ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అప్లికేషన్ గురించి మాట్లాడుకునే ముందు.. ఇంటి విలువ గురించి మాట్లాడుకుందాం. జీవితంలో పరిస్తుతులు మిమ్మల్ని ఎన్నో ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. కానీ, ప్రేమ మాత్రం మిమ్మల్ని మీ ఇంటికే తీసుకు వస్తోంది. అందుకే, ఇల్లు ప్రతి ఒక్కరి కల. సహజంగా ఇల్లు ఇటుకలు, సిమెంట్ తో కట్టినా.. దాని వెనుక ఆశలు, కలలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు ఒక స్థలం కాదు.. ఒక అనుభూతి, ఒక భరోసా. కానీ, బ్యాడ్ లక్ ఏమిటంటే.. ఇప్పుడు ఓ సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి ఓ జీవిత కాలం పడుతుంది. అందుకోసమే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకువచ్చింది. దాని పేరే ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన’ పథకం. పేదలకు స్థిరమైన, సరసమైన గృహాలను అందించాలనే ఉద్దేశ్యంతో 2015న జూన్ 1వ తేదీన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది.
ఇంతకీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి ?
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం మెయిన్ ఫీచర్స్ ఇవే :
ఈ పథకం ప్రధానంగా షెడ్యూల్డ్ కులాల వారికి, అలాగే.. షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారితో పాటు పేద మహిళలకు, అలాగే మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. వారి గృహనిర్మాణానికి భరోసాగా నిలుస్తోంది.
కాకపోతే, ఈ పథకం నుంచి కచ్చితంగా ప్రయోజనాలను పొందాలి అంటే.. పథకం కోసం నమోదు చేసుకునే సమయంలోనే లబ్ధిదారుని పేరు కుటుంబంలోని మహిళదే ఉండాలి. తల్లి పేరు లేదా, భార్య పేరు పెట్టాల్సి ఉంటుంది.
ఈ పథకంలో మరో గొప్ప ఆప్షన్ ఏమిటంటే.. పేదలు, మైనారిటీ వర్గాలతో పాటు వితంతువులకు అలాగే లింగమార్పిడి చేసుకున్న వ్యక్తులకు కూడా ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం రెండు రకాలు :
ఈ పథకం కేవలం సిటీలకు అలాగే టౌన్ లకు మాత్రమే పరిమితం కాదు. ఇతర గ్రామీణ ప్రాంతాలలోని చిన్న చిన్న గ్రామాలు, అదేవిధంగా మురికివాడల్లోని పేదలు కూడా ఈ క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకం పరిధిలోకి వస్తారు. కాకపోతే, పట్టణ ప్రాంతం కోసం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్’ అని పేరు పెట్టారు. అలాగే గ్రామీణ ప్రాంతం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అని పేరు పెట్టారు.
1) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం :
2) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం :
ఈ అర్బన్ పథకం భారతదేశం అంతటా నగరాలు మరియు పట్టణాలను కలిపి సుమారు 4,300 ఏరియాలు ఉన్నాయి.

ఈ పథకాన్ని ఆశించే వారు ఇవి తప్పక తెలుసుకోండి :
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి పై ఏ ఇతర పక్కా ప్రాపర్టీలు ఉండకూడదు. అలాగే, ఈ పథకం దరఖాస్తు చేసుకునే వ్యక్తి, అంతకు ముందు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతర గృహ పథకానికి సంబంధించి ఎటువంటి సహాయం లేదా ప్రయోజనాలను పొంది ఉండకూడదు.
ఈ పథకం ద్వారా ఇల్లు కొనుగోలు చేయాలంటే.. ఆ ఇల్లు లేదా ఆస్తి తప్పనిసరిగా జనాభా లెక్కల ప్రకారం ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు లేదా నగరాల్లో ఒకదానికి చెందినదై ఉండాల్సిందే.
అలాగే, ఈ పథకం ప్రయోజనాలను ఆశించే లబ్ధిదారుడు.. గతంలో ఏదైనా క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పథకం కింద ప్రయోజనాలను పొంది ఉండకూడదు.
ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ?
- ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ఇదే :
- ముందుగా ఈ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ లింక్ ఓపెన్ చేసి https://pmaymis.gov.in/ సైట్ లోకి వెళ్ళండి.
- మీరు కరెక్ట్ గా ‘మెనూ’ ట్యాబ్ ను గమనిస్తే.. దాని కింద ఉన్న ‘సిటిజన్ అసెస్‌మెంట్’ అనే ఆప్షన్ కనిపిస్తోంది. దాని పై క్లిక్ చేయండి.
- క్లిక్ చేయగానే మీకు ఓ ఆప్షన్ కనిపిస్తోంది. గుర్తు పెట్టుకోండి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది.
- మీ ఆధార్ నంబర్‌ను ఇచ్చాక, అప్లికేషన్ పేజీకి వెళ్తారు.
- ఆ అప్లికేషన్ పేజీలో మీ ఆదాయ వివరాలతో పాటు మీ వ్యక్తిగత వివరాలు మరియు మీ బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా ఇతర అవసరమైన సమాచారంతో సహా అన్ని సంబంధిత వివరాలతో మీరు ఆ ఆ అప్లికేషన్ పేజీని నింపండి.
- ఆ అప్లికేషన్ పేజీలో మీ సమాచారం ఇవ్వడం అయిపోయాక, మళ్లీ ఒకసారి మొత్తం చెక్ చేసుకుని ఆ పేజీని ‘సేవ్’ కొట్టండి.
- మీరు ‘సేవ్’ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత, మీకు ప్రత్యేకమైన అప్లికేషన్ నంబర్ వస్తోంది.
- ఆ తరువాత, మీరు నింపిన ఆ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం నింపే క్రమంలో మీకు ఎలాంటి అనుమానాలు కలిగిన.. ఆ ఆప్షన్స్ ను ఒకటికి రెండుసార్లు చదవండి. మీకే అర్థమవుతుంది.
(PMAY) ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్‌లు :
1800 -11-6446 (గ్రామిన్)
1800-11-3388 (అర్బన్, NHB)
1800-11-3377 (అర్బన్, NHB)