బన్నీ త్రివిక్రమ్ కథ ఇదే  

బన్నీ త్రివిక్రమ్ కథ :  త్రివిక్రమ్ – అల్లు అర్జున్  కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గొప్ప ఫిక్షన్ డ్రామా అని తెలుస్తోంది. చరిత్రలోని కళింగ యుద్ధం గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అదొక భారీ యుద్ధం, ఆ యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టం జరిగింది. రాజ్యమంతా విషాదంగా మారింది. ఇదే నేపథ్యంలో కథ అల్లాడు త్రివిక్రమ్. అల్లు అర్జున్ మహా యోధుడిగా కనిపించబోతున్నాడు. ఓ వీరుడు శాంతి వైపు వెళ్తే..  పాలనపై దృష్టి పెడితే.. ఆ క్రమంలో ఎంత మంచి జరుగుతుంది, ప్రజల జీవితాలు ఎంతగా మారతాయి ? అనేది ఈ బన్నీ త్రివిక్రమ్ కథ  మెయిన్ థీమ్. ఎలాగూ యుద్ధ నేపథ్యం కాబట్టి, అల్లు అర్జున్ కి మంచి యాక్షన్ సీన్సే పడతాయి.

 

బన్నీ త్రివిక్రమ్ కథలో చాలా వేరియేషన్స్ :

కథకు అనుగుణంగా అల్లు అర్జున్ పాత్ర అజ్ఞాత యోధుడిగా కనిపించాలి. ఇదీ ఆ ఫిక్షన్ కథలోని కోర్ ఎమోషన్ నేపథ్యం. నిజానికి ఇలాంటి కథల పై ఇప్పటికే,  బోలెడు యూట్యూబ్ వీడియోలు, కథనాలు, పుస్తకాలు గట్రా వైరల్ అయ్యాయి.  కాకపోతే, త్రివిక్రమ్ ఈ కథలో తీసుకున్న ప్రధానమైన పాయింట్.. ఫిజియాలజీ. అసలు ఈ ఫిజియాలజీ మన భారతదేశంలోనే పుట్టింది.  ఒక వ్యక్తిని స్పర్శతో చంపే పద్ధతి కూడా పూర్వకాలంలో భారత్ లో ఉండేది. కొందరు ఇదెలా సాధ్యం అంటారు ?, నరాల ప్రేరణను తిప్పికొట్టడం ద్వారా ఓ మనిషిని కేవలం స్పర్శతో చంపొచ్చు. బన్నీ  త్రివిక్రమ్ కథలో ఈ పాయింట్ కూడా మెయిన్ కానుంది.

పురాతన భారతియాన్ని కూడా గొప్పగా చూపించాలని త్రివిక్రమ్ ఇలాంటి పాయింట్స్ ను కథలో హైలైట్ చేస్తూ సీన్స్ రాసుకున్నాడు. కథ ఫిక్షనే… కానీ నిజంగానే మనిషి మనుగడను ప్రభావితం చేయబోయే అత్యంత కీలకమైన అంశాలను ఈ సినిమాలో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం ప్లాప్ తర్వాత.. త్రివిక్రమ్ ఈ కథ పై మరింత కసరత్తులు చేస్తున్నాడు.

బన్నీ – త్రివిక్రమ్ కథ కు  పుష్ప విజయం కూడా ఓ కారణమే :

 

పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ పెరిగింది. ఇప్పుడు పార్ట్ 2 పై కూడా భారీ బజ్ క్రియేట్ అయ్యింది. కాబట్టి, ఈ పార్ట్ 2 కి కూడా భారీగా కలెక్షన్స్ వస్తాయి. పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ మార్కెట్ కూడా పెరుగుతుంది. దీనికి అనుసరణగా, కొనసాగింపుగా కూడా తన సినిమా ఉండాలి అనేది త్రివిక్రమ్ పట్టుదల. అందుకే, హిస్టారికల్ కంటెంట్ తో భారీ విజువల్ ఫిక్షన్ డ్రామాను చేయాలని  త్రివిక్రమ్ ఈ కథ రాశాడు.

ఎలాగూ  బోలెడంత కంటెంట్ హిస్టారికల్ సాహిత్యంలో క్రియేట్ చేయబడింది కాబట్టి,  ఇక ఆ కంటెంట్ ను ఎలా వాడుకోవాలో.. త్రివిక్రమ్ కి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి, ఈ బన్నీ – త్రివిక్రమ్ కథ  పాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కంటెంట్ భిన్నరకాలుగా టచ్ చేస్తే.. కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఇలాంటి  ఫిక్షన్ రేంజులో ఓ రెండు గంటల సినిమాగా చిత్రీకరించడం, అదీ ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తూ, కన్విన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకోవడం త్రివిక్రమ్ కి అతి  పెద్ద టాస్క్. అలాగే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించి అలరించడం ఇటు అల్లు అర్జున్ కి కూడా టాస్కే. ఐతే, ఆ టాస్క్ లను బన్నీ ఈజీగా చేస్తాడు అనుకోండి.

Leave a Comment