్లాట  

సాయి పల్లవి 1 : బాహుబలి నుంచి బాలీవుడ్ చూపు అంతా తెలుగు సినిమా పైనే పడింది. సహజంగా సౌత్ లో ఏ నటికి అయితే ఎక్కువ ఫోకస్‌ వస్తోందో..,  ఠక్కున ఆమె ఇంటి ముందు వాలిపోతారు బాలీవుడ్ సినీ నిర్మాతలు, మేనేజర్లు… ఆ హీరోయిన్లను ఎలాగైనా  ఒప్పిస్తారు, వారితో సంతకాలు చేయిస్తారు… వారికీ  ఏవేవో పాత్రలు ఇస్తారు… మొత్తానికి వారి నుంచి లాభాలు పొందుతారు. ఆ నాటి రేఖ, శ్రీదేవి దగ్గర నుంచి నేటి శోభితా ధూళిపాళ్ల వరకూ ఇదే వ్యవహారం. శోభితా ధూళిపాళ్ల పాత్రలను గమనిస్తేనే.. సౌత్ నటీనటుల పై  హిందీ వాళ్ళ చిన్న చూపు అర్ధం అయిపోతుంది.

సౌత్ భామలను దాదాపుగా  పిండుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు..? సారీ, నో ఆన్సర్… సౌత్ లో సక్సెస్ అయి వెళ్లిన ఇలియానా ను చూశాం, ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్ ను చూస్తున్నాం కదా… తమన్నా డాన్స్ బాగా చేస్తుంది. లస్ట్ స్టోరీస్ 2  వెబ్ సిరీస్ తో  బాగా పాపులర్ అయ్యింది కదా, జనంలో క్రేజ్ ఉంది కదా… మొత్తానికి తమన్నాకి   బోలెడు బోల్డ్ అవకాశాలిచ్చారు, ఆమె అడిగినంత డబ్బిచ్చారు… అన్నింట్లోనూ అవే హాట్ హాట్ సీన్స్..   చేసీ చేసీ తమన్నా ఇక జనానికి మొహం మొత్తింది… మరీ లస్ట్ స్టోరీస్ 2 లో  ఓవర్… ఇప్పుడామెకు హిందీలో పెద్దగా అవకాశాల్లేవు… తమన్నా స్టార్ హీరోయిన్ కదా అంటే.. అక్కడ అలాంటివి  కుదరదు.

అందుకే, బాలీవుడ్ లో నిత్యం చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు… కాకపోతే మలయాళ తారల విషయంలో తప్ప. తెలుగులో బాగా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. మలయాళ భామలు  ప్రూవ్ చేసుకుంటారు, కష్టపడతారు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? బాలీవుడ్ వాళ్ళ దృష్టి హీరోయిన్ సాయి పల్లవి మీద పడింది.  సాయి పల్లవి బాగా నటిస్తోంది.  నటనలో ఆమె చెప్పుకోదగిందే… ఇంకేముంది..? బాలీవుడ్ ఆరాలు స్టార్ట్ అయ్యాయి.

సాయి పల్లవి 1 రెమ్యునరేషన్ ఎంత..? ఏ పాత్రయినా ఒప్పుకుంటుందా..? ఎట్సెట్రా వివరాల కోసం అన్వేషణ… సరే, తప్పదు సినిమా అంటే వ్యాపారం, ఏదో ఓ ఆకర్షణ కావాలి.. కానీ ఆమె ఒప్పుకుంటుందా ?, హిందీ జనాలకీ ఇదే డౌట్.  ఇంతకీ సాయి పల్లవి ఎలాంటిది..? ఈ ప్రశ్న ఎక్కువ అయ్యింది హిందీ వాళ్ళల్లో.  కానీ,  సాయి పల్లవితో  అంత ఈజీ కాదు అనే పాయింటే వారికి ఎక్కువగా వినిపిస్తోందట. అయినా, సాయి పల్లవి ఒక్క హిందీ రామాయణం తప్ప మరో సిమిమా ఒప్పుకోవడం లేదు. ఈ లెక్కన బాలీవుడ్ వాళ్ళు సాయి పల్లవిని ఒప్పించడం అయ్యేపని కాదు.

కానీ కొందరు బాలీవుడ్ నిర్మాతలు మాత్రం సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారు. బ్లాంక్ చెక్ ఇచ్చి సినిమా ఆఫర్ చేశారు. ఎప్పటిలాగే సాయి పల్లవి సారీ చెప్పేసింది. నిజానికి ఆమె పాత్ర పద్దతిగానే ఉంటుంది. అయినా ఎందుకు సారీ చెప్పారు అంటే.. అదొక మతపరమైన కథ. కథ ప్రకారం.. ఆమె హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాల్సి ఉంటుంది. ఈ కథా నేపథ్యం మొత్తం దుబాయ్ నేపథ్యంలో ఉంటుంది. మొత్తమ్మీద సినిమాల్లో మతం మారడానికి కూడా సాయి పల్లవి ఒప్పుకోకపోవడం ఆశ్చర్యకరం.

Leave a Comment