వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి ? ది బెస్ట్ టిప్స్

వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి అని తెలుసుకునే ముందు.. ఇంటి కోసం వాస్తు గానీ, వాస్తు కోసం ఇల్లు కాదు అని విషయాన్ని గుర్తు పెట్టుకోండి.  వాస్తు నియమాలు అంటూ ఎన్నో అపోహలు, మరెన్నో అవాస్తవాలు ప్రస్తుతం చలామణి అవుతున్నాయి. అసలు ఇంటికి వాస్తు ఎందుకు వచ్చింది ?, కొన్ని వాస్తు నియమాలు  మీకు మీ కుటుంబానికి అదృష్టాన్ని, సంతోషాన్ని విజయాన్ని అందిస్తాయి. కానీ నేడు ప్రచారంలో ఉన్న మరికొన్ని వాస్తు నియమాలు మీకు నష్టాలను అంశాంతిని కలిగిస్తున్నాయి.  ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ప్రతి ఒక్కరూ  ఓ సొంతింటిని కట్టుకుంటారు. ఓ మధ్య తరగతి వ్యక్తి జీవితాంతం కష్టపడితే గానీ, అతని సొంతిల్లు కల నెరవేరదు. అంత విలువైన ఇంటిని  అవాస్తవాలైన వాస్తు నియమాలు పాడు చేస్తున్నాయి.                  

 

వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి ? చెప్పే  వాస్తు దిశలు : 

ఓ మనిషి తన జీవిత కాలంలో  సగం పై జీవితమంతా  తన ఇంటిలోనే గడుపుతాడు. కాబట్టి, ఇల్లు అంటే అర్ధ జీవితం. మరి అలాంటి మీ జీవితానికి శాంతి,  శ్రేయస్సు దక్కాలి అంటే.. మీ ఇంటితోనే సాధ్యం అవుతుంది. అది కూడా సరైన వాస్తు దిశలు వల్లే సాధ్యం. అందుకే, ఓ మనిషి జీవితంలో ఇంటికి వాస్తు దిశలు చాలా కీలకం. కరెక్ట్ గా వాస్తు ప్రకారం ఇల్లు ఉంటే.. ఆ ఇంటిలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. గుర్తు పెట్టుకోండి. ఇంటికి వాస్తు ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీని ఇస్తోంది.  

అందుకే,  వాస్తు దిశలు ఎందరో జీవితాలను  ప్రభావితం చేశాయి. కొందరు ఇల్లు మారగానే కలిసి వచ్చింది అంటారు. మరికొందరు ఈ ఇల్లు మాకు కలిసి రాలేదు అంటారు. ఇవ్వన్నీ వాస్తు శాస్త్రం  నిజమే. ఇంటికి వాస్తు దిశలు మీరు కొత్త ఇంట్లో వెళ్ళేటప్పుడు,  ఆ ఇంటి ధర, ఆ ఇంటి పరిసరాల గురించి కంటే ముందు.. ఆ ఇల్లు వాస్తు ఎలా ఉందో చెక్ చేసుకోండి. మరి వాస్తు ప్రకారం ఒక ఇంటికి వాస్తు దిశలను ఎలా చూడాలి ?, అసలు వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి ? వంటి విషయాలను తెలుసుకుందాం రండి.     

వాస్తు ప్రకారం  బెడ్‌ రూమ్‌ అలా ఉండాలి. 

ఒక ఇంటికి బెడ్‌ రూమ్‌ చాలా కీలకం. మరి అలాంటి బెడ్‌ రూమ్‌   వాస్తు శాస్త్రం ప్రకారం ఎలా ఉండాలో తెలుసా?,  బెడ్‌ రూమ్‌.. మీ ఇంటికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తరంగా ఉండొచ్చు. ఈ మూడు దిశల్లో బెడ్‌ రూమ్‌ ఉండటం మీకు మంచిది. ఈ దశల్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది.    

 

వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తమ వాస్తు దిశలు ఏవి ?  

ఇంటికి ఎప్పుడూ  ఉత్తరం, ఈశాన్యం మరియు తూర్పు ఉత్తమ వాస్తు దిశలు అని చెప్పొచ్చు. మరి పడమర దిశ మాత్రం ఇంటికి ఎందుకు మంచిది కాదు అని అడుగుతూ ఉంటారు. ఇంటికి పడమర దిశలో ముఖద్వారం ఉంటే.. ఆ ఇంటిలోని స్త్రీలకు మంచిది కాదు అని శాస్త్రం చెబుతోంది. సైన్స్ ప్రకారం పడమర దిశ నుంచి ఎక్కువగా చెడు గాలులు వీస్తాయి. అంటే.. ఎంజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పాస్ అవుతుంది. అందుకే, పడమర దిశ అనేది ఇంటి ముఖ ద్వారానికి మంచిది కాదు.          

వాస్తు ప్రకారం మీ పిల్లలకు ఈ వాస్తు దిశలు ఎంతో మేలు చేస్తాయి.    

ప్రతి కుటుంబంలో పిల్లలు ఉంటారు. మరి వారి బంగారు భవిష్యత్తుకి ఏ వాస్తు దిశ మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్యం వైపు ఉన్న ఇల్లు పిల్లలకు ఎంతో మేలు చేస్తోంది. పిల్లల విజయానికి, వారి అదృష్టానికి మరియు  వారి ఆరోగ్యానికి  వాయువ్యం వైపు ఇల్లు ఉండటం ఎంతో మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం కూడా  ఎంతో మంచిది.  ఈ దిశలో మీ ఇల్లు ఉంటే.. మీ ఇంట్లో ఎప్పుడూ సంపద ఉంటుంది. అలాగే శివుని అనుగ్రహం కూడా మీ పై ఉంటుంది. 
 
 

ఏ దిశలు మంచివి కావు : 

 

మీ ఇల్లు నైరుతి దిశలో ఉంటే మంచిది కాదు. నిజానికి ఈ దిశలో ఇల్లు ఉంటే.. మంచి సంపద కలుగుతుంది గానీ, అలాగే దురదృష్టాన్ని ఈ దిశ మీ ఇంటికి తీసుకొస్తోంది. అలాగే,  నైరుతి దిశలో మీ ఇంటి ముఖ ద్వారం ఉంటే..ఆ కుటుంబంలోని మగవారు ఇంటికి దూరంగా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు.  అందుకే, మీ ఇంటి దిశ నైరుతి దిశలో ఉండకుండా చూసుకోండి.  

 

 
Best Home Vastu Tips in telugu - Telugu Needs
Home Vastu Tips

వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి ?,  ఇంటి సైట్ ఎంపిక ముఖ్యం :   

వాస్తు ప్రకారం మీ ఇల్లు బాగుండాలి అంటే.. ముందు మీ ఇంటి ఉండబోయే సైట్ ఎంపిక చాలా కీలకం. మీరు మీ ఇంటి స్థలం కోసం ఒక భూమిని ఎంచుకుంటున్న సమయంలో.. ఆ  సైట్ ఓరియంటేషన్, అలాగే ఆ నేల రకం ఏమిటి ?, ఇక ఆ ప్లాట్ విస్తీరణం వంటి ఎన్నో విషయాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి ? అనే టాపిక్ లో ఈ పాయింట్ అతి ముఖ్యమైనది.      

 

ముందుగా  వీధి శూలలను గమనించండి  :


మీ సైట్ కి ఎదురుగా రోడ్డు ఉంటే దాన్ని వీధి శూల అంటారు. నిజానికి వీధి శూల అనగానే నెగిటివిటీ అనుకుంటారు. కానీ.. వీధి శూలాల్లో కూడా  కొన్ని సానుకూలతలు ఉన్నాయి. అదేవిధంగా  మరికొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. మరి  వీధి శూలాల్లో ఏవి మంచివి ?, ఏవి చెడ్డవి ? చూద్దాం రండి.      

ఒకవేళ మీ ఇల్లు వీధి శూల ఈశాన్యానికి ఉత్తరాన, ఈశాన్యానికి తూర్పున ఉంటే.. ఆ వీధి శూల మంచిది. అయితే,  ఆగ్నేయానికి దక్షిణం, వాయువ్యానికి పశ్చిమంగా ఉంటే మాత్రం ఆ వీధి శూల ఎలాంటి ఫలితాలను ఇవ్వదు. అంటే అటు పాజిటివ్, ఇటు నెగిటివ్. కాబట్టి, వీధి శూల అనగానే నెగిటివ్ అని అనుకోమాకండి.       

 

మీ ఇంటి నీటి వనరులు :


వాస్తు శాస్త్రంలో ఇంటి నీటి వనరులు కూడా వాస్తులో ముఖ్యమైనవి. మీ ఇంటిని వాస్తును పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఆ ఇంటి నీటి వనరులను కూడా  చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, నీళ్ల  ట్యాంకులు, బావులు లేదా ఇతర వాటర్ ట్యాప్స్.. ఇవన్నీ ఇంటి ఈశాన్యం వైపు ఉండేలా చూసుకోండి. అలాగే, నీటి వనరులు మీ ఇంటి ఉత్తర దిక్కును ఉన్నా శుభప్రదమే.  

 

వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి ?,  ఇంటి మెయిన్ గేట్ కీలకం :  

 

వాస్తు శాస్త్రంలో ఇంటి మెయిన్ గేట్ ఎంతో బలమైనది.  మీ ఇంటికి ప్రవేశ ద్వారమే మీ ఇంటి మిగిలిన వాస్తును కూడా డిసైడ్ చేస్తోంది. కాబట్టి. మెయిన్ గేట్ ఎల్లప్పుడూ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండేలా  జాగ్రత్త పదండి.  అలాగే, మెయిన్ డోర్‌ ను ఎప్పుడూ నాణ్యమైన చెక్కతోనే నిర్మించుకోవాలి. చెదలు పట్టిన చెక్కను ఎట్టిపరిస్థితుల్లో వాడకుండా చూసుకోండి.  అదేవిధంగా మెయిన్ గేట్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేలా చూసుకోండి. మెయిన్ గేట్ వెలుపల ఏవైనా ఫౌంటైన్‌లు లేదా ఇతర అలంకారమైన నీటికి సంబంధించిన అలంకరణలను పెట్టకుండా ఉండాలి. అలా పెడితే నెగిటివ్ ఎనర్జీని అహ్వాయించినట్టే. 

Leave a Comment