బాల్ జీవన్ బీమా యోజనతో   మీ పిల్లలకు గొప్ప భవిష్యత్తు  

బాల్ జీవన్ బీమా యోజన పథకం  మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తోంది. కానీ, మనలో చాలా మంది  జీవిత బీమా అంటే పెద్ద వాళ్లకు మాత్రమే అనుకుంటారు. అసలు బీమా ఎందుకు తీసుకుంటారు ?, మీ భవిష్యత్తు కోసమే కదా. ఒకసారి ఆలోచించండి. మీకు ఎక్కువ భవిష్యత్తు ఉందా ?, లేక  మీ పిల్లలకు ఎక్కువ భవిష్యత్తు ఉందా ?,  ఈ ప్రశ్నకి సమాధానం పిల్లలే.  మరి జీవిత బీమా పిల్లలకు అవసరమా ?..  కాదా ?,  ఆ అవసరాన్ని గుర్తించింది కాబట్టే..  కేంద్ర ప్రభుత్వం,  ఇండియన్‌ పోస్టాఫీస్‌ ద్వారా మీ పిల్లల కోసం  ఓ అద్భుతమైన జీవిత బీమా పథకం తెచ్చింది. ఆ పథకం పేరే.. బాల్ జీవన్ బీమా యోజన పథకం.   

అసలు చిన్నారుల కోసం ఓ జీవిత బీమా పథకం పెట్టారు అంటే.. ఇందులో ఏదో ఉండే ఉంటుంది అనిపిస్తోంది కదూ. నిజంగానే  బాల్ జీవన్ బీమా యోజన పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ?, అసలు ఈ పథకాన్ని ఎవరు తీసుకోగలరు ?,  పథకం తీసుకున్న తర్వాత  పాలసీని ఎలా పొందాల్సి ఉంటుంది  ?, ఇంతకీ ఈ పథకం ద్వారా ఎవరికీ ఎక్కువ మేలు జరుగుతుంది ?  లాంటివి ఎన్నో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

నేడు సంపాదిస్తున్న రూపాయి  రేపటి సంతోషాలకు పునాది అంటుంటారు. మీరే చూసి ఉంటారు. సమాజంలో రేట్లు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. పైగా కరోనా అనంతరం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో  ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఉదాహరణకు ఓ వాస్తవ సంఘటన గురించి విందాం. సురేష్ అనే అతను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారు. కానీ, సురేష్ ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఇప్పుడు సురేష్ పిల్లల బతుకులు ఎలా సాగుతాయి ?, అదే సురేష్ గానీ, బాల్ జీవన్ బీమా యోజన పథకం తీసుకుని ఉండి ఉంటే.. ఆ పిల్లలకు  ఆర్ధిక భరోసా ఉండేది. అందుకే, ఈ పథకం ప్రతి పిల్లవాడి పేరిట ఉండాలి.         

బాల్ జీవన్ బీమా యోజన పథకం పూర్తి వివరాలు ఇవే  : 

ముందుగా  ఈ పథకంలో ఏమిటి ప్రత్యేకత ?, మీరు మీ పిల్లల పై  రోజుకు రూ. 6 పొదుపు చేస్తూ వెళ్తే.. ఈ పథకం  మెచ్యూరిటీ అయ్యే సమయానికి లక్ష రూపాయలు మీకు వస్తాయి. సింపుల్ గా  రూ. 6 లకు లక్ష రూపాయలు అంటే ఇక అంతకు మించి కావాల్సింది ఏముంది ?,  మరి 25 లక్షలు రావాలంటే రోజుకు రూ.150/- చెల్లించాల్సి ఉంటుంది.        

  • అలాగే,  ఒక ఫ్యామిలీలో కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. 
  • అన్నట్టు ఈ పథకం తీసుకోవడానికి, పిల్లల వయస్సు 5 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల మధ్యే ఉండాలి. అప్పుడే వారికి ఈ పథకం వర్తిస్తోంది.
  • మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే..  బాల్ జీవన్ బీమా యోజన పథకం కొనుగోలు చేసే సమయంలో పాలసీదారు (తల్లి లేదా తండ్రి) వయస్సు కచ్చితంగా 45 సంవత్సరాలు లోపే ఉండాలి.  

 

  • ఒకవేళ  బీమా యోజన పథకం తీసుకున్న బాలుడు మెచ్యూరిటీకి ముందే చనిపోతే..  అటువంటి పరిస్థితిలో, ఇకపై పాలసీ ప్రీమియం చెల్లించక్కర్లేదు.  ఎప్పుడైతే పాలసీ గడువు ముగుస్తోందో..  ఆ తర్వాత, పిల్లలకు పూర్తి మెచ్యూరిటీ డబ్బును ఇస్తారు.
  • బాల్ జీవన్ బీమా యోజన పాలసీ ప్రీమియాన్ని బాలుడి తల్లిదండ్రులే  చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇక మీకు వద్దు అనుకుంటే, ఈ పథకాన్ని 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు.
  • అదేవిధంగా మరో ప్రధాన అంశం ఏమిటంటే.. రూ. 1000 హామీ మొత్తం మీద ప్రతి సంవత్సరం రూ. 48  బోనస్ ఇస్తున్నారు.  

 

ఈ పథకానికి కావాల్సిన అర్హత ఏమిటి ?  

 

 

పరిమితులు    వివరణ
కనీస వయస్సు 5 ఏళ్ళు దాటిన వారు మాత్రమే. 
గరిష్టంగా ఎంత వయస్సు ?20 సంవత్సరాల లోపు మాత్రమే
మొత్తం ఎంత  వరకు ఎమౌంట్రూ. 1 లక్ష వరకూ.  
ఒక ఫ్యామిలీలో లిమిట్ ఎంతఒకే తల్లిదండ్రులకు సంబంధించిన  ఇద్దరు పిల్లల కు బీమా చేసుకోవచ్చు.
తల్లిదండ్రుల వయస్సుకచ్చితంగా  45 సంవత్సరాలకు మించకుండా  ఉండాలి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ  పథకానికి  అవసరమైన పత్రాలు ఏమిటి ?

  • మీ పిల్లల ఆధార్ కార్డ్ తప్పనిసరి.   
  • మీ బర్త్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి.
  • మీ నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరి.
  • మీ మొబైల్ నంబర్ కూడా  తప్పనిసరి.
  • బాలుడి పాస్ పోర్ట్ సైజు ఫోటో కావాలి.
  • అలాగే,  తల్లిదండ్రుల ఆధార్ కార్డు కూడా  తప్పనిసరి.  


పైన చెప్పిన లిస్ట్ లోని పత్రాలు అన్ని తీసుకుని
మీకు దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి ఈ పథకంలో చాలా సులభంగా జాయిన్ కావొచ్చు.   

 

బాల్ జీవన్ బీమా యోజన పథకం  ఆన్‌ లైన్‌ విధానం:

  • చాలామంది ఆన్‌ లైన్ ద్వారా కూడా ఈ పథకంలో చేరాలనుకుంటారు. వారి కోసం స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నాం.
  • ముందుగా మీరు ఇండియన్ పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్ళండి.
  • మీరు గమనిస్తే.. వెబ్ సైట్ పేజీ ఎగువన, బీమా ట్యాబ్ ఒకటి కనిపిస్తోంది.  దానిపై మీరు క్లిక్ చేయండి.
  • క్లిక్ చేసిన వెంటనే..  గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంపిక పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో  మీరు మీ పేరు, చిరునామా మరియు మీ పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • వివరాలను ఇచ్చిన తర్వాత  బాల్ జీవన్ బీమా ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత, మళ్లీ కొన్ని వివరాలను అడుగుతుంది. వాటిని నింపండి.
  • అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత..  మీ ప్రీమియం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. గమనిక : డబ్బు చెల్లించే ముందు ప్రతిదీ తనిఖీ చేసుకోగలరు.
  • మొత్తానికి మీ ప్రీమియం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించిన తర్వాత, బాల్ జీవన్ బీమా యోజన పాలసీ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

 

బాల్ జీవన్ బీమా యోజన పథకం పై  పలు ప్రశ్నలు – సమాధానాలు :   

ఈ పథకం ముఖ్య ప్రయోజనాలు ఏమిటి ?

ముఖ్య ప్రయోజనం అంటే…  యాక్టివ్ గా ఉన్న పాలసీ యొక్క పాలసీదారుడు మరణిస్తే,  ఆ పాలసీకి సంబంధించిన ప్రీమియంలు ఇక కట్టాల్సిన పని లేదు. ప్రీమియంలు కట్టకపోయినా పాలసీ ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.

 

ఈ పథకం  మెచ్యూరిటీ వ్యవధి ఎంత ?

పథకం తీసుకున్న పాలసీదారుడు కనీసం 5 సంవత్సరాల పాటు రెగ్యులర్ గా ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం మీ బీమాను చెల్లింపు పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది.

Leave a Comment