రత్నం మూవీ రివ్యూ 

రత్నం మూవీ రివ్యూ Cast and Crew :

నటీనటులు : విశాల్‌,  ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, గౌతమ్ మీనన్,  యోగి బాబు, మురళీ శర్మ తదితరులు.

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి,

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్,

సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్,

ఎడిటర్ : టీ ఎస్ జయ్

నిర్మాత: కార్తికేయన్ సంతానం

 

విశాల్ ‘రత్నం’ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది ?, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ? రత్నం మూవీ రివ్యూ  చూద్దాం రండి.

 

కథ :

రత్నం మూవీ రివ్యూ  కథ పరంగా చూసుకుంటే..  రత్నం (హీరో విశాల్)  ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం అనుచరుడిగా ఉంటాడు. తన ఎమ్మెల్యే కోసం రత్నం  ఏమైనా చేస్తాడు. మరోవైపు ప్రియా భవానీ శంకర్  ఓ ఇంటర్వ్యూ కోసం వెల్లూరు కి వెళ్తుంది. ఐతే, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కొంతమంది రౌడీలు ఆమెను చంపడానికి వెంబడిస్తారు. కానీ వారి నుంచి రత్నం ఆమెను రక్షిస్తాడు. అసలు ఆమెను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు ?, ఆమెకు అండగా రత్నం ఎందుకు నిలబడ్డాడు ?, ఈ మధ్యలో  తెలుగు, తమిళనాడు స్టేట్స్ విడిపోయిన నేపథ్యం ఏమిటి ?, ఆ నేపథ్యంతో ఈ కథకు ఉన్న లింక్ ఏమిటి ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

 

రత్నం మూవీ రివ్యూ లో  పాజిటివ్  పాయింట్స్ :

హరి – విశాల్ కాంబోలో గతంలో  భరణి, పూజా సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. ఆ హిట్ కాంబినేషనే.. ఈ రత్నం సినిమాకి ఉన్న ప్రధాన బలం. అలాగే, ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు చక్కని మెసేజ్ కూడా ఉండటం కలిసొచ్చే అంశం. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగున్నాయి.  విశాల్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ప్రతి పది సీన్స్ కి విశాల్ పై  ఓ భారీ ఎలివేషన్ సీన్ ఉంటుంది.

సహజంగా విశాల్ సినిమాలు అంటేనే.. విలన్ బ్యాచ్ గాల్లో తేలుతూ ఉంటారు. ఈ రత్నం సినిమాలో  ఆ రేంజ్ ఫైట్స్ చాలా ఉన్నాయి.  విశాల్ బిల్డప్ షాట్స్ కూడా ఆయన ఫ్యాన్స్ కి నచ్చుతాయి.  విశాల్ నటన కూడా అద్భుతంగా ఉంది. అలాగే, ఫస్ట్ హాఫ్ లో విశాల్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్,  అలాగే ప్రియా భవానీ శంకర్ – విశాల్ మధ్య ఎమోషన్స్  బాగున్నాయి.  సముద్రఖని, గౌతమ్ మీనన్,  యోగి బాబు, మురళీ శర్మ ఇలా అందరూ తమ పాత్రల్లో జీవించారు. ముఖ్యంగా సముద్రఖని నటన తెర నిండుగా ఉంది.

 

రత్నం మూవీ రివ్యూ లో  నెగిటివ్ పాయింట్స్ :

రత్నం మూవీ రివ్యూ గురించి సింపుల్ గా చెప్పాలంటే.. ఈ సినిమాలో యాక్షన్ బాగున్నా.. సోల్ మాత్రం మిస్ లేదు. సినిమాలో విశాల్ – ప్రియా భవానీ శంకర్ మరియు ప్రధాన పాత్రల మధ్య  కెమిస్ట్రీ ఉన్నా.. ఎమోషన్ మిస్ అయ్యింది. దీనికితోడు,  విశాల్  – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ లో డెప్త్ కంటే.. సినిమాటిక్ టోన్ ఎక్కువ అయ్యింది. విశాల్ పై  ఫైట్స్ ను సహజంగా తీయాలనే తాపత్రయంలో  గ్రాండ్ యాక్షన్ విజువల్స్ ను కూడా రొటీన్ చేసి రోత పుట్టించారు.

 

రత్నం మూవీ రివ్యూ అండ్ రేటింగ్ in Telugu By Telugu Needs

 

రత్నం మూవీ మొదలైన మొదటి నిమిషం నుంచి హీరో విశాల్  అభిమానులు విజిల్స్ తో కేకలతో ఊగిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా.. వారికి దర్శకుడు హరి ఎక్కువ ఛాన్స్ లు ఇవ్వలేదు. కారణం.. రత్నం కథలో కథనంలో కంటెంట్ లేకపోవడమే. రత్నం మూవీ చూసిన ప్రేక్షకుల్లో  ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ఈ చిత్రం బోరింగ్ ప్లేతో సాగే  లాజిక్ లెస్ యాక్షన్ డ్రామా అని చెబుతున్నారు.

మొత్తానికి భారీ యాక్షన్ సినిమా అంటూ వచ్చి.. దిగువస్థాయి సిల్లీ డ్రామా  అయిపోయింది విశాల్ రత్నం మూవీ.  కానీ,  విశాల్ ఫ్యాన్స్ కి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నచ్చుతాయి. ఐతే, పూర్తి స్థాయిలో మాత్రం ఈ సినిమా ఆకట్టుకోదు. చివరగా రత్నం మూవీ రివ్యూ సారాంశం ఏమిటంటే.. ఎమోషనల్ గా సాగే ఈ యాక్షన్ డ్రామా  మిస్ ఫైర్ అయ్యింది.

 

తీర్పు :

‘రత్నం’ అంటూ హీరో విశాల్ మళ్ళీ అవే ప్యూర్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో వచ్చాడు. కాకపోతే, సినిమాలో మాస్ యాక్టింగ్ అండ్ కొన్ని ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నా..  ఓవరాల్ గా సినిమా అయితే ఆకట్టుకోలేదు. మెయిన్ పాయింట్ తో పాటు కంటెంట్ బాగున్నా.. మిగిలిన బాగోతం అంతా రెగ్యులర్ రొట్ట కొట్టుడు మేకింగ్ స్టైల్ తోనే  ఈ రత్నం సినిమా సాగింది. ఐతే, విశాల్ మాస్ నటన మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది.    

 

రత్నం మూవీ రివ్యూ  రేటింగ్  :  2.75 / 5

రత్నం మూవీ పంచ్ లైన్  :  అదే రొట్ట కొట్టుడు !!

Leave a Comment