బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ?, ఈ బిజీ బిజీ లైఫ్ లో చెప్పాపెట్టకుండా వచ్చేదే వెన్నునొప్పి.. అదే బ్యాక్ పెయిన్. మనం ఏవో పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పుడు హఠాత్తుగా మన వెన్నులో ఎక్కడో బాధ ప్రారంభమవుతుంది. మొదట్లో భరిస్తాం. కానీ, నేను ఉన్నానురా బాబు అంటూ ఆ పెయిన్ మాత్రం క్రమక్రమంగా మన వెన్నంతా పాకిపోతుంది. కూర్చోనివ్వకుండా, నిల్చో నివ్వకుండా తెగ ఇబ్బంది పెడుతుంది. మీకు తెలుసా ?, ఇప్పుడున్న బ్యాక్ పెయిన్ డేటాను బట్టి, ఈ వెన్ను నొప్పి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సి వస్తోందట.
మరి, ఈ వెన్ను నొప్పిని వదిలించుకునేందుకు ఏం చేయాలి ?, ప్రపంచంలో ఇప్పటివరకు బ్యాక్ పెయిన్ కి సంబంధించి బెస్ట్ టిప్స్ ఏం ఉన్నాయి ? చూద్దాం రండి. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ? అనేది చిన్న క్లారిటీ వచ్చింది కాబట్టి, ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఎలా పోతుందో తెలుసుకుందాం. కొన్ని సింపుల్ ఏరోబిక్ ఎక్సర్ సైజ్ లు చేస్తే చాలు.. వెన్నునొప్పి కాస్తా వెన్ను చూపి పరారవుతుంది.
బ్యాక్ పెయిన్ రిలీఫ్ కి బెస్ట్ టిప్ ఇదే :
బ్యాక్ పెయిన్ రిలీఫ్ కి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అన్ని సొల్యూషన్స్ కంటే కూడా చాలా ఈజీ అండ్ బెస్ట్ టిప్ ఇదే. కాబట్టి, ఈ కింద చెబుతున్న ఎక్సర్ సైజ్ ప్రాసెస్ ను ఒకటికి రెండు సార్లు చదివి బాగా అర్ధం చేసుకోండి.
- ముందుగా మీ పొత్తికడుపు మీద బరువంతా ఆనేలా పడుకోండి. మీ చేతులు ముందుకు చాచి, మీ నుదురును ఎడమ చేతి మీద ఉంచండి. ఇప్పుడు మీ కుడి చేతిని ఇంకా ముందుకు చాచి, ఎడమ కాలిని పైకి ఎత్తండి. అదే పొజిషన్ లో ఒక నిమిషం ఉండండి. మళ్ళీ ఇదే ఎక్సర్ సైజ్ ఎడమ చేయి, కుడికాలుతో ప్రాక్టీస్ చేయండి.
- మీ పొట్ట మీద బరువంతా ఆనేలా పడుకుని రెండు చేతులూ ముందర పెట్టుకోండి. మీ నుదుటిని చేతుల మీద ఆనించి,
కాళ్ళు రెండింటినీ దగ్గరగా ఉంచండి. మీ రెండు కాళ్లని ఒకేసారి వీలైనంత పైకి ఎత్తండి. కాలి మడమలని బాగా సాగదీసి, ఇదే పొజిషన్ లో ఒక నిమిషం సేపు ఉండండి.
- ఆ తర్వాత మీరు బోర్లా పడుకోండి. కాళ్ళు రెండింటి మధ్య కనీసం 45 సెంటీ మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడండి. అలాగే, ముందుకు చాపిన చేతుల మధ్య కూడా 20 సెంటీ మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
- మీ భుజాలను, కాళ్లని ఒకేసారి వీలైనంత పైకి లేవనెత్తండి. ఒక నిమిషం సేపు ఇదే పొజిషన్ లో ఉండండి. ఆ తర్వాత వెల్లకిలా పడుకుని మోకాళ్ళను – వంచండి. కుడి కాలి మడమను కుడి చేతితో గట్టిగా పట్టుకుని ఎడమ కాలిని పైకి ఎత్తండి.
- మీ ఎడమ చేత్తో ఆ కాలిని పట్టుకోండి. ఆ తర్వాత కుడి కాలు, కుడి చేత్తో ఇదే ఎక్సర్ సైజ్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఎక్సర్ సైజ్ చేసేందుకు ఒక కిటీకికి ఎదురుగా నిలబడి మీ కుడి కాలిని ఎత్తి పాదం కిటికీ అంచు మీద ఆనించండి. కుడి కాలి మడమను కుడి చేత్తో గట్టిగా పట్టుకుని వీలైనంత వెనక్కి వంగండి. ఇదే పొజిషన్లో ఒక నిమిషం ఉండి, ఆ తర్వాత ఈ ఎక్సర్ సైజ్ ను మీ ఎడమకాలితో కూడా ప్రాక్టీస్ చెయ్యండి. ఇలా చేస్తే మీ బ్యాక్ పెయిన్ బ్యాక్ వెళ్లిపోతుంది.
బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తోంది ? అలాగే రిలీఫ్, ట్రీట్మెంట్ గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకుందాం రండి
అసలు, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది ?
ఇంకా క్లారిటీగా ఎందుకు వస్తుందో చెప్పాలి అంటే.. మీరు పదే పదే హెవీ లిఫ్టింగ్ ఎత్తినా వస్తోంది. అలాగే, ఉన్నట్టు ఉండి, మీరు సడెన్ గా ఇబ్బందికరంగా కదలినా మీ వెనుక కండరాలు పట్టేస్తాయి. అప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తోంది. మీ వెన్నెముక స్నాయువులు దెబ్బతిన్నా వస్తోంది. ఇక వెన్నుపై స్థిరమైన ఒత్తిడి కారణంగా కూడా బ్యాక్ పెయిన్ వస్తోంది.
బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఏ టాబ్లెట్ బెస్ట్ ?
నిజానికి బ్యాక్ పెయిన్ తగ్గడానికి టాబ్లెట్స్ లేవు. కానీ మీ పెయిన్ తగ్గించడానికి మాత్రం కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ (NSAID) బాగా రిలీఫ్ ఇస్తోంది. ఈ టాబ్లెట్ వాడితే మీ వెన్ను నొప్పి నుండి మీకు ఉపశమనం దొరుకుతుంది. అలాగే, ఇబుప్రోఫెన్ (అడ్విల్) మరియు నాప్రోక్సెన్ (అలేవ్) వంటి టాబ్లెట్స్ కూడా మీ బ్యాక్ పెయిన్ కి మంచి రిలీఫ్ ను ఇస్తాయి.
బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఏ బైక్ వాడితే మంచిది ?
బ్యాక్ పెయిన్ కి బెస్ట్ బైక్స్.. ముందుగా హీరో స్ప్లెండర్ ప్లస్ బ్యాక్ పెయిన్ కి బెస్ట్ బైక్. హోండా SP 125 కూడా మంచి ఛాయిస్. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కూడా బ్యాక్ పెయిన్ కి మంచి రిలీఫ్. అలాగే, బజాజ్ అవెంజర్ క్రూజ్ 220, హీరో ఎక్స్‌పల్స్ 200 4V కూడా వాడొచ్చు. వీటిలో ఏది బెస్ట్ అంటే హీరో స్ప్లెండర్ ప్లస్.
(బ్యాక్ పెయిన్) వెన్నునొప్పి వల్ల వాంతులు వస్తాయా?
కొన్నిసార్లు వెన్నునొప్పి కారణంగా వాంతులు వస్తాయి. డాక్టర్ రవి శంకర్ ఇదే విషయం పై మాట్లాడుతూ.. మన మూత్రపిండాల మధ్య – వెనుకకు ఇరువైపులా నొప్పి వస్తే.. అది కూడా ఒక వైపు మాత్రమే నొప్పి ఉంటే వాంతులు రావొచ్చు. ఎందుకంటే అలాంటి నొప్పి మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడే వస్తోంది. ఆ రాళ్లు ఒక్కోసారి వెనుక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఒక్కోసారి నొప్పితో పాటు వాంతులకు కూడా కారణం అవుతుంది.
వెనుక పై భాగంలో మాత్రమే బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తోంది ?
సింపుల్ గా చెప్పాలంటే.. మీ వెన్నుపూస పగులు; లేదా హెర్నియేటెడ్ డిస్క్ వంటి సమస్యల కారణంగా వెనుక పై భాగంలో బ్యాక్ పెయిన్ వస్తోంది. దీని వల్ల వెన్నెముక నరాలపై ఒత్తిడి పెరిగి రోజులు గడిచే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది.
నిలబడటం వల్ల బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి) తగ్గుతుందా?
నిలబడటం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అని కొందరు రోగులు చెబుతూ ఉంటారు. నిజానికి నిలబడటం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గదు. కాకపోతే, నిలబడటం వల్ల వెనుక భాగంలోని వీపుపై ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిందో.. అప్పుడు పెయిన్ కూడా తగ్గినట్టు అనిపిస్తోంది. అందుకే, నిలబడటం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అంటారు. కానీ ఇది నిజం కాదు. పైగా బ్యాక్ పెయిన్ ఉన్నవారు ఎక్కువ సేపు నిలబడితే కాలు వాపు, పాదాల నొప్పి వచ్చే ఛాన్స్ ఉంది.
(బ్యాక్ పెయిన్) నడుము నొప్పితో ఎలా కూర్చోవాలి?
బ్యాక్ పెయిన్ ను ఎప్పుడు ఎమర్జెన్సీ గా తీసుకోవాలి ?
ఎప్పుడైతే మీ బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు అది ఎమర్జెన్సీ అని అర్థం చేసుకోండి. ఉదాహరణకు : మీరు నిలబడటానికి, అలాగే నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే.. దాన్ని బ్యాక్ పెయిన్ ఎమర్జెన్సీ అని అర్థం.
బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తోంది ఓకే, తగ్గడానికి ఎంత టైమ్ పడుతుంది ?
బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఒక ఫిక్స్డ్ టైమ్ అంటూ లేదు. బ్యాక్ పెయిన్ ఉన్న స్టేజ్ ను బట్టి అది ఆధారపడి ఉంటుంది. చాలా మంది వ్యక్తుల్లో ఒక వారం లేదా రెండు వారాల్లోనే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. కానీ, మరికొందరిలో మాత్రం బ్యాక్ పెయిన్ దీర్ఘకాలికంగా ఉంటుంది.
అసలు బ్యాక్ పెయిన్ కి డాక్టర్స్ ఏం చేస్తారు ?
డాక్టర్స్ బ్యాక్ పెయిన్ పేషంట్ ని టెక్స్ట్ చేసి.. ఆ బ్యాక్ పెయిన్ కి మందులు, నాన్ సర్జికల్ ట్రీట్‌మెంట్ లు అందిస్తారు. ఒకవేళ, బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే.. సర్జికల్ ట్రీట్‌మెంట్ ను సూచిస్తారు.