మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం గురించే ఈ టాపిక్. ఆర్ధిక వేత్త థామస్ జెఫర్సన్ తరుచూ ఓ సలహా ఇచ్చేవారట, మీ అవసరాలు తీరాక మిగిలిన డబ్బును పొదుపు చేయకండి, మీరు పొదుపు చేశాక, మిగిలిన డబ్బుతో మాత్రమే మీ అవసరాలు తీర్చుకోండి అని. నిజంగానే ఖర్చు చేసిన తర్వాత మిగిలిన దానితో పొదుపు చేస్తే.. మీ పొదుపు ఎప్పుడూ మీ భవిష్యత్తు ఖర్చులను తీర్చలేదు. అందుకే, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలు సేవింగ్స్ చేసేందుకు చాలా పథకాలను అందుబాటులోకి తెచ్చింది. మరి వాటిలో రిస్క్ లేనిది ఏమిటి ?, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టేది ఏమిటి ?, ముఖ్యంగా ఆడవారి కోసం చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏం ఉన్నాయి ?, వాటిల్లో ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చే బెస్ట్ స్కీమ్ ఏమిటి ?, అన్ని ప్రశ్నలకు ప్రస్తుతానికి బెటర్ ఆన్సర్ ఒక్కటే. అదే “మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్” పథకం. మన మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన ఈ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి.
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం డిటైల్స్ :
ఇంతకీ, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి ?
అందరి అమ్మాయిలతో పాటు మహిళలందరికీ సురక్షితమైన పెట్టుబడిని అందుబాటులోకి తేవాలనేది ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం.
ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) కింద డిపాజిట్ చేసిన డబ్బుకు సంవత్సరానికి 7.5% వడ్డీ వస్తోంది.
ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం పథకానికి అర్హత ఏమిటి ?
1. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి తప్పనిసరిగా భారతీయ పౌరసత్వం ఉండాలి.
2. ఈ పథకం మహిళలకు మరియు ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తోంది.
3. ఈ పథకానికి ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. అన్ని వయసుల గల మహిళలు ఈ పథకం ప్రయోజనాలను సులభంగా పొందే అవకాశం ఉంది.
4. ఈ పథకం కోసం ఓపెన్ చేసిన ఎకౌంట్ లో కనీసం ₹1000/- ఉండాలి. అలాగే గరిష్ట పరిమితి ₹2,00,000/-. రెండు లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టలేం.
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం పథకానికి అవసరమైన పత్రాలు ఏమిటి ?
మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ?
మొదటి దశ : ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న వారు, మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లేదా బ్యాంక్ కు వెళ్ళండి.
రెండో దశ : ఈ స్కీమ్ కి సంబంధించిన ఫామ్ ను మీ వివరాలతో నింపండి.
మూడో దశ : ఆ దరఖాస్తు ఫామ్‌ను పూరించిన తర్వాత అన్ని అవసరమైన పత్రాలను ఆ ఫామ్ కి జత చేయాల్సి ఉంటుంది.
నాలుగో దశ : అలాగే, మీ డిక్లరేషన్ మరియు నామినేషన్ వివరాలను కూడా పూరించాల్సి ఉంటుంది.
ఐదో దశ : మీ పెట్టుబడి డిపాజిట్ చేశాక, చివరగా మీరు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకంలో పెట్టుబడి పెట్టినట్టు రుజువుగా బ్యాంక్ వారి ఇచ్చే పత్రాలను తీసుకోండి.

‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకం పలు ప్రశ్నలు – సమాధానాలు :
‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్’ పథకం గురించి సింపుల్ గా చెప్పండి ?
మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ చిన్న పొదుపు పథకం. అన్నట్టు ఇది రెండు సంవత్సరాల స్కీమ్. గరిష్టంగా ₹2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టుకోవచ్చు.
ఇంతకీ, ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు ఎంత ?
ఒక ఏడాదికి మీరు ఈ పథకంలో పెట్టిన ఎమౌంట్ కి 7.5% వరకూ వడ్డీ రేటు వస్తోంది.
ఈ పథకం ఎక్కువగా ఎవరు తీసుకోవచ్చు ?
ఒక మైనర్ బాలిక నుంచి ప్రతి మహిళా తీసుకోవచ్చు.
ఈ పథకం కింద ఎక్కడ ఓపెన్ చేస్తే మంచిది ?
ఈ పథకం తీసుకున్న ఏడాదికి కొంత డబ్బు తిరిగి తీసుకోవచ్చా ?
తీసుకోవచ్చు. కాకపోతే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన సంవత్సరం తర్వాత మాత్రమే మీరు కొంత డబ్బు తీసుకోవచ్చు. అది కూడా మీ బ్యాలెన్స్ లో 40% వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోగలరు. అనంతరం ఏడాది వడ్డీతో సహా మీ మొత్తం డబ్బును మీరు తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం. మీ ఇంటిలోని ప్రతి మహిళ చేత ఈ పథకాన్ని ఓపెన్ చేయించండి. వారికీ ఆర్థిక భరోసాని కల్పించండి.