ప్రోటీన్ ఫుడ్ లిస్ట్..  బెస్ట్ హెల్త్ కోసం   

ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ తెలుసుకునే ముందు..  అసలు మీరు కొనేది  తినేది మంచిదేనా ?, ఆలోచించాల్సిందే. మంచిదే అని చెప్పలేని పరిస్థితి మనది. పొలాలకు చల్లే యూరియాతో  పాలు తయారు చేసి అమ్ముతున్న రోజులు ఇవి.  ప్రతి తల్లిదండ్రులకు ఇది అతి పెద్ద సమస్య అయిపోయింది. తమ పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. కానీ, ప్రతి వస్తువూ  నేడు కల్తీ అవుతోంది. అందుకే,  మీ పిల్లలకు ప్రోటీన్ ఫుడ్ పెట్టే ముందు.. కల్తీ చేసిన ఆహార పదార్ధాలను  మీరు కని పెట్టాల్సి ఉంటుంది. బాబోయ్ నేనా ఎలా కనిపెట్టగలను అనుకుంటున్నారా ?.  కల్తీ ఫుడ్ ను కనిపెట్టాలంటే పెద్ద శాస్త్రవేత్తలు కావాల్సిన పనిలేదు. మీ ఇంట్లోనే అతి సునాయాసంగా వీటిని గుర్తించే వీలుంది.

 

ఏయే పదార్థాలతో కల్తీ చేస్తారు ?, వాటి ప్రభావం ఎలా ఉంటుంది ?,  అసలు వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం రండి.  

ఆవాలు… నలిపితే తెలుపు.  

మీరు రోజూ వంటింటిలో ఉపయోగించే ఆవాలను కూడా కల్తీ చేస్తారు. కల్తీ చేయడానికి కలిపే పదార్థం ఏమిటో తెలుసా ?, బ్రహ్మజెముడు గింజలు. ఇవి అచ్చం ఆవాలు లాగే ఉంటాయి. ఇవి కలిపితే వచ్చే ఆరోగ్య సమస్య కడుపునొప్పి. పిల్లల్లో ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది.  

 

కల్తీ ఆవాలు ను ఎలా చెక్ చేయాలి ?

ఆవాలు నీటిలో కలపండి. ఒకవేళ వాటిలో బ్రహ్మజెముడు గింజలు ఉంటే.. అవి నీటిపై తేలతాయి. అప్పుడు ఆవాలు లో కల్తీ జరిగిందో లేదో తెలిసిపోతుంది.

మరో టిప్ : ఆవాల్ని చేత్తో నలిపితే గింజ లోపలి అంచుల్లో పసుపు ఛాయ కనిపిస్తుంది. అలా కనిపిస్తే అవి ఒరిజినల్ ఆవాలు. అదే బ్రహ్మజెముడు విత్తనాలు లోపల తెలుపు రంగులో ఉంటాయి.

బెల్లం… పొట్టకు చేటు 

 

బెల్లంలో కలిపే పదార్థం సుద్ద పొడి. దీన్ని వల్ల ఆరోగ్య సమస్య కడుపులో నొప్పి.

బెల్లం పరీక్ష విధానం: చిన్న పరిమాణంలో బెల్లం తీసుకుని నీటిలో కలిపితే పొడి అడుగు భాగానికి వెళుతుంది. అప్పుడు అది మంచి బెల్లం. వెళ్లకపోతే దానిలో సుద్ద పొడి కలిపారని అర్ధం చేసుకోవచ్చు.


కందిపప్పు… రుగ్మతల ముప్పు

కందిపప్పులో కలిపే పదార్థం కేసరి పప్పు. దీని వల్ల వచ్చే ఆరోగ్య సమస్య పక్షవాతం.

పరీక్ష విధానం: పప్పును భూతద్దంతో జాగ్రత్తగా గమనిస్తే… కేసరి పప్పును సులభంగా గుర్తించవచ్చు. కందిపప్పు ఆకారం గుండ్రంగా, కేసరిపలకలుగా ఉంటుంది. రీసెంట్ గా హైదరాబాద్ లోని పలు కిరాణా షాపుల్లో కందిపప్పులో కేసరి పప్పు కలిపి అమ్ముతూ దొరికిపోయారు.   

పాలు… అనారోగ్యంపాలు

పాలు కల్తీ చేయడానికి కలిపే పదార్థం: బియ్యం పిండి, గంజిని కలుపుతారు.
దీనివల్ల సమస్య: డబ్బుకు తగ్గ ప్రతిఫలం లభించదు. పౌష్టిక విలువులు దక్కవు.

మరి పరీక్ష విధానం: చిన్నపాత్రలో కాచి చల్లార్చిన పాలను తీసుకుని 4, 5 చుక్కల అయోడిన్ కలపాలి. నీలిరంగులోని మారితే పాలు కల్తీ చేశారన్నమాట. ఇలా పరీక్ష చేసి.. కల్తీ లేని ఫుడ్ ను మాత్రమే మీ పిల్లలకు పెట్టండి.   

 

ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ విషయానికి వస్తే :  


తమ పిల్లలు ఆరోగ్యంగా  బలంగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రులకు కోరుకుంటారు. కానీ ఎంత మూల్యానికి ?,  పిల్లలకు  పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించడం ఎంత ముఖ్యమో.. కల్తీ లేని ఆహారం అందించడం అంతకన్నా ముఖ్యం. అదేవిధంగా మీ పిల్లలు వారి ఎదుగుదల, వారి మెదడు అభివృద్ధి, వారికీ తగినంత ప్రొటీన్‌లను అందేలా చూసుకోవడం మీ బాధ్యత. మరి ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ చూద్దాం రండి. 

 
 

గ్రీన్ ఫుడ్ : 

 

గ్రీన్ ఫుడ్ అంటే.. తాజా పండ్లు  పచ్చని  కూరగాయలు. ఇవి మీ పిల్లల్లో  అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ కంటెంట్ ను అందిస్తాయి.      


ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్  గుడ్లు : 

నిజంగా గుడ్లు ఒక మల్టీ ప్రోటీన్ మూలం అని చెప్పొచ్చు.  మీ పిల్లలకు గుడ్లు  ఉడకబెట్టి ఇచ్చినా, లేదా ఆమ్లెట్‌ లుగా  అందించినా మంచిదే. గుడ్లు వల్ల అవసరమైన పోషకాలతో పాటు మీ పిల్లలకు అమైనో ఆమ్లాలను కూడా బాగా అందుతాయి. అందుకే, ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో  గుడ్లుదే ఫస్ట్ ప్లేస్.    

 

పెరుగు : 

పెరుగు కూడా ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో ఉంది.  ప్రొటీన్లతో పాటు కాల్షియం కూడా మీ పిల్లలకు సమృద్ధిగా అందాలి అంటే.. పెరుగు ఒక మంచి ఆప్షన్. సాదా పెరుగును ఎంచుకోండి. రుచి కోసం పెరుగులో పండ్ల రసం లేదా తేనె వేసి మీ పిల్లలకు పెట్టొచ్చు. 

  

నట్ బట్టర్ : 

వేరుశెనగ బట్టర్,  లేదా, బాదం బట్టర్  లేదా  ఇతర గింజ బట్టర్ లు ప్రోటీన్ ఇవ్వడంలో ముందు ఉంటాయి. అందుకే.. మీ పిల్లలకు నట్ బట్టర్ ఇవ్వడం మర్చిపోవద్దు.        

 

చీజ్: 

 

జున్ను రుచికరమైనది మాత్రమే కాదు, ప్రోటీన్ మరియు కాల్షియంలో జున్ను మిన్నే. కాకపోతే,  చీజ్ ల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో స్ట్రింగ్ చీజ్, చెడ్డార్ లేదా కాటేజ్ చీజ్ మంచివి.  

 
 

ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో పౌల్ట్రీ కీలకం : 

 

చికెన్ కూడా  ప్రోటీన్ కి మూలాలే. బాగా కాల్చిన చికెన్ స్ట్రిప్స్ ను శాండ్‌ విచ్‌ ల పై  లేదా  సలాడ్‌ లలో వేసి మీ పిల్లలకు పెట్టండి. వారి చాలా ఇష్టంగా తింటారు.  

 

ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో పప్పు పత్యేకం  :  

 

పప్పు దినుసుల్లో ప్రోటీన్ తో పాటు  ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే, పప్పు దినుసులతో రకరకాల ఐటమ్స్ చేసి మీ పిల్లలకు అందించండి. 

 

బీన్స్ : 

బీన్స్ లో  కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ చాలా మంచివి. వీటిలో  చిక్‌పీస్ ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది.

ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో మూడో ప్లేస్  చేప : 

 

చేపల్లో సాల్మన్, ట్యూనా లేదా కాడ్ వంటి చేపలు మంచివి.  ఇవి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో పాటు ప్రోటీన్‌లను కూడా  బాగా అందిస్తాయి.     


ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ లో నాలుగో ప్లేస్  టోఫు : 

టోఫు అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం. టోఫు క్యూబ్‌లను మెరినేట్ చేసి కాల్చి తింటే.. మంచి ప్రోటీన్స్ అందుతాయి.  

ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యం. కాబట్టి, ఈ లిస్ట్  లో చెప్పిన అన్ని ఐటమ్స్ ను మీ రోజువారీ ఫుడ్ లో భాగం చేసుకోండి. మీ పిల్లలతో పాటు మీరు కూడా పై  ఆహార పదార్ధాలను తింటే..  మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.         

Leave a Comment